Indian Railways: సుదూర రైలు ప్రయాణం చేసే వాళ్లు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, అందరికీ టికెట్లు కన్ఫర్మ్ కావు. చాలా మందికి RAC(రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) టికెట్లు వస్తాయి. రైలు ప్రయాణం ప్రారంభమయ్యే సమయానికి టికెట్ కన్ఫర్మ్ అవుతుందని ఆశగా ఎదురు చూస్తుంటారు. టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా కనీసం సీటు అయినా అభిస్తుందని భావిస్తారు. పడుకోలేకపోయినా, కనీసం కూర్చొని అయినా ప్రయాణించవచ్చు అనుకుంటారు. అయితే, ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో RAC టికెట్ పొందిన వారికి భారతీయ రైల్వే సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పడుకుని హాయిగా ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది.
ఇకపై RAC టికెట్ ఉన్నా ఫుల్ సీటు
తాజాగా రైల్వే తీసుకున్న నిర్ణయం ప్రకారం.. బెర్త్ కోసం మొత్తం పే చేసి సీటు మాత్రమే పొందిన వారికి ఈ బెనిఫిట్స్ లభించనున్నాయి. తాజా రూల్ ప్రకారం RAC టికెట్ ఉన్నవాళ్లకి ఫుల్ సీట్ ఇవ్వనున్నారు. ఇకపై వాళ్లు కూడా పడుకుని ప్రయాణించవచ్చు. ఇప్పటి వరకు RAC టికెట్ ఉన్న వాళ్లు సైడ్ లోయర్ బెర్త్ ని ఇంకొకరితో షేర్ చేసుకునేవాళ్లు. ఇకపై ఆ సీటును ఎవరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫుల్ సీటులో హాయిగా పడుకొని ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
బెడ్ షీట్లు, దుప్పటి, దిండు, టవల్..
అంతేకాకుండా కొత్త రూల్స్ ప్రకారం ఏసీ బోగీల్లో ఉండే ఆర్ఏసీ టికెట్ ఉన్నవాళ్లకి ఇకపై రెండు బెడ్ షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, ఒక టవల్ కూడా ఇస్తారు. వీటిని ఉపయోగించుకుని హాయిగా పడుకుని వెళ్లే అవకాశం ఉంటుంది. తాజా రూల్ తో RAC ప్రయాణీకులు సౌకర్యవంతమైన, ఒత్తిడి లేని ప్రయాణాన్ని పొందే అవకాశం ఉంటుంది.
Read Also: ఇండియాలో రైళ్లు ఎందుకు ఆలస్యంగా నడుస్తాయి? కారణాలు మీకు తెలుసా?
గతంలో చాలా ఇబ్బందులు
వాస్తవానికి RAC టికెట్ కారణంగా చాలా మంది టెన్షన్ పడే వాళ్లు. ఈ టికెట్ ఉన్నవాళ్లు చార్ట్ ప్రిపేర్ అయ్యేలోపు టికెట్ కన్ఫార్మ్ అవుతుందని భావించేవారు. RAC టికెట్ అంటే సగం టికెట్ గానే పరిగనించాల్సి ఉంటుంది. అంటే సగం మాత్రమే కన్ఫర్మ్ అయినట్లుగా గుర్తించాలి. కనీసం సీట్ దొరికిందని ప్రయాణించే వాళ్లు. తాజా రూల్ ప్రకారం RAC టికెట్ ప్రయాణీకులు ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే, మరో RAC టికెట్ హోల్డర్ కు ఫుల్ బెర్త్ లభిస్తుంది.
ఇక ప్రతి స్లీపర్ కోచ్ లో 7 RAC బెర్త్ లు ఉంటాయి. వీటిని 14 మంది ప్రయాణీకులు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజా నిబంధన ప్రకారం పక్కన ఉన్న ప్రయాణీకుడు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై ఫుల్ బెర్త్ పొందే అవకాశం ఉంటుంది. హాయిగా పడుకుని జర్నీ చేసే అవకాశం ఉంటుంది. దీనికి స్పెషల్ గా డబ్బులు కేటాయించాల్సిన అవసరం లేదు.
Read Also: దేశంలో అత్యంత చెత్త రైళ్లు ఇవే.. ముక్కు మూసుకుని జర్నీ చేయక తప్పదు!