E-Paper
Advertisement

Bullet Train: అద్భుతం.. తిరుపతికి బుల్లెట్ రైలు, ఎక్కడి నుంచి ఎక్కడికంటే?

Bullet Train: అద్భుతం.. తిరుపతికి బుల్లెట్ రైలు, ఎక్కడి నుంచి ఎక్కడికంటే?
Advertisement

Bullet Train Hyd to Chennai: తెలంగాణ రాజధాని హైదరాబాద్, తమిళనాడు క్యాపిటల్ సిటీ చెన్నై నడుమ అత్యాధునిక బుల్లెట్ రైలు పరుగులు తీయబోతోంది. ఇంటర్ సిటీ ప్రయాణాన్ని మెరుగు పరచడమే లక్ష్యంగా ఈ రైల్వే కారిడార్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు రైల్వే అధికారులు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించ ప్రతిపాదిత మార్గానికి తుది అలైన్ మెంట్ నివేదికను దక్షిణ మధ్య రైల్వే తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ డీపీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన తర్వాత తుది మార్గం ఖరారు కానుంది. గతంలో ఈ మార్గం గూడూరు మీదుగా ఉండగా, ఇప్పుడు తిరుపతి మీదుగా ఈ మార్గం కొనసాగేలా మార్పులు చేస్తున్నట్లు చెన్నై యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అథారిటీ(సీయూఎంటీఏ) అధికారులు తెలిపారు.

భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం

ప్రస్తుతం హైదరాబాద్- చెన్నై మధ్య ప్రయాణానికి 12 గంటల సమయం పడుతుంది. కొత్తగా డిజైన చేసిన మార్గంలో కేవలం 2.20 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు సౌత్ ఇండియాలో ఇంటర్ సిటీ ప్రయాణాన్ని పూర్తిగా మార్చబోతోంది. రీసెంట్ గా తమిళనాడుకు  రాసిన లేఖలో దక్షిణ మధ్య రైల్వే అలైన్‌ మెంట్, స్టేషన్‌ కు స్థలాలు త్వరగా ఖరారు చేయాలని, భూమిని సేకరించేందుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపాలని కోరింది. రాష్ట్రంలో దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల మాస్టర్‌ ప్లాన్‌ లో రైలు కారిడార్‌ను కూడా చేర్చాలని కోరింది. రాష్ట్రంలోని హైస్పీడ్‌ నెట్వర్క్‌ నిర్మాణంలో 12 కి.మీ వరకు సొరంగ మార్గం ఉండనుంది. స్థల సేకరణపై జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరింది.

హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ గురించి..  

Advertisement

⦿ ప్రాజెక్ట్ స్టేటస్: హైదరాబాద్-చెన్నై హై స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణానికి సంబంధించి తుది డిజైన్ (DPR) కోసం నివేదికలు తయారవుతున్నాయి.

⦿ రైల్వే మార్గం: ఈ రైలు గూడూరుకు బదులుగా తిరుపతి మీదుగా వెళ్లేలా ప్రణాళికలు జరుగుతున్నాయి.

Advertisement

⦿ ప్రయాణ సమయం: ప్రస్తుత 12 గంటల ప్రయాణ సమయం ఉండగా, బుల్లెట్ రైలుతో దాదాపు 2.20 గంటలకు తగ్గనుంది.

⦿ ప్రయోజనం: ఇది హైదరాబాద్, చెన్నై మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేసి, రెండు నగరాల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది.

⦿ నెక్ట్స్ స్టెప్ ఏంటి?: తమిళనాడు ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత ప్రాజెక్ట్ ముందుకు సాగుతుంది.

Read Also: ఇండిగో వివాదం.. ఇంతకీ దాని యజమాని ఎవరు? ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

⦿ ప్రతిపాదిత మార్గానికి 223.44 హెక్టార్ల భూమి అవసరం. అటవీ భూమి ఇందులో లేదని రైల్వే అధికారులు గుర్తించారు. ఈ మార్గం 65 రోడ్లు, 21 హైటెన్షన్‌ పవర్ లైన్లను దాటి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ దేశ వ్యాప్త హై-స్పీడ్ రైల్ నెట్‌ వర్క్‌ లో భాగం కానుంది. దీనితో దక్షిణాదిలో రైలు ప్రయాణానికి కొత్త శకం ప్రారంభం కానుంది.

Read Also:  లోయర్ బెర్త్ విషయంలో కీలక నిర్ణయం, అసలు విషయం చెప్పేసిన అశ్విని వైష్ణవ్!

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×