Indian Railway Tickets Booking: ప్రపంచంలో అత్యధిక మంది ప్రయాణించే రైల్వే సంస్థగా ఇండియన్ రైల్వే గుర్తింపు తెచ్చుకుంది. భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు జర్నీ చేస్తుంటారు. ప్రజా రవాణా కోసం రోజూ సుమారు 13 వేల రైళ్లు సర్వీసులు అందిస్తున్నాయి. 2.5 కోట్ల మంది గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. సాధారణంగా రైలు ప్రయాణం చేసే ప్యాసింజర్లు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. అత్యవసర ప్రయాణాల కోసం తత్కాల్ బుకింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ప్రయాణానికి ఒక రోజు ముందు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తత్కాల్ టికెట్లు కూడా బుక్ చేసుకోలేకపోయిన వారికి ఇండియన్ రైల్వే చివరి అవకాశాన్ని కల్పిస్తోంది. రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు కూడా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
రైలు బయల్దేరడానికి ముందు రెండు ఛార్ట్ లు రెడీ
నిజానికి కొంత మంది రైల్వే ప్రయాణీకులు చివరి నిమిషంలో ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. వాళ్లు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటారు. అలాంటి సమయంలో ఖాళీగా ఉన్న టికెట్లను ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 5 నిమిషాల ముందు టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది రైల్వే సంస్థ. రైలు బయల్దేరడానికి ముందు రెండుసార్లు ఛార్ట్ రెడీ చేస్తారు. అందులో మొదటిది రైలు బయల్దేరడానికి 4 గంటల ముందుకు రెడీ చేస్తారు. రెండో ఛార్ట్ రైలు స్టార్ట్ కావడానికి కొద్ది సేపటి ముందు తయారు చేస్తారు. ఫైనల్ ఛార్ట్ రెడీ అయిన తర్వాత మిగిలిపోయిన ఖాళీలను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది రైల్వేసంస్థ. ఈ టికెట్లను బోర్డింగ్ స్టేషన్ నుంచి మాత్రమే బుక్ చేసుఓవచ్చు. ఒకవేళ మధ్య స్టేషన్ నుంచి టికెట్ కావాలంటే టీటీఈని సంప్రదించాల్సి ఉంటుంది.
Read Also: థర్డ్ ఏసీ To స్లీపర్ క్లాస్.. వామ్మో రైల్లో ఇన్ని రకాల క్లాస్ లు ఉన్నాయా?
ఇంతకీ రైల్లో ఖాళీలు ఉన్నాయో? లేదో? ఎలా తెలుసుకోవాలి?
రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు టికెట్లు బుక్ చేసుకోవాలంటే ముందుగా ట్రైన్ లో సీట్లు ఖాళీగా ఉన్నాయో? లేదో? తెలుసుకోవాలి. రైల్వే అధికారులు రెడీ చేసిన ఆన్ లైన్ ఛార్ట్ ను చూసి ఖాళీలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ముందుగా IRCTC యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్ మీద ట్యాప్ చేయాలి. అప్పుడు ఖాళీలు ఉన్నాయో? లేదో? తెలుస్తోంది. ఒకవేళ ఖాళీగా ఉంటే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అటు ఆన్ లైన్ ఛార్ట్ వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. ట్రైన్ పేరు, నెంబర్, డేట్, రైలు ఎక్కాల్సిన స్టేషన్ వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ ట్రైన్ ఛార్ట్ అనే అప్షన్ మీద క్లిక్ చేయాలి. వెంటనే కేటగిరీల వారీగా ఖాళీ ఉన్న సీట్ల వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఒక వేళ ఖాళీ సీట్లు కనిపిస్తే, ఉన్నవాటిలో నచ్చిన సీటు బుక్ చేసుకోవచ్చు. సీట్లు ఖాళీగా లేకపోతే జీరో కనిపిస్తుంది.
Read Also: ప్లాట్ ఫారమ్ టికెట్ కౌంటర్ లోనే కాదు, ఆన్ లైన్ లోనూ తీసుకోచ్చు, ఎలాగంటే?