E-Paper
Advertisement

Hyd Metro Timings Revised: మారిన హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?

Hyd Metro Timings Revised: మారిన హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?
Advertisement

Hyd Metro Rail Timings:

హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్చుతున్నట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. సవరించిన మెట్రో టైమింగ్స్ నవంబర్ 3, 2025 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం వారంలో మూడు రకాల టైమింగ్స్ ప్రకారం రైళ్లు నడుస్తుండగా, ఇకపై వారంలోని అన్ని రోజులు ఒకే టైమింగ్స్ ఫాలో కానున్నట్లు వెల్లడించింది. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవలు ఒకేలా ఉంటాయని తెలిపింది. ఉదయం 6:00 నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమై, రాత్రి 11:00 గంటల వరకు కొనసాగుతాయని తెలిపింది. ప్రయాణీకులు ఈ టైమింగ్స్ ప్రకారం తమ రాకపోకలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటన జారీ చేసింది.

Advertisement

Read Also: రైలులో లోయర్ బెర్త్ కావాలా? మారిన ఈ రూల్స్ గురించి ముందుగా తెలుసుకోవల్సిందే!

ప్రస్తుతం రైళ్ల టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే?  

ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైళ్లు మూడు రకాల టైమింగ్స్ ను ఫాలో అవుతున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మొదటి రైలు ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై.. చివరి రైలు రాత్రి 11:45 గంటల వరకు నడుస్తుంది. శనివారం నాడు మొదటి రైలు ఉదయం 6:00 గంటలకు ప్రారంభమై, చివరి రైలు రాత్రి 11:00 గంటలకు వరకు నడుస్తుంది. ఆదివారం నాడు మొదటి రైలు ఉదయం 7:00 గంటలకు ప్రారంభం కాగా, చివరి రైలు రాత్రి 11:00 గంటలకు నడుస్తుంది. ఇకపై వారం రోజులు ఒకేలా టైమింగ్స్ ఉంటాయని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది.

Advertisement

Read Also: విమానాలకు ఎడమ వైపే ఎంట్రీ ఎందుకు ఉంటుంది? కుడి వైపు డోర్ ఎందుకు ఉండదు? కారణం ఇదేనట!

Related News

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!

48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్య.. పచ్చబొట్టు చూసి గుండెలకు హత్తుకున్న భర్త!

స్మశానంలో ప్రేమాయణం.. ఇదేం పిచ్చిరా అయ్యా!

రైల్వే స్టేషన్ లో చిప్స్ ప్యాకెట్స్ ఎత్తు కెళ్లిన ప్రయాణికులు.. ఏం చిల్లర గాళ్లు ఉన్నారేంట్రా మీరూ?

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

Big Stories

Advertisement
×