IndiGo Special Offer: ప్రముఖ విమానయాన సంస్థ ఎప్పటికప్పుడు తన ప్రయాణీకులను ఆకట్టుకునేలా సూపర్ డూపర్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకున్నది. ఇప్పటికే అతి తక్కువ ధరలకే విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తుండగా, ఇప్పుడు ఆ జర్నీని మరింత ఆహ్లాదకరంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం చక్కటి ఆఫర్ ను పరిచయం చేసింది. ముఖ్యంగా సంగీతాన్ని ఇష్టపడే వారు ఈ ఆఫర్ గురించి వింటే ఎగిరి గంతేయడం ఖాయం. ఫ్లైట్ జర్నీ సమయంలో ప్యాసెంజర్లు సంగీతాన్ని వింటూ ఎంజాయ్ చేసేలా స్పాటిఫై (Spotify)తో చేతులు కలిపింది. ప్రయాణీకులకు సరికొత్త ఆఫర్ ను పరిచయం చేసింది. ఉచితంగా స్పాటిఫై ప్రీమియం మెంబర్ షిప్ ట్రయల్ ప్లాన్ ను పొందే అవకాశం కల్పిస్తున్నది. ఈ కొత్త ఆఫర్ ప్రకారం స్పాటిఫై అందించే మ్యూజిక్, ఆడియో బుక్స్ సహా ఇతర సేవలను ఫ్లైట్ జర్నీలో పొందే అవకాశం ఉంది. ఈ సబ్ స్క్రిప్షన్ ఆఫర్ ను టికెట్ బుకింగ్ సమయంలోనే ప్రయాణీకులకు అందించేలా స్పాటిఫైతో అగ్రిమెంట్ చేసుకుంది.
ఇప్పటికే స్పాటిఫై సబ్ స్క్రిప్షన్ ఉంటే?
ప్రస్తుతం ఇండిగో విమానయాన సంస్థ తీసుకొచ్చిన కొత్త ఆఫర్ ప్రకారం నాలుగు నెలల పాటు స్పాటిఫై ప్రీమియం ప్లాన్ ను పొందే అవకాశం ఉంటుంది. దేశీయ అంతర్జాతీయ ప్రయాణీకులు ఇండిగోకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ లేదంటే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు ఈ ఆఫర్ ను పొందే అవకాశం కల్పిస్తున్నది. ఆయా రూట్లలో ప్లే అయ్యే పాటల లిస్టును ముందుగానే తయారు చేస్తారు. వాటినే విమాన ప్రయాణంలో వినే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటికే స్పాటిఫై సబ్ స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఈ ఆఫర్ పొందే అవకాశం లేదని ఇండిగో సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఆఫర్.. వచ్చే ఏడాది అక్టోబర్ 3 వరకు కొనసాగనుంది. ఫ్రీ ఆఫర్ అయిపోయిన తర్వాత నెలకు రూ. 119 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ ప్రయాణీకులకు వద్దు అనుకుంటే తమ సబ్ స్క్రిప్షన్ ను ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కావాలంటే ఇలా చేయండి!
⦿ ఇండిగో సంస్థకు చెందిన విమాన టికెట్ బుక్ చేసుకోగానే మీ మెయిల్ కు ఓ లింక్ వచ్చేస్తుంది.
⦿ మెయిల్ కు వచ్చిన లింక్ ను ఓపెన్ చేయాలి. స్పాటిఫై- ఇండిగో సంస్థకు సంబంధించిన ఆఫర్ వివరాలు కనిపిస్తాయి.
⦿ ఆ లింక్ ను క్లిక్ చేయగానే నేరుగా స్పాటిఫై హోం పేజీకి వెళ్తుంది. అక్కడ ఈ ఆఫర్ ను పొందే స్టెప్స్ ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ వెళ్లాలి.
⦿ చివరకు మీకు స్పాటిఫై ప్రీ సబ్ స్క్రిప్షన్ పొందే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత మీరు ఫ్లైట్ జర్నీ చేస్తున్న సమయంలో హ్యాపీగా పాటలు వినొచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే మీరూ ఈ ఆఫర్ ను దక్కించుకోండి!
Read Also: సెంట్రల్.. జంక్షన్.. టెర్మినల్.. బాబోయ్! దేశంలో ఇన్ని రకాల రైల్వే స్టేషన్లు ఉన్నాయా?