BigTV English

Virat – Anushka : విరాట్- అనుష్క శర్మ విడాకులు? కోహ్లీ పోస్ట్ వైరల్..

Virat – Anushka : విరాట్- అనుష్క శర్మ విడాకులు? కోహ్లీ పోస్ట్ వైరల్..

Virat – Anushka : ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకుల మాట ఎక్కువగా వినిపిస్తుంది. ప్రేమించి కొన్నేళ్లు డేటింగ్ చేసి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటలు ఇప్పుడు చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్నారు. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇదే తంతు కొనసాగుతుంది. రీసెంట్గా పెళ్లి చేసుకున్న వారి దగ్గర నుంచి ఏళ్లు కాపురం చేసిన వాళ్లు కూడా చిన్న వాటికి మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు.. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్త సంచలనంగా మారింది. ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ జంట మరెవ్వరో కాదు. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ.. ఈ వార్తల్లో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇండస్ట్రీలో బాగా పాపులారిటిని సొంతం చేసుకున్న క్రేజీ కపుల్స్ విడిపోవడం వారి ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఏడాది తొలుత మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జివి ప్రకాష్ కుమార్ తన భార్యతో విడిపోయారు. జివి ప్రకాష్ తన భార్య తో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. అసలు కారణాలు ఏంటో తెలియకుండానే విడిపోయినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత తమిళ హీరో జయం రవి కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి తన అభిమానులకు షాక్ ఇచ్చారు. తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జయం రవి ప్రకటించారు. కానీ రవి భార్య ఆర్తీ స్పందిస్తూ.. తనకు తెలియకుండా విడాకులు తీసుకున్నట్టు ప్రకటన చేసి.. అందరికీ షాక్ ఇచ్చింది. ఇక రీసెంట్ గా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తన 29 ఏళ్ల కాపురానికి గుడ్ చెప్పేసాడు.. ఇప్పుడు కోహ్లీ కూడా తన భార్య తో విడిపోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరు కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2017లో ఇటలీలో సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ వామిక, అకాయ్ అనే ఒక పాప, బాబు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. ఈ జంట.. తమ పిల్లల ముఖాలను మాత్రం ప్రపంచానికి చూపించడం లేదు. దీంతో వారి పిల్లల ను ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఓ పోస్ట్ పెట్టాడు. అది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


ఆ పోస్ట్ లో…వెనక్కి తిరిగి చూసుకుంటే.. మేము ఎప్పుడూ కాస్త భిన్నంగా ఉంటాం. మేం ఒక అభిరుచికి మాత్రమే పరిమితం కాలేదు. ఆరంభంలోనే మేమేంటో అందరికీ తెలిసినా.. రెండుసార్లు మిస్‌ఫిట్ అయ్యాం. అయితే.. కొందరు మమ్మల్ని వెర్రివాళ్ళని పిలిచారు. ఇతరులు దానిని ఆమోదించలేదు. కానీ..వాటిని ఎప్పుడూ మేం పట్టించుకోలేదు. 10 ఏళ్ల కిందట రైట్ అనిపించింది.. ఇప్పుడు రాంగ్ అవ్వొచ్చు.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి అన్నీ చూసుకుంటూ వెళ్లిపోవాలి’ అంటూ రాసుకొచ్చారు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో విరాట్ కోహ్లీ.. అనుష్కకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై విరాట్ క్లారిటి ఇస్తారేమో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×