Festival Special Trains 2025: దసరా, దీపావళి పండుగ సమయాల్లో రైల్వే ప్రయాణాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించాయి. విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు దసరా స్పెషల్ ట్రైన్(08589) విశాఖలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10:00 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. అక్టోబర్ 4న రాత్రి 8.00 గంటలకు తిరుగు ప్రయాణంలో చర్లపల్లి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:45 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
ఈ రెండు స్పెషల్ రైళ్లు అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, యలమంచిలి, అన్నవరం, నిడదవోలు, నల్గొండలో ఆగుతాయి.
దసరా, దీపావళి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అదనంగా 500 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు చెప్పారు. దీంతో పాటు ప్రధాన మార్గాల్లో 350 రైళ్లకు అదనంగా బోగీలను అమర్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అదనపు సౌకర్యాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సాధారణంగా సికింద్రాబాద్ నుంచి ప్రయాణించే రైళ్లు రోజుకు 1.3 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తాయి. పండుగల సందర్భంగా ప్రయాణికుల సంఖ్య 2 లక్షల వరకు పెరిగింది. దీంతో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు నవంబర్ చివరి వారం వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వేతో పాటు పలు రైల్వే డివిజన్లు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి.
Also Read: Rabi Crops MSP Hike: పండుగ రోజు రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఆరు పంటల మద్దతు ధరలు పెంపు