E-Paper
Advertisement

హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు వాడతారు? దీని వెనుక ఉన్న ‘సీక్రెట్’ ఇదే!

హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు వాడతారు? దీని వెనుక ఉన్న ‘సీక్రెట్’ ఇదే!
Advertisement

White Bedsheets: చిన్న లాడ్జీల నుండి లగ్జరీ 5 – స్టార్ హోటళ్ల వరకు ఎక్కడికి వెళ్లినా బెడ్‌పై తెల్లటి దుప్పట్లే (White Bedsheets) కనిపిస్తాయి. రంగురంగుల డిజైన్లు కాకుండా కేవలం తెలుపు రంగునే ఎంచుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన మనస్తత్వ శాస్త్రం, వ్యాపార రహస్యం దాగి ఉన్నాయి. ఆ విశేషాలు ఇక్కడ చూద్దాం.

పరిశుభ్రతకు ప్రతీక

హోటల్ గదిలోకి అడుగుపెట్టగానే కస్టమర్లు ఆశించేది క్లీన్‌నెస్. తెల్లటి దుప్పట్లపై చిన్న మచ్చ ఉన్నా, వెంట్రుక పడినా స్పష్టంగా కనిపిస్తుంది. బెడ్ షీట్ తెల్లగా, తళతళలాడుతూ ఉంటే.. ఆ గది చాలా శుభ్రంగా ఉందనే నమ్మకం, మానసిక ప్రశాంతత కస్టమర్లకు కలుగుతుంది.

ఉతకడం చాలా సులభం

Advertisement

రంగుల దుప్పట్లను ఉతికేటప్పుడు అవి వెలిసిపోయే ప్రమాదం ఉంది. కానీ, తెల్లటి బెడ్‌షీట్స్ విషయంలో ఆ భయం ఉండదు. హోటల్ సిబ్బంది అన్ని తెల్లటి దుప్పట్లు, టవళ్లను కలిపి ఒకేసారి బ్లీచింగ్, వేడి నీళ్లతో క్లీన్ చేస్తారు. దీనివల్ల క్రిములు చనిపోవడమే కాకుండా, దుప్పట్లు ఎప్పటికీ కొత్తవాటిలా మెరుస్తుంటాయి. రంగులు వేరు చేయాల్సిన అవసరం లేకపోవడంతో సమయం, శ్రమ కూడా ఆదా అవుతాయి.

లగ్జరీ ఫీలింగ్

1990ల కాలంలో వెస్టిన్ హోటల్స్ (Westin Hotels) చేసిన ఒక పరిశోధనలో తెల్లటి బెడ్స్.. రూమ్ రూపురేఖలనే మార్చేస్తాయని తేలింది. తెల్లటి దుప్పటి కస్టమర్లకు ఒక లగ్జరీ రిసార్ట్‌లో ఉన్నామనే అనుభూతిని ఇస్తుందని తేలింది. ఇవి కాంతిని పరావర్తనం చేయడం వల్ల గది మరింత పెద్దదిగా, వెలుతురుగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Also Read: బేస్‌మెంట్‌లు, లిఫ్టుల్లో నెట్‌వర్క్ ఎందుకు పనిచేయదు? అసలు నిజం ఇదీ!

ఎప్పటికీ మారని ట్రెండ్

సాధారణంగా ఫ్యాషన్ లేదా ఇంటీరియర్ డిజైన్స్ కాలంతో పాటు మారుతుంటాయి. కానీ తెలుపు రంగుకు ఎప్పటికీ కాలం చెల్లదు (Evergreen). గోడల రంగు ఏదైనా, ఫర్నిచర్ ఎలాంటిదైనా సరే.. తెల్లటి బెడ్‌షీట్ దేనికైనా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అందుకే హోటల్ ఇండస్ట్రీ ఈ సంప్రదాయాన్ని మార్చడానికి అస్సలు ఇష్టపడట్లేదని తెలుస్తోంది.

Also Read: వానొచ్చినా నో టెన్షన్.. నీటిలో తడిచినా అదరగొట్టే.. టాప్-5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు!

Related News

మీ భార్య మీతో ఈ విషయాలు దాచిపెడుతోందా? రిలేషెన్‌ షిప్‌పై పడే ప్రభావం ఇదే

జి మెయిల్, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్.. అన్ని అకౌంట్ పాస్ట్‌వర్డ్స్ మర్చిపోతున్నారా? సమస్యకు పరిష్కారం ఇదిగో

చాణక్య నీతి.. ఈ 4 ప్రదేశాల్లో ఇల్లు కొనకూడదు, నిర్మించకూడదు

ఒక్కో సెలైన్ బాటిల్‌కు రూ.15000 చెల్లిస్తున్న యువత.. డాండియా డాన్స్ పిచ్చి.. ఆరోగ్యకరమేనా?

అస్సలు చేదు రాకుండా..కరకరలాడే కాకరకాయ వేపుడు!

15 నిమిషాల్లోనే..నోట్లో కరిగిపోయే కమ్మని రవ్వ బర్ఫీ చేయండిలా!

రెస్టారెంట్ స్టైల్ చికెన్ వేపుడు..ఇలా చేసారంటే టేస్ట్ అదిరిపోద్ది

39 ఏళ్ల వయసులోనూ 22 ఏళ్ల బయోలాజికల్ ఏజ్ సాధించిన మహిళ.. యంగ్ లుక్స్ కోసం ఏం చేసిందంటే

Big Stories

Advertisement
×