BigTV English

Bullet train: భలే ఛాన్స్.. జపాన్‌లో బుల్లెట్ రైలులో ప్రయాణించే సువర్ణ అవకాశం, ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజ్

Bullet train: భలే ఛాన్స్.. జపాన్‌లో బుల్లెట్ రైలులో ప్రయాణించే సువర్ణ అవకాశం, ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజ్

మీకు బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించాలని ఉందా..?


ఇండియాలో అసలు బుల్లెట్ ట్రైన్లే లేవు కదా, మరి ఎలా..?
అదంతా మీకెందుకు..? మీ ప్రయాణ ఏర్పాట్లన్నీ IRCTC చూసుకుంటుంది.
జస్ట్ మీకు బుల్లెట్ ట్రైన్ లో ఎక్కాలనే ఆసక్తి, దానికి తగ్గ ఆర్థిక వనరులు ఉంటే చాలు.
మీ ప్రయాణానికి IRCTC ఒక అద్భుతమైన ప్యాకేజీ రెడీ చేసింది.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). రైల్వే టికెట్ బుకింగ్ లతోపాటు దేశీయంగా టూర్ ప్యాకేజీలను అందిస్తున్న IRCTC తాజాగా అంతర్జాతీయ ఎడిషన్ లో సరికొత్త అనుభవాన్ని భారతీయులకు పరిచయం చేస్తోంది. జపాన్ లో బుల్లెట్ రైలుని ఎక్కే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక టూర్ ప్యాకేజీని సిద్ధం చేసింది. ఇప్పటికే 11 రోజుల ఫస్ట్ ట్రిప్ పూర్తయింది. జపాన్ కు మరో రెండు ట్రిప్పులు ప్లాన్ చేసింది IRCTC. ఈ ఏడాది అక్టోబర్ లో, 2026 మార్చిలో IRCTC టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. బుల్లెట్ ట్రైన్ ఎక్కాలనుకునే ఆశావహులు ఈ ప్యాకేజీలను ఉపయోగించుకోవచ్చు.


బుల్లెట్ ప్యాకేజ్..
IRCTCకి ఇటీవలే భారత ప్రభుత్వం నవరత్న హోదా ప్రకటించింది. ఆ తర్వాతే జపాన్ బుల్లెట్ ట్రైన్ టూర్ ప్యాకేజీని IRCTC అందుబాటులోకి తెచ్చింది. జపాన్‌లోని ఒసాకా నుండి హిరోషిమా వరకు, హిరోషిమా నుండి టోక్యో వరకు ప్రయాణించే బుల్లెట్ ట్రైన్స్ లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ముంబై, పుణె, బెంగళూరు నుండి దాదాపు 30 మంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. IRCTC లో ప్యాకేజీ బుక్ చేసుకుని ఎంచక్కా వీరంతా జపాన్ వెళ్లి బుల్లెట్ ట్రైన్ లో హైస్పీడ్ ప్రయాణాన్ని అనుభూతి చెందారు.

ఇదంతా ఎందుకు..?
జపాన్ వెళ్లి మరీ బుల్లెట్ ట్రైన్ లో ఎందుకు ప్రయాణించాలి..? దానికోసం IRCTC టూర్ ప్యాకేజీ ఎందుకు రూపొందించింది..? ప్రచారం కోసమే IRCTC ఇదంతా చేస్తోంది. భారత్ లో కూడా త్వరలో బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయి. ముంబై, అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ ప్రయాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతున్నా.. భారతీయులకు ఆ అనుభూతిని మాత్రం మరింత దూరం చేయాలని IRCTC భావించట్లేదు. అందుకే భారతీయుల్ని జపాన్ తీసుకెళ్లి మరీ అక్కడి బుల్లెట్ ట్రైన్లు ఎక్కిస్తోంది.

జపాన్ లో బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణ ఖర్చు దాదాపు 20వేల రూపాయల వరకు ఉంటుంది. IRCTC టూర్ ప్యాకేజీలో ఈ ప్రయాణంతోపాటు.. మౌంట్ ఫుజిని సందర్శించవచ్చు. ఆషి సరస్సుపై క్రూయిజ్ రైడ్ లో కూడా పాల్గొనవచ్చు. మాగ్లెవ్ రైల్వే పార్క్, హిరోషిమా బాంబ్ మ్యూజియాన్ని కూడా సందర్శించే అవకాశం ఉంది. నిజంగా ఇది ఓ అద్భుత ప్రయాణం అని ఈ టూర్ లో పాల్గొన్న ఒక సందర్శకుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. మన దేశంలో కూడా బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి రావాలన్నారు.

జపాన్ సాయం..
భారత్ లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కి జపాన్ కూడా సాయం చేస్తోంది. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ పరీక్షలు, తనిఖీలకోసం రెండు షింకన్ సెన్ రైళ్లను జపాన్ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఈ రెండు రైళ్లు 2026 ప్రారంభంలో ఇండియాకు చేరతాయి. ఈ క్రమంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కి మరింత ప్రచారాన్ని చేకూరుస్తూ.. ఇటు IRCTC ఏకంగా జపాన్ టూర్ వేయడం విశేషం.

Related News

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. ఒకే ట్రిప్‌లో సింగపూర్, మలేసియా చూసే ఛాన్స్!

Railway Station Closed: ఆ రైల్వే స్టేషన్ మూసివేత.. జనాలు లేక కాదు, ఉద్యోగులు లేక!

Hydrogen Train Ticket: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?

Big Stories

×