E-Paper
Advertisement

Viral Video: రైలులో వాటర్ బాటిల్ ధర రూ.500.. అమృతం గానీ అమ్ముతున్నారా ఏంటీ?

Viral Video: రైలులో వాటర్ బాటిల్ ధర రూ.500.. అమృతం గానీ అమ్ముతున్నారా ఏంటీ?
Advertisement

భారతీయ రైల్వే ప్రయాణంతో పోల్చితే యూరప్ లో మరింత లగ్జరీగా ఉంటుంది. రైళ్ల వేగంతో పాటు అందులో అందించే వసతులు కూడా చాలా లగ్జరీగా ఉంటాయి. సాధారణంగా భారతీయ రైళ్లలో తక్కువ ధరలకు ఫుడ్ అందించడంతో పాటు వాటర్ బాటిళ్లు అమ్ముతారు. అర లీటర్, లీటర్ బాటిళ్లు కేవలం రూ. 20 లోపే లభిస్తాయి. తాజాగా ఓ భారతీయ ట్రావెలర్ యూరప్ లో రైలు ప్రయాణం చేశాడు. ఇందులో వాటర్ బాటిల్ ధర చూసి షాకయ్యాడు. ఇంతకీ అక్కడ ఒక్క వాటర్ బాటిల్ ధర ఎంతంటే..

లీటర్ వాటర్ బాటిల్ కాస్ట్ రూ. 500  

తాజాగా సదరు వ్యక్తి రైలు ప్రయాణం చేస్తూ వాటర్ తాగుతుండగా, ఆయన భార్య “ఈ వాటర్ బాటిల్ ధర ఎంతో చెప్పు?” అని అడుగుతుంది. “ఇది నా జీవితంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్” అని చెప్తాడు. రైల్లో వాటర్ బాటిల్ ధర ఏకంగా  €5 అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 500 తీసుకున్నట్లు వెల్లడించాడు. భారతీయ రైళ్లలో రూ.10 రూ. 20కే వాటర్ బాటిళ్లను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు. అయితే, యూరప్ రైళ్లలో విక్రేతలు ఉండరని.. తామే వెళ్లే ఓ బోగీలో వాటర్ బాటిళ్లు కొని తెచ్చుకోవాలన్నారు. ఆ విషయం తెలియక తాను, తన భార్య 4 గంటల పాటు ఫుడ్, వాటర్ లేకుండా రైల్లో ప్రయాణించినట్లు చెప్పాడు. ఆ తర్వాత రైల్లోని ఓ బోగీలో రెస్టారెంట్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఫారిన్ రైళ్లతో పోల్చితే భారతీయ రైళ్లు బెస్ట్ అని చెప్పుకొచ్చాడు. పాప్ కార్న్ నుంచి మొదలుకొని అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ సీట్ల దగ్గరికే రావడం చాలా బాగుంటుందన్నారు. ఇక్కడ రైళ్లలో కనీసం పాప్ కార్న్ అమ్మే వ్యక్తులు కూడా రావడం లేదన్నారు.

Advertisement

Read Also: విమానాలకు ఎడమ వైపే ఎంట్రీ ఎందుకు ఉంటుంది? కుడి వైపు డోర్ ఎందుకు ఉండదు? కారణం ఇదేనట!

నెటిజన్లు ఏమన్నారంటే?

Advertisement

అటు ఈ వాటర్ బాటిల్ గురించి నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే ఇండియన్ రైల్వే గొప్పదనం తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. “ఆమ్‌ స్టర్‌ డామ్‌ లో ఇలాంటి గాజు సీసా ధర 9 యూరోలు(సుమారు రూ. 900)” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “నేను యూరప్‌ లో రైలు ప్రయాణం చేసిన తర్వాత భారత్ లో పర్యాటకులకు అందించే అన్ని సౌకర్యాల పట్ల నేను గొప్పగా ఫీలవుతున్నాను. భారతీయ రైల్వేను గౌరవిస్తున్నాను” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “మీరు ఈ బాటిల్ లో యూరప్‌ లోని ఏ ట్యాప్ నుంచి అయినా నీళ్లు నింపుకోవచ్చు. అంత శుభ్రంగా ఉంటాయి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వాటర్ బాటిల్ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also: రీల్స్ చేసేవారికి చైనా కొత్త రూల్.. ఇవన్నీ ఉంటేనే అందుకు అనుమతి, లేకుంటే?

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×