E-Paper
Advertisement

MS DHONI: నేను ముసలోడిని అయిపోయా..ఇక ఐపీఎల్ ఆడ‌ను

MS DHONI: నేను ముసలోడిని అయిపోయా..ఇక ఐపీఎల్ ఆడ‌ను
Advertisement

MS DHONI:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మనోళ్లు చెత్తగా ఆడడమే కాకుండా… వైట్ వాష్ ప్రమాదాన్ని తెచ్చుకున్నారు. నిన్న నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ (Trent Bridge, Nottingham) వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడవ టి20 జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా చిత్తుగా ఓడిపోవడం గమనార్హం. అయితే నిన్న పుట్టిన రోజు ఉండగా… మ్యాచ్ తిలకించేందుకు స్వయంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా ధోని (MS DHONI) కెమెరా కంట ప‌డ్డాడు. అయితే ఈ సందర్భంగా కొంత మంది ఫ్యాన్స్ ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై ప్రశ్నించారు. ఈ క్రమంలో భవిష్యత్తులో తాను ఐపీఎల్ ఆడబోనని, ముసలోడిని అయిపోయానంటూ సైగలు చేశారు ధోని. దీంతో మిస్ట‌ర్ కూల్ కెప్టెన్‌ ఐపిఎల్ కెరీర్ ఎండ్ అయినట్లు సోషల్ మీడియాలో పోస్టుల వైరల్ అవుతున్నాయి.

Also Read: Joshua Tromp names Haris Rauf as the toughest bowler: హారిస్ రవూఫ్ ఒక్క‌డే ప్ర‌పంచంలోనే భ‌యంక‌ర‌మైన బౌల‌ర్

నేను ముసలోడిని అయిపోయా.. ఇక ఐపీఎల్ ఆడ‌ను

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడవ టి20 నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగింది. ఈ క్రమంలో తన పుట్టినరోజు కూడా కావడంతో… మ్యాచ్ చూసేందుకు మహేంద్రుడు స్టేడియానికి వచ్చాడు. ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోని స్క్రీన్ పైన కనిపించడంతో… స్టేడియానికి వచ్చిన అభిమానులు కేరింతలు చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మ్యాచ్ దొబ్బిందని గ్రహించి.. మధ్యలోనే హోటల్ రూమ్ కు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ధోనిని ఉద్దేశించి కొంత మంది అభిమానులు… ఐపీఎల్ ప్రస్తావని తీసుకువచ్చారు. గ్యాలరీ పైన ఉన్న ధోనిని… కింద ఉన్న కొంత మంది అభిమానులు… ఐపీఎల్ లో ఆడతావా ? ఎప్పుడు మళ్లీ మైదానం లోకి దిగుతావు ? అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే వాళ్లందరికీ నోటితో కాకుండా సైగలు చేసి… తాను ఐపీఎల్ ఆడబోనని కుండబద్దలు కొట్టి చెప్పారు ధోని.

దాదాపు ధోని రిటైర్మెంట్ ఇచ్చిన‌ట్టే !

ఇప్పటికే తాను ముసలోడిని అయ్యానని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ర పట్టుకొని నడుస్తున్నానని ట్రోలింగ్ చేస్తున్నట్లు వివరించారు. అభిమానులే ఇలా ఫిక్స్ అయిన తర్వాత… తాను ఐపీఎల్ ఆడబోనని వెల్లడించారు. ఇదంతా తన సైగలతో ధోని చెప్పడం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ధోని అభిమానులు నిరాశ చెందుతున్నారు. మహేంద్ర సింగ్ ధోని అన్ అఫీషియల్ గానే ఐపిఎల్ టోర్నమెంటుకు రిటైర్మెంట్ ఇచ్చాడని పోస్టులు పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా, ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో 45 ఏళ్ల‌ ధోని ప్రాక్టీస్ మ్యాచ్ లలో తప్ప… ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అందుకే సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

Advertisement

Also Read: Shahid Afridi Reaction On England vs India, 2nd T20I : ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓట‌మి.. టీమిండియా ప‌త‌నం మొద‌లైందంటూ అఫ్రిది సంచ‌ల‌నం !

 

Related News

వీల్ చైర్ పై వచ్చైనా రెండో టెస్టులో బాబ‌ర్ ఆజం ఆడాలి

మొద‌టి బంతికే 80 ప‌రుగులు…టీమిండియా క్రికెట‌ర్ స‌రికొత్త రికార్డ్

గ‌జ దొంగ‌ న‌ఖ్వీ ప‌క్క‌న కూర్చోడానికి సిగ్గులేదా ? శుక్లా ప‌రువు తీసిన ఇర్ఫాన్ ప‌ఠాన్‌

సారా ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసే ప్ర‌య‌త్నం… వార్నింగ్ ఇచ్చిన సచిన్ !

లైవ్ మ్యాచ్ లో కండ‌లు చూపించిన ధ్రువ్ జురెల్ బ్యాన్ వేయాల్సిందే !

7500 KMల‌ ప్రయాణం..రూ.10 ల‌క్ష‌ల ఖ‌ర్చు, లిట‌న్ దాస్ వ‌రుస డ‌కౌట్స్ పై ట్రోల్స్‌

ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై టీమిండియానే గెలువ‌లేదు..పాకిస్తాన్ ఎలా గెలుస్తుంది

ధోని పీకిందేమీ లేదు..గంగూలీ వ‌ల్లే టీమిండియాకు 2007, 2011 ట్రోఫీలు

Big Stories

Advertisement
×