Big Tv Originals: విమాన ప్రయాణం వేగంగా , సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, టికెట్ల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ ధరలో విమాన టికెట్లు పొందాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ ముందుగానే టికెట్లు బుక్ చేసుకోండి
ప్రయాణ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ విమాన టికెట్ల ధరలు పెరుగుతుంటాయి. అందుకే, ప్రయాణానికి కనీసం 3 నుంచి 6 వారాల ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే తక్కువ ధరకే లభిస్తాయి.
⦿ రద్దీ లేని రోజుల్లో ప్రయాణించండి
విమాన టికెట్ల ధరలు రోజూ మారుతుంటాయి. వీలైనంత వరకు రద్దీ సమయాల్లో ప్రయాణం చేయకూడదు. సాధారణంగా మంగళవారాలు, బుధవారాలు, శనివారాల్లో తక్కువ ఛార్జీలు ఉంటాయి. ఆ సమయంలో ప్రయాణం చేయడం వల్ల టికెట్ల ధరలు తక్కువగా ఉంటాయి.
⦿ టికెట్ బుకింగ్ సైట్లలో సెర్చ్ చేయండి
పలు సంస్థలు విమాన టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వేటిలో ధరలు తక్కువగా ఉన్నాయో కంపార్ చేయండి. Google Flights, Skyscanner, MakeMyTrip, Goibibo లాంటి వెబ్ సైట్లు పలు రకాల విమానయాన సంస్థల టికెట్ ధరలను పోల్చి చూసేందుకు ఉపయోగపడుతాయి. ఎందులో చౌకగా ఉంటే వాటిని ఎంచుకోండి.
⦿ Incognito మోడ్ లో సెర్చ్ చేయండి
ఎయిర్ లైన్ వెబ్ సైట్లు మీ సెర్చింగ్ వివరాలను ట్రాక్ చేస్తాయి. కొన్నిసార్లు ధరలను పెంచుతాయి. వీలైనంత వరకు విమాన టికెట్ల ధరలను Incognito మోడ్ లో చూడండి. ఆ తర్వాత మీ బ్రౌజర్ కుక్కీలను క్లియర్ చేయండి.
⦿ డిస్కౌంట్లు, ఆఫర్ల
విమానయాన సంస్థలు పండుగలు, ప్రత్యేక రోజులతో టికెట్ల అమ్మకాలపై డిస్కౌంట్లను అందిస్తాయి. వీటి గురించి తెలుసుకునేందుకు తరచుగా ఎయిర్ లైన్ వెబ్ సైట్లు, సోషల్ మీడియాను గమనిస్తూ ఉండాలి.
⦿ క్రెడిట్ కార్డ్, వాలెట్ ఆఫర్లను ఉపయోగించండి
విమాన టికెట్లు బుక్ చేసే సమయంలో Paytm, PhonePe లాంటి పేమెంట్ యాప్స్, ఇ-వాలెట్లు ఉపయోగించాలి. అలా చేయడం వల్ల విమాన టికెట్లపై క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంటుంది.
⦿ బడ్జెట్ ఎయిర్ లైన్ లను ఎంచుకోండి
ఖరీదైన ఎయిర్ లైన్స్ కు బదులుగా ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్, అకాసా ఎయిర్ లాంటి బడ్జెట్ క్యారియర్ లలో ప్రయాణించండి. ఈ సంస్థలు తక్కువ ధరకే టికెట్లను అందిస్తాయి.
⦿ రౌండ్ ట్రిప్ టికెట్లను బుక్ చేసుకోండి
వన్ వేకు బదులుగా, రౌండ్ ట్రిప్ కు టికెట్లు బుక్ చేసుకుంటే చౌకగా లభిస్తాయి.
⦿ సమీపంలోని విమానాశ్రయాలను చెక్ చేయండి
కొన్ని నగరాల్లో ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆయా విమానాశ్రయాలను టికెట్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. తక్కువ ధరలో లభించే టికెట్లు తీసుకోవడం మంచిది.
⦿ ధరలకు సంబంధించిన అలర్ట్ ను సెట్ చేసుకోండి
Google Flights, Skyscannerలో టికెట్ ధరలు తగ్గినప్పుడు తెలియజేసేలా ప్రైస్ అలర్ట్ ను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దానిని సెట్ చేసుకోవడం వల్ల తక్కువ ధరలో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: రాత్రి 10 తర్వాత రైల్లో చేయకూడని పనులు ఇవే, లేదంటే ఇత్తడైపోద్ది!