BigTV English

SRH VS GT: ఇవాళ గుజరాత్ తో మ్యాచ్.. ఓడితే SRH ఇంటికే

SRH VS GT: ఇవాళ గుజరాత్ తో మ్యాచ్.. ఓడితే SRH ఇంటికే

SRH VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో  ( Indian Premier League 2025 Tournament) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరార్ అయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.


Also Read: Rohit Sharma – DRS: ముంబై మ్యాచ్ ఫిక్సింగ్.. అడ్డంగా దొరికిపోయిన రోహిత్.. రాజస్థాన్ ఎలిమినేట్

ఓడితే ఇంటికే హైదరాబాద్


గుజరాత్ టైటాన్స్ జట్టు జట్టుపై ఇవాళ హైదరాబాదు ( Sun rishers hyderabad ) ఓడిపోతే… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇకపైన హైదరాబాద్ జట్టు ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( Chennai super kings ) పైన విజయం సాధించిన హైదరాబాద్… తమ తదుపరి అన్ని మ్యాచ్లు గెలవాలి. లేకపోతే ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాల్టి గుజరాత్ మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి.

గుజరాత్ కు అడ్వాంటేజ్

పాయింట్స్ టేబుల్ లో దూసుకు వెళ్తున్న గుజరాత్ టైటాన్స్… ఇవాల్టి మ్యాచ్లో కచ్చితంగా గెలుస్తుందని అందరూ అంటున్నారు. అహ్మదాబాద్ వేదిక గుజరాత్ టైటాన్స్ కు… సొంత గడ్డ. అలాంటి నేపథ్యంలో… హైదరాబాద్ ( SRH ) పైన కచ్చితంగా గుజరాత్ గెలుస్తుందని చెబుతున్నారు. గత రికార్డులు పరిశీలిస్తే… ఐదు మ్యాచ్లలో… గుజరాత్ నాలుగు మ్యాచ్లో విజయం సాధించింది. హైదరాబాద్ ఒకే ఒక మ్యాచ్ లో విజయం సాధించడం జరిగింది. ఈ లెక్క ప్రకారం గుజరాత్ కు అడ్వాంటేజ్ ఉంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament) నుంచి రెండు జట్లు ఎలిమినేట్ అయ్యాయి. మొదట చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అలాగే నిన్న రాజస్థాన్ రాయల్స్ కూడా ఎలిమినేట్ అయిపోయాయి. ఇవాల్టి మ్యాచ్ లో ఓడితే హైదరాబాద్ కూడా ఇంటికి వెళ్లడం గ్యారెంటీ.

Also Read: SRH Team Maldives trip  : కలసి ఉంటే కలదు సుఖం… తెలుగు హీరో అయిపోయిన ప్యాట్ కమిన్స్

గుజరాత్ టైటాన్స్ VS  సన్‌రైజర్స్ హైదరాబాద్

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (c), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

ఇంపాక్ట్ ప్లేయర్: ఇషాంత్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ

ఇంపాక్ట్ ప్లేయర్: అనికేత్ వర్మ

Related News

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

Big Stories

×