E-Paper
Advertisement

ఆకాశంలో ఇక విమానాల సందడే.. మరో 1,000 విమానాలు వచ్చేస్తున్నాయ్!

ఆకాశంలో ఇక విమానాల సందడే..  మరో 1,000 విమానాలు వచ్చేస్తున్నాయ్!
Advertisement

India’s Aircraft Orders: దేశంలో విమాన ప్రయాణాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో భారతీయ విమానయాన సంస్థలు తమ విమానాల సంఖ్యను భారీగా పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 1,200కు పైగా విమానాలకు ఆర్డర్లు ఇచ్చిన సంస్థలు.. త్వరలో మరో 1,000 విమానాలకు ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. దీంతో రాబోయే రోజుల్లో భారత విమానయాన రంగం మరింత విస్తరించనుంది.

ఇప్పటికే 1,200 విమానాలకు ఆర్డర్లు

భారతీయ విమానయాన సంస్థలు ఇండిగో (IndiGo), ఎయిర్ ఇండియా (Air India), అకాసా ఎయిర్ (Akasa Air) ఇప్పటికే ప్రపంచ విమాన తయారీ సంస్థలైన బోయింగ్ (Boeing), ఎయిర్‌బస్ (Airbus)లకు 1,200కు పైగా విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. అయితే, పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే ఈ విమానాలు కూడా సరిపోకపోవచ్చని అంచనా. భారతీయ విమానయాన సంస్థలకు అవసరం 2,000 విమానాలను దాటే అవకాశం ఉందని పీయూష్ గోయల్ తెలిపారు. ఈజిప్టు పర్యటన సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు. విమానాల డెలివరీలను త్వరగా పూర్తి చేయాలని తయారీ సంస్థలను విమానయాన సంస్థలు కోరుతున్నాయని చెప్పారు.

ఏటా 7.1 శాతం వృద్ధి..

Advertisement

భారత విమానయాన రంగం రాబోయే పదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించనుంది. ఆలివర్ వైమన్ (Oliver Wyman) అంచనాల ప్రకారం.. 2026 నుంచి 2036 మధ్య దేశ వాణిజ్య విమానాల సంఖ్య ఏటా సగటున 7.1 శాతం పెరుగుతోంది. అయితే, విమానాలకు భారీగా ఆర్డర్లు ఉన్నప్పటికీ, వాటి డెలివరీలో ఆలస్యం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా విమాన తయారీ సంస్థలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆర్డర్లు పెండింగ్‌లో ఉండటంతో పాటు, ఇంజన్లు, ఇతర విడిభాగాల కొరతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని విమానాలు 2034 చివరి వరకు కూడా భారతీయ సంస్థలకు అందే అవకాశం లేదని సమాచారం.

విమానాల లీజింగ్‌పై కేంద్రం స్పెషల్ ఫోకస్

భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న మొత్తం విమానాల్లో 85 శాతానికి పైగా లీజుకు తీసుకున్నవే. అంటే, విమానాలను కొనుగోలు చేయడం కంటే అద్దెకు తీసుకుని నడిపించే సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం విమానాల లీజింగ్ కోసం భారతీయ సంస్థలు ఐర్లాండ్, సింగపూర్ లాంటి విదేశీ కేంద్రాలపై ఆధారపడుతున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం ఇతర దేశాలకు వెళ్తోంది.

గిఫ్ట్ సిటీతో కొత్త అవకాశాలు

Advertisement

ఈ పరిస్థితిని మార్చేందుకు గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ (GIFT City)ని విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం బ్యాంకు రుణాలను పెంచడం, రూపాయిల్లోనే ఫైనాన్సింగ్ అందించడం, లీజింగ్ నిబంధనలను సింప్లీఫై చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరో 1,000 విమానాలకు ఆర్డర్లు ఇచ్చే అవకాశం భారత విమానయాన రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే, ఈ విస్తరణ ప్రణాళికలు ఎంత వేగంగా అమలవుతాయనేది చూడాలి.

Read Also: లక్షద్వీప్ నుంచి అండమాన్ వరకు.. భారత్‌ లో స్కూబా డైవింగ్‌ కు 6 బెస్ట్ ప్లేసెస్ ఇవే!

Tags

Related News

ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారా? ఈ 4 తప్పులు చేస్తే ప్రమాదమే

ఆత్మవిశ్వాసమే అతని ఆయుధం.. కళ్లు కనిపించకపోయినా ఎవరెస్ట్ ఎక్కేశాడు

ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ హైడ్రామా.. 9 గంటలైనా కదలని విమానం!

లక్షద్వీప్ నుంచి అండమాన్ వరకు.. భారత్‌ లో స్కూబా డైవింగ్‌ కు 6 బెస్ట్ ప్లేసెస్ ఇవే!

తాజ్ మహల్ లోకి ఫ్రీ ఎంట్రీ.. పర్యాటకులకు అదిరిపోయే ఆఫర్!

వెకేషన్ వెళుతున్నారా? హోటల్ లేదా ఎయిర్‌బిఎన్‌బి ఏది బుక్ చేసుకోవాలి.. ఏది బెటర్?

గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలుకు బ్రేకులు పడకపోతే.. ఎలా ఆపుతారో తెలుసా?

Big Stories

Advertisement
×