BigTV English

Indian Railways: అన్ని లైన్లలో.. ఏ ట్రాక్ మీదకు వెళ్లాలనేది లోకో పైలెట్‌కు ఎలా తెలుస్తుంది?

Indian Railways: అన్ని లైన్లలో.. ఏ ట్రాక్ మీదకు వెళ్లాలనేది లోకో పైలెట్‌కు ఎలా తెలుస్తుంది?

విజయవాడ, సికింద్రాబాద్ లాంటి రైల్వే స్టేషన్లలో చాలా రైల్వే లైన్లు ఉంటాయి. అలాంటి సమయంలో లోకో పైలెట్ కన్ఫ్యూజన్ లేకుండా ఏ ట్రాక్ మీదకు వెళ్లాలనే విషయం ఎలా తెలుస్తుందబ్బా? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే, నిజానికి ఏ ట్రాక్ మీదకు వెళ్లాలనే విషయం లోకో పైలెట్ కు కూడా తెలియదు. ఈ వ్యవహారం అంతా స్టేషన్ సిబ్బంది చూసుకుంటారు.


స్టేషన్ మాస్టర్ నిర్ణయం ప్రకారమే..

నిజానికి ఏ రైలు ఏ లైన్ మీదికి రావాలి? ఎప్పుడు రావాలి? ఎప్పుడు వెళ్లాలి అనేది స్టేషన్ మాస్టర్ చూసుకుంటారు. ఎన్ని రైల్వే లైన్లు ఉన్నప్పటికీ, రైలు ఏ ట్రాక్ మీదికి రావాలో స్టేషన్ మాస్టర్ నిర్ణయిస్తాయి. ట్రాక్ పాయింట్ అపరేషన్ ద్వారా రైలు ఏ ట్రాక్ మీదకి తీసుకెళ్లాలో డిసైడ్ చేస్తారు. పాయింట్ ఆపరేటింగ్ అనేది రైలును ఒక ట్రాక్ మీది నుంచి మరో ట్రాక్ మీదికి షిఫ్ట్ చేసే మెకానిజం. అప్పటికే స్టేషన్ కు వచ్చిన రైళ్లు, త్వరలో స్టేషన్ కు రాబోయే రైళ్లను బట్టి ఏ రైలును, ఏ ట్రాక్ మీదికి తీసుకెళ్లాలో స్టేషన్ మాస్టర్ నిర్ణయిస్తారు. దానికి కంట్రోలర్ సాయం తీసుకుంటారు. సో, స్టేషన్ మాస్టర్ తీసుకునే నిర్ణయం కారణంగా ఆయనా రైళ్లు ఆయా ట్రాక్ ల మీదికి వెళ్లాయి. లోకో పైలెట్ కు ఏ ట్రాక్ మీదికి తీసుకెళ్లాలో నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు.


ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ

ఇక భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్ లోనూ అత్యధిక రైల్వే నెట్ వర్క్ ఉంది. దేశంలో ప్రస్తుతం సుమారు లక్ష కిలో మీటర్ల మేర రైల్వే నెట్ వర్క్ విస్తరించి ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ రైల్వే నెట్ వర్క్ ను ఏర్పాటు చేశారు అధికారులు. రోజూ సుమారు 20 వేల రైళ్లు తమ సేవలను కొనసాగిస్తున్నాయి. తక్కువ ఖర్చులతో ప్రజలను సుదూర గమ్య స్థానాలకు చేర్చడంలో రైల్లే సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతీయ రైల్వే సంస్థ రోజుకు సుమారు రెండున్నర కోట్లకు పైగా మంది ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేర్చుతుంది.

గత దశాబ్ద కాలంగా భారతీయ రైల్వే సంస్థ అత్యాధునిక హంగులను దిద్దుకున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం కొనసాగడంతో పాటు అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. వందేభారత్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. హైడ్రోజన్ రైళ్లు, బుల్లెట్ రైళ్లను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అంతేకాదు, కవచ్ లాంటి వ్యవస్థను తీసుకొచ్చి రైలు ప్రమాదాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రూట్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మున్ముందు మరింత విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నది భారతీయ రైల్వే సంస్థ.

Read Also: RAC టికెట్ హోల్డర్లకు గుడ్ న్యూస్, ఇక హాయిగా పడుకుని ప్రయాణించవచ్చు!

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×