Silver investment: సాధారణంగా అనేక మంది బంగారంపై ఎక్కువగా, వెండిపై తక్కువగా పెట్టుబడులు చేస్తుంటారు. కానీ ఇటీవల ఓ రిపోర్ట్ మాత్రం షాకింగ్ విషయాలను ప్రకటించింది. బంగారంతో పోల్చితే వెండిపై రాబడులు అధికంగా వచ్చాయని వెలుగులోకి వచ్చింది. ఇది తెలిసిన ఇన్వెస్టర్లు ఆశ్చర్యపోతున్నారు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వెండి దాదాపు 11% రాబడి ఇచ్చిందని ఓ రిపోర్ట్ తెలిపింది. ఇది బంగారం కన్నా ఎక్కువ రాబడి అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఈ ఏడాది వెండి ప్రత్యేకంగా
అయితే ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుండటం, సరఫరా లోటు, అమెరికా వాణిజ్య విధానాలలో మార్పులు వెండి రేట్ల పెరుగుదలకు ప్రధాన కారణాలని చెబుతున్నారు. అయితే ఈ ఏడాది వెండి ప్రత్యేకంగా ఎక్కువ లాభాలను అందించగలదని నిపుణులు భావిస్తున్నారు.
వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
పారిశ్రామిక డిమాండ్ పెరుగుదల: వెండి ప్రధానంగా సౌరశక్తి, విద్యుత్ వాహనాలు (EV), ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోస్తున్నారు. దీంతో వీటి డిమాండ్ పెరుగుతుండటంతో వెండి సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది.
సౌరశక్తి (Solar Energy): ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తి విస్తృతంగా పెరుగుతోంది. వెండి ఫోటో వోల్టాయిక్ ప్యానెల్స్‌లో ప్రధానంగా ఉపయోగిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV): EV బ్యాటరీలలో కూడా వెండి ప్రధానమైన భాగంగా ఉంది.
ఎలక్ట్రానిక్స్: మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గ్యాడ్జెట్‌లలో వెండి వాడకం పెరుగుతోంది.
అమెరికా వడ్డీ రేట్లు తగ్గించడంతో డిమాండ్ పెరుగుదల: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల పెట్టుబడిదారులు వెండి, బంగారం వంటి విలువైన లోహాలలో పెట్టుబడులు చేస్తున్నారు.
వెండి vs బంగారం – ఏది మంచి పెట్టుబడి?
బంగారాన్ని స్థిరమైన పెట్టుబడిగా వ్యవహరిస్తారు. కానీ వెండి అస్థిరత ఎక్కువగా ఉన్నప్పటికీ లాభాలు తక్కువ సమయంలోనే అందించగలదు.
చిన్న పెట్టుబడిదారులు వెండిలో సులభంగా పెట్టుబడి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది బంగారం కంటే చౌకగా ఉంటుంది.
Read Also: Credit Card Benefits: క్రెడిట్ కార్డ్ వల్ల 9 లాభాలు తెలుసా
వెండిలో పెట్టుబడి పెట్టడం ఎలా?
పెట్టుబడిదారులకు వెండిలో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. భౌతిక వెండి లేదా వెండి నాణేలు, బార్లు లేదా ఆభరణాల రూపంలో కొనుగోలు చేయవచ్చు. అయితే, నిల్వ ఖర్చులు, GST, ఇతర పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
సిల్వర్ ETF (Exchange Traded Funds): వెండిలో పెట్టుబడి చేసేందుకు అనేక మంది దీనిని వినియోగిస్తున్నారు. ఇది మరింత ద్రవత్వం (liquidity) కలిగి ఉంటుంది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా అందుబాటులో ఉంది.
అధిక రిస్క్
వెండి ధరల ఊహించిన పెరుగుదల లేదా పెట్టుబడి పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది అధిక రిస్క్ కలిగి ఉన్నప్పటికీ, పెద్ద లాభాలను అందించగలదు. నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం, పెట్టుబడిదారులు 70% బంగారం + 30% వెండి, లేదా 60% బంగారం + 40% వెండి వ్యూహాన్ని పాటించాలని అంటున్నారు.
దీర్ఘకాలంలో..
కానీ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు: బంగారంలో పెట్టుబడులు చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఇది స్థిరమైన రాబడిని అందిస్తుంది. వెండిలో అధిక శాతంలో పెట్టుబడి పెట్టడం మంచిది. వెండి తక్కువ సమయంలో అధిక లాభాలను అందిస్తుంది. ఇలాంటి అంశాల నేపథ్యంలో ఈ ఏడాది వెండికి డిమాండ్ అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారానికి బదులు వెండిపై ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వచ్చే ఛాన్సుందని అంటున్నారు.