E-Paper
Advertisement

OTT Movie : రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ… వారం తిరక్కుండానే ఓటీటీలోకి … ఐఎండీబీలో టాప్ రేటింగ్

OTT Movie : రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ… వారం తిరక్కుండానే ఓటీటీలోకి … ఐఎండీబీలో టాప్ రేటింగ్

OTT Movie : రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘పాంచ్ మినార్’ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా, థియేటర్లలో రిలీజైన వారం రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రావడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ గత వారం థియేటర్లలో రిలీజై ఎలాంటి సమాచారం లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మధ్యే ఆహా ఓటీటీలోకి ‘చిరంజీవ’ సినిమాతో పోలిస్తే, ఇప్పుడు వచ్చిన ‘పాంచ్ మినార్’ కి అంతగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఈ సినిమాకి ఐఎండీబీలోనూ 9.3 రేటింగ్ ఉండటం విశేషం. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

రాజ్ తరుణ్, రాశీ సింగ్ లీడ్ రోల్స్ లో నటించిన ‘ పాంచ్ మినార్’ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో వచ్చింది. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజైంది. వారం రోజుల్లోనే నవంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. రామ్ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పడు ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కే ఒక యువకుడి చుట్టూ ఈ కథ ఉంటుంది.

Read Also : ఓటీటీలోకి రాధిక ఆప్టే డబుల్ మర్డర్ థ్రిల్లర్… మొగుడితో పాటు ఇంకొకరు… అలాంటి స్టోరీనే

స్టోరీ ఏమిటంటే

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆటో డ్రైవర్ కొడుకు రాజు (రాజ్ తరుణ్) ఒక ఫైర్ ఉన్న వ్యక్తి . అయితే అతని దగ్గర డబ్బులు మాత్రం ఉండవు. ఒక రోజు రాశీ (రాశీ సింగ్) అనే రిచ్ అమ్మాయిని చూసి లవ్‌లో పడిపోతాడు. ఇద్దరూ ఫుల్ జోష్‌లో షికార్లు తిరుగుతారు. కానీ రాశీ నాన్న “5 కోట్లు సంపాదిస్తేనే పెళ్లి” అని ఒక్క మాట చెప్పి దెబ్బ కొడతాడు. రాజు ఏం చేయాలో తెలీక ఒక లోకల్ గ్యాంగ్‌లో జాయిన్ అవుతాడు. రాజు చిన్న చిన్న జాబ్స్ నుంచి స్టార్ట్ చేసి ఒక్కో లెవెల్ ఎక్కుతూ పోతాడు. చివరికి ఆ గ్యాంగ్ పెద్ద ప్లాన్ వేస్తుంది. “పాంచ్ మినార్” అనే 5 అరుదైన వజ్రాలు (50 కోట్ల విలువ) దొంగిలించాలి. ఆ గ్యాంగ్ రాజుకి ఆ పని పురమాయిస్తుంది. షేర్ 10 కోట్లు వస్తే చాలని రాజు కూడా ఫిక్స్ అయిపోతాడు. అయితే గ్యాంగ్ లీడర్ రాజుకి వాటా ఇవ్వకుండా లేపేయాలని ప్లాన్ వేస్తాడు. ఇక స్టోరీ ఆసక్తికర మలుపులతో ముందుకు సాగుతుంది. చివరికి రాజు ఆ గ్యాంగ్ ని ఎలా ఎదుర్కొంటాడు ? వజ్రాల స్కామ్ ఏమవుతుంది ? రాశీతో పెళ్ళికి లైన్ క్లియర్ అవుతుందా ? అనే విషయాలను, ఈ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×