Indian Railway Stations: రైలు ప్రయాణం చేసే సమయంలో బోలెడు స్టేషన్లను దాటుకుంటూ ముందుకు వెళ్తాం. ఆ సమయంలో రైల్వే స్టేషన్ల పేర్లు డిఫరెంట్ కనిపిస్తాయి. కొన్ని స్టేషన్లకు జంక్షన్ అని ఉంటుంది. మరికొన్ని స్టేషన్లకు టెర్మినల్ అని ఉంటాయి. ఇంకొన్ని స్టేషన్లకు సెంట్రల్ అని ఉంటుంది. మరికొన్నింటికి కంటోన్మెంట్ అని ఉంటుంది. మరికొన్నింటికి రోడ్ అని ఉంటుంది. అసలు రైల్వే స్టేషన్లకు ఇలా పేర్లు ఎందుకు పెడతారు? వీటి వెనుకున్న అర్థం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
⦿ కంటోన్మెంట్
కొన్ని స్టేషన్ల పేరు పక్కన కంటోన్మెంట్ అని ఉంటుంది. ఉదాహారణకు బెంగళూరు కంటోన్మెంట్. దీని అర్థం ఏంటంటే.. ఆ రైల్వే స్టేషన్ సమీపంలో ఆర్మీ ఏరియా ఉంటుంది. అక్కడ సైన్యానికి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతాయని అర్థం.
⦿ రోడ్
కొన్ని స్టేషన్ల పేర్ల పక్కన రోడ్ అని యాడ్ అవుతుంది. ఎందుకంటే.. కొన్ని ఏరియాలకు రైల్వే మార్గం వేసే అవకాశం ఉండదు. అలాంటి సమయంలో ఊరికి కొంచెం దగ్గర నుంచి ట్రాక్ అనేది వెళ్తుంది. అక్కడ స్టేషన్ ను కట్టి ఆ ఊరి పేరు తర్వాత రోడ్ అని యాడ్ చేస్తారు. ఉదాహారణకు మదనపల్లి రోడ్.
⦿ జంక్షన్
స్టేషన్ నుంచి వెళ్లడానికి, రావడానికి రెండు, అంతకు మించి రైల్వే రూట్లు ఉంటే దాన్ని జంక్షన్ అంటారు. ఉదాహారణకు భీమవరం జంక్షన్. ఇక్కడి నుంచి మూడు వేర్వేరు రూట్లు ఉంటాయి. అందులో ఒకటి విజయవాడ రూటు, మరొకటి నిడదవోలు రూటు.. ఇంకొకటి నర్సాపురం రూటు ఉంటుంది.
⦿ టెర్మినల్
టెర్మినల్ అంటే ఎండ్. ఆ ట్రాక్ అక్కడితో ఎండ్ అవుతుంది. ఆ స్టేషన్ కు వచ్చిన రైలు, వచ్చిన రూట్ లోనే వెనక్కి వెళ్లాలి. ఉదాహారణకు శ్రీ ఎం విశవేశ్వరయ్య టెర్మినల్, బెంగళూరు.
⦿ సెంట్రల్
మన దేశంలో 5 మాత్రమే సెంట్రల్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లు సిటీ మధ్యలో ఉంటాయి. అక్కడికి ఎక్కువ మంది ప్రయాణీకులు వస్తారు. ఎక్కువ సంఖ్యలో రైళ్లు కూడా వస్తుంటాయి. ఉదాహారణకు చెన్నై సెంట్రల్.
Read Also: దేశంలో అతి చిన్న రైలు.. ఎక్కడైనా చెయ్యెత్తి ఎక్కొచ్చు!
దేశంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ
భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. రోజుకు సుమారు 2 నుంచి 3 కోట్ల మంది ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరకు సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో చాలా మంది రైలు ప్రయాణం చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇప్పటికే వందేభారత్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలోనే హైడ్రోజన్ తో నడిచే రైళ్లు పట్టాలు ఎక్కబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా రైల్వే వ్యవస్థ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో రైల్వేలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి.
Read Also: స్టీమ్ రైల్లో వైఫై కోసం నేరుగా శాటిలైట్ తో లింక్, అధికారుల సరికొత్త ఆలోచన!