BigTV English

Telangana News : బీర్ కేఫ్‌లు.. సర్కార్ ఖతర్నాక్ ఐడియా.. తాగినోళ్లకు తాగినంత..

Telangana News : బీర్ కేఫ్‌లు.. సర్కార్ ఖతర్నాక్ ఐడియా.. తాగినోళ్లకు తాగినంత..

Telangana News : వేడి వేడి టీ, కాఫీలు. షాప్‌కు వెళ్లి ఇలా ఆర్డర్ ఇవ్వగానే అలా చేతిలో పెడతారు. చటుక్కున తాగేసి లటుక్కున వెళ్లిపోవచ్చు. ఇన్‌స్టంట్‌గా రెడీ చేసేవే కాబట్టి కొరత అనేది ఉండనే ఉండదు. ఎనీ టైమ్.. సింపుల్ సేల్స్. సరిగ్గా ఇదే స్ట్రాటజీని ఇకపై బీర్ అమ్మకాలకూ వర్తింప చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోందని సమాచారం. ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లకు పర్మిషన్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోందట. రాష్ట్ర వ్యాప్తంగా మొదటిదశలో ఒకేసారి 70 బీర్ బార్లకు అనుమతి ఇస్తారని తెలుస్తోంది. సిటీల్లో ప్రతీ 3 కిలో మీటర్లకు ఒకటి.. అదే జిల్లాల్లో అయితే 30 కి.మీ. దూరంలో ఏర్పాటు చేసేలా బీర్ కేఫ్‌ల డిజైన్ ఉండబోతోందట.


బీర్లకు ఎంత డిమాండ్ అంటే..

చల్లచల్లని బీర్లును చకచకా తాగేస్తుంటారు. సమ్మర్‌లో చాలా వైన్స్‌లో బీర్లు దొరకడం కష్టం. నో స్టాక్ అంటారు. కావాల్సిన బ్రాండ్లు కూడా దొరకవు. ఇలా స్టాక్ రాగానే అలా అమ్ముడైపోతుంటాయి. వేసవిలో చల్లని బీర్ల కోసం తన్లాడుతుంటారు మందుబాబులు. ఇటీవలే బీర్ ధరను 30 నుంచి 50 రూపాయల వరకు పెంచింది తెలంగాణ సర్కారు. రేటు పెంచినా సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. నెలకు సుమారు 50 లక్షల బీర్ కేసులు అమ్ముడుపోతున్నాయి. ఆబ్కారీ ఖజానాకు ఎప్పుడూ లోటు అనేదే ఉండదు. కాకపోతే డిమాండ్ మేరకు బీర్లను సప్లై చేయలేక చేతులెత్తేస్తోంది. తాగేటోళ్లు ఉన్నా.. టైమ్‌కు బీర్లు తయారు చేసి అందించే వాళ్లు లేకుండా పోయారు. లేదంటేనా ఆదాయం మరింత వచ్చి పడేది. సరిగ్గా ఈ లోటును భర్తీ చేసేందుకే ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లను స్టార్ట్ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని టాక్.


Also Read : కారులో విదేశీ యువతిపై అత్యాచారం.. హైదరాబాద్‌లో దారుణం

సింపుల్ ఐడియా.. బీర్లతో పైసా వసూల్

బార్లీ గింజలను పులియపెడితే బీర్ తయారవుతోంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఇంతటి దానికి పెద్ద పెద్ద కంపెనీలు కావాలా? అంటే పెద్ద మొత్తంలో బీర్ తయారు చేసేందుకైతే కావాలి. కానీ, అక్కడికక్కడే టీ, కాఫీలా గ్లాసులో పోసిచ్చే ఏర్పాటు చేస్తే..? వాటినే బీర్ కేఫ్‌లు అంటారు. విదేశాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. చిన్నపాటి డ్రమ్ముల సైజు పరికరాల్లో బీర్ తయారు చేస్తారు. అడిగి వారికి అప్పటికప్పుడు తాజా బీర్ పోసిస్తారు. అంతే. సింపుల్. బ్రాంది, విస్కీలు లాంటివి అయితే ఎంత కాలం నిల్వ ఉంచితే అంత కిక్కు.. అంత డిమాండ్. బీర్ మాత్రం అలా కాదు. ఫ్రెష్ దే తాగాలి. లేటైతే పాడై పోతుంది. అందుకే, బీర్ సీసాపై మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడండి.. ఆ రోజుదో, ముందు రోజుదో డేట్ వేసి ఉంటుంది. అంత ఫ్రెష్ బీరును ఎక్కడో కంపెనీలో తయారు చేసి, సీసాల్లో తీసుకొచ్చి.. వైన్స్‌లో అమ్మే తంతు కంటే.. బీర్ కేఫ్‌లకు పర్మిషన్లు ఇస్తే ఎక్కడివి అక్కడే తయారు చేసి అమ్మేయొచ్చనేది ఐడియా. మందుబాబులకు బీర్ల కొరతా తీరుతుంది.. సర్కారుకు కావలసినంత ఆదాయమూ వస్తుంది. మస్త్ ఉందిలే ఐడియా.. ఇగ బీర్లు మస్త్ తాగొచ్చులే..! ఇప్పటికే హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసి తాాజా కల్లును అమ్ముతోంది ఆబ్కారీ శాఖ. ఇప్పుడిక బీర్ కేఫ్‌లన్నమాట.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×