Nani: నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం హిట్ 3 (Hit 3). హిట్ ఫ్రాంచైజీలో భాగంగా మే 1వ తేదీన విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజే రూ.43 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి.. రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా పోస్టర్ తో సహా రిలీజ్ చేశారు. నాని సినీ కెరియర్ లోనే ఇప్పటివరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా కూడా హిట్ 3 నిలిచింది. ఇక మొత్తానికైతే మొదటి రోజే కలెక్షన్ల సునామి సృష్టించిన నాని, ఇప్పుడు అభిమానులతో కలిసి థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా హిట్ 3 సినిమా చూసిన తర్వాత అభిమాని అడిగిన ప్రశ్నకు కౌంటర్ ఇచ్చారు నాని.
అభిమానికి నాని కౌంటర్..
ఇక నానిని నేరుగా చూసేసరికి సర్ప్రైజ్ అయిపోయిన అభిమాని.. సెల్ఫీ వీడియోతో..” నాని అన్న మీరు మోసం చేశారు. హిట్ అని చెప్పి బ్లాక్ బస్టర్ కొట్టి మోసం చేశారు అని అంటే.. దానికి నాని సమాధానంగా.. మళ్లీ మళ్లీ ఇదే మోసం చేస్తానంటూ “నాని కౌంటర్ ఇచ్చారు. మొత్తానికైతే నెక్స్ట్ సినిమాతో కూడా ఇలాగే బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు నాని. మొత్తానికి అయితే శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంఛైజీ లో భాగంగా వచ్చిన హిట్ 3 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
నాని సినిమాలు..
ఇక నాని సినిమాల విషయానికే వస్తే.. హిట్ 3తో ఎలాగో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు నాని ది ప్యారడైజ్ (The Paradise)అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth odala) దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండీ గ్లింప్స్ విడుదలవగా.. ఇది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మొన్నటి వరకు పక్కింటి అబ్బాయి పాత్రలు, ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నాని..ఇప్పుడు వరుసగా మాస్ సినిమాలు చేస్తూ.. వరుసగా అలాంటి స్టోరీలే సెలెక్ట్ చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నానీ చేస్తున్న ది ప్యారడైజ్ సినిమా.. సోషల్ మీడియాలో సరికొత్త వివాదం సృష్టించింది. అసలు ఇక్కడ ఉన్నది నాని నేనా..?.. నాని సినిమా నేనా? అనే చర్చలు కూడా మొదలయ్యాయి. కడుపు మండిన కాకుల కథ ఇది అంటూ మొదలయ్యే గ్లింప్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నాని లుక్, డైలాగ్స్ , అనిరుద్ మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మ్యూజిక్ అంతా బాగానే ఉంది. నాని గెటప్ ఆయన మాస్ అవతారం చూసి అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాని నుంచి వచ్చిన డైలాగ్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒక తల్లిని కించపరిచేలా డైలాగులు ఏంటి అంటూ నాని పై ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆ డైలాగులను కట్ చేసి సినిమాను విడుదల చేస్తారేమో చూడాలి.
?utm_source=ig_web_copy_link