భారతీయ రైల్వేలో రైళ్లను శుభ్రం చేయడం అనేది అత్యంత శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఇప్పటి వరకు మనుషులు రైళ్లను కడిగే వాళ్లు. కానీ, ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి రైళ్లను క్లీన్ చేస్తున్నారు. గుజరాత్ లో మొట్టమొదటి సారిగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ను డ్రోన్ సాయంతో కడిగారు. ఈ డ్రోన్ జస్ట్ 30 నిమిషాల్లోనే 25 కోచ్ లను సక్సెస్ ఫుల్ గా శుభ్రం చేసింది. మనుషులతో పోల్చితే అత్యంత వేగంగా, మరింత శుభ్రంగా పని పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా రైళ్లను ఈ డ్రోన్ల ద్వారా శుభ్రం చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు.
వాటర్ డ్రోన్ వ్యవస్థను ఉపయోగించి రైళ్లను కడగడానికి రైల్వే అధికారులు తాజాగా ట్రయల్ నిర్వహించారు. ఉధ్నా-బ్రహ్మపూర్ అమృత్ భారత్ రైలు కోచ్‌లను డ్రోన్ ల సహాయంతో గుజరాత్ లో వాష్ చేశారు. సూరత్, ఉధ్నా రైల్వే స్టేషన్లలో 24 రైలు కోచ్‌లను కడగడానికి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు. వాటర్ డ్రోన్ ను కోచ్ లను శుభ్రం చేయడానికి వాడారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి, 25 కోచ్ లను జస్ట్ 30 నిమిషాల్లో శుభ్రంగా కడిగారు. ఇంతకు ముందు ఎక్కువ మంది వ్యక్తులు, ఒక్క రైలును కడగడానికి కనీసం మూడు గంటలు సమయం తీసుకునే వాళ్లు. కానీ, ఇప్పుడు అరగంటలో క్లీన్ చేశారు.
రైళ్లను శుభ్రం చేసే డ్రోన్లను సూరత్‌కు చెందిన ఇద్దరు యువకులు తయారు చేశారు. దీనిని తయారు చేయడానికి సుమారు రూ. 4 లక్షలు ఖర్చు అయ్యింది. గుజరాత్ మొట్టమొదటి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఉధ్నా రైల్వే స్టేషన్‌కు వచ్చినప్పుడు ఈ డ్రోన్‌ను పరీక్షించారు. రైలు కోచ్‌లను డ్రోన్ ఉపయోగించి శుభ్రం చేశారు. ఎలివేషన్, ఎత్తైన ప్రదేశాలను శుభ్రం చేయడానికి ఈ డ్రోన్ చక్కగా ఉపయోగపడింది. రూఫింగ్ షీట్ల ను కూడా చక్కగా శుభ్రం చేసింది. ఈ ట్రయల్ రైల్వే అధికారుల సమక్షంలో జరిగింది. ఈ ట్రయల్ కొద్ది నిమిషాల్లోనే సక్సెస్ అయ్యింది. రైల్వే అధికారులు ఈ విషయాన్ని ప్రాసెస్ చేసి, దానిని ఆమోదించాలా? వద్దా? అని నిర్ణయిస్తారు.
ఈ ఏడాది మేలో తొలిసారి అస్సాంలోని కామాఖ్య రైల్వే స్టేషన్‌లో ఆపి ఉంచిన రైలును డ్రోన్‌ని ఉపయోగించి శుభ్రం చేశారు. ఇప్పటి వరకు మనుషులు శుభ్రం చేయగా, ఇప్పుడు డ్రోన్ సాయంతో కడగబోతున్నారు. ఒక రైలుగమ్యస్థాన స్టేషన్ కు చేరుకోగానే, ప్రయాణీకులు దిగిన తర్వాత దానిని శుభ్రం చేస్తారు. ఇప్పటి వరకు మనుషులు మ్యానువల్ గా రైళ్లను కడిగేవారు. పైపుల ద్వారా నీటిని చల్లి కడిగే వారు. ఈ పద్దతిలో చాలా సమయం పట్టేది. ఎక్కువ మ్యాన్ పవర్ కావాల్సి వచ్చేది. ఈ సాంకేతికత ప్రయోజనకరంగా ఉంటుందని డ్రోన్ తయారీ విద్యార్థులు వెల్లడించారు. వీటిని ఇండియన్ రైల్వేలోకి ప్రవేశపెట్టే విషయంపై త్వరలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
Read Also: సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు నుంచి జారిపడ్డ ప్రయాణీకుడు.. కానిస్టేబుల్ చేసిన పనికి అంతా షాక్!