BIG TV LIVE Originals: ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు భారతీయ రైల్వే కీలక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే రైళ్లలో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రయాణ సమయంలో మోబైల్స్, ల్యాప్ టాప్ లను ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ, రైళ్లలో ఛార్జింగ్ పెట్టుకోవడం సురక్షితమేనా? ఎలక్ట్రిక్ డివైజ్ లకు ఏమైనా సమస్యలు ఏర్పడుతాయా? అనే విషయాను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
భారతీయ రైళ్లలో ఛార్జింగ్ సౌకర్యం
సాధారణంగా రైళ్లలో ఛార్జింగ్ పాయింట్లు (110V సాకెట్లు) AC కోచ్‌లతో పాటు స్లీపర్ క్లాస్ కోచ్ లలో అందుబాటులో ఉంటాయి. జనరల్, రిజర్వ్ చేయని కోచ్‌లలో పరిమిత సంఖ్యలో ఛార్జింగ్ సాకెట్లు ఉంటాయి. ఈ సాకెట్లు 3 పిన్, 2 పిన్ మోబైల్, ల్యాప్ టాప్ ఛార్జర్లకు అనుకూలంగా ఉంటాయి.
ట్రైన్ ఛార్జింగ్ తో సమస్యలు
వోల్టేజ్ హెచ్చుతగ్గులు: ఇండియన్ రైల్వేలో వోల్టేజ్ అనేది స్థిరంగా ఉండదు. ఈ కారణంగా ఛార్జర్లు, మోబైల్, ల్యాప్ టాప్ ఛార్జర్లను దెబ్బతీసే అవకాశం ఉంటుంది.
ఓవర్ లోడింగ్: ఒకే సాకెట్ ను ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణీకులు ఉపయోగించడం వల్ల ఓవర్ లోడ్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు డివైజ్ లు వేడెక్కడంతో పాటు షార్ట్ సర్క్యూట్ లకు కారణం అవుతుంది.
కండీషన్ బాగాలేని సాకెట్లు: పాత రైళ్లలో వదులుగా, దెబ్బతిన్న సాకెట్లు ఉంటాయి. వీటి ద్వారా ఛార్జింగ్ చేయడం వల్ల స్పార్కింగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది
భద్రతా సమస్యలు: ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లు, ల్యాప్ టాప్ లు పట్టించుకోకపోవడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది.
బ్యాటరీ సమస్యలు: స్థిరంగా లేని ఓల్టేజ్ కారణంగా బ్యాటరీ లైఫ్ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.
ఛార్జింగ్ టచ్ స్క్రీన్ లపై ఎఫెక్ట్ చూపిస్తుందా?
రైళ్లలో ఛార్జింగ్ చేయడం వల్ల టచ్ స్క్రీన్ సమస్యలు అనేవి రాదు. లేటెస్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు తక్కువ మోతాదులో విద్యుత్ హెచ్చుతగ్గులను కంట్రోల్ చేసే శక్తిని కలిగి ఉంటాయి. టచ్ స్క్రీన్ లు ఛార్జింగ్ మీద ఆధారపడి ప్రభావితం కాదు. తీవ్రమైన వోల్టేజ్ హెచ్చుతగ్గులు, అరుదైన సందర్భాల్లో టచ్ స్క్రీన్ కంట్రోలర్ తో డివైజ్ ఇతర భాగాలను డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాణ్యమైన ఛార్జర్లు వాడటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం తక్కువగా ఉంటుంది. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు డివైజ్ వేడెక్కితే తాత్కాలికంగా టచ్ స్క్రీన్ పని చేయకపోవచ్చు.
రైళ్లలో ఛార్జింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రైళ్లలో సేఫ్ గా ఛార్జింగ్ చేయడానికి సర్జ్ ప్రొటెక్టర్‌ని ఉపయోగించాలి. ఇది వోల్టేజ్ స్పైక్‌ల నుంచి కాపాడుతాయి. నాణ్యమైన ఛార్జర్ లను ఉపయోగించడం వల్ల ఇబ్బందులు పెద్దగా తలెత్తవు. రైలు ప్రయాణం చేసే సమయంలో పవర్ బ్యాంక్‌ను తీసుకెళ్లడం మంచిది. రైళ్లలో ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో సాకెట్లను చెక్ చేయాలి. సరిగ్గా ఉంటేనే ఛార్జ్ చేసుకోవడం మంచిది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందూ టికెట్ బుక్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఇలా చేయండి!