E-Paper
Advertisement

రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ ర్యాలీ..10 లక్షల మంది వస్తారని అంచనా, భారీగా పోలీసుల మోహరింపు

రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ ర్యాలీ..10 లక్షల మంది వస్తారని అంచనా, భారీగా పోలీసుల మోహరింపు
Advertisement

Ramlila Maidan Rally: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు పుష్కరకాలం తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి మెగా ర్యాలీకి దిగింది. దీంతో ఢిల్లీలోని అడుగడుగునా పోలీసులు మోహరించారు. 14 సెక్యూరిటీ జోన్లను ఏర్పాటు చేశారు. 4 వేల మంది మోహరించారు. అంతేకాదు 200 నిఘా కెమెరాలు, డ్రోన్లు సైతం చక్కర్లు కొడుతున్నాయి.

రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ ర్యాలీ

ఓటర్ల జాబితాల సవరణకు నిరసనగా సీఈసీ రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి ఆదివారం చలో ఢిల్లీ పేరిట కార్యక్రమం తలపెట్టింది. ఇండియా కూటమి ఈ మెగా ర్యాలీ నిర్వహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కనాట్‌ప్లేస్‌ కూడలి నుంచి మొదలైన ర్యాలీ.. రామ్‌లీలా మైదానానికి చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ‘వోట్ బచావో, దేశ్ బచావో’ నినాదంతో ర్యాలీ జరుగుతోంది. మెగా ర్యాలీకి రాంలీలా మైదాన్ వేదిక వద్ద ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీనియర్ ప్రతిపక్ష నాయకుల కోసం ప్రధాన వేదికపై పెద్ద త్రివర్ణ పతాక పందిరిని ఏర్పాటు చేశారు.

10 లక్షల మంది వస్తారని అంచనా, భారీగా బలగాల మోహరింపు

Advertisement

ఇండియా బ్లాక్ రాష్ట్ర విభాగాల ప్రతినిధుల కోసం మరొక ప్రత్యేక వేదిక రెడీ చేశారు. తెల్లటి గుడారాలు, బారికేడ్లు, తాత్కాలిక వేదికలు, నిర్దేశిత ఆవరణలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కూటమిలోని పార్టీల నాయకులతో పాటు విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సంస్థలు, కార్మికులు, మహిళలు, యువత పాల్గొనున్నారు. ఈ మెగా ర్యాలీకి బొద్దింక జనతా పార్టీ-సీజేపీ మద్దతు ప్రకటించింది. ఇండియా బ్లాక్ మెగా ర్యాలీకి సుమారు 10 లక్షల వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 50 వేల మంది వస్తారని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. జన సమూహం బయటకు రాకుండా నియంత్రించడానికి వేదిక వెలుపల అదనపు స్థలాన్ని కేటాయించారు.

విపక్షాల మెగా ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీలో భారీగా పోలీసులు మోహరించారు. వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిఘా కోసం 200కు పైగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, బాడీ-వోర్న్ కెమెరాలను ఉపయోగిస్తారు. జనసమూహం కదలికలు, ప్రవేశం, బయటకు వచ్చే మార్గాలను పర్యవేక్షించడానికి మైదానం లోపల ఒక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. అల్లర్ల నిరోధక వాహనాలు మోహరించాయి.

Advertisement

ALSO READ: కర్ణాటక రాజకీయాల్లో స్పై ఆపరేషన్ల కలకలం.. సిద్ధరామయ్య కేసులో సంచలన ట్విస్ట్!

హాజరయ్యేవారు నిర్దేశిత గేట్ల ద్వారా ప్రవేశించి మెటల్ డిటెక్టర్ స్క్రీనింగ్‌తో సహా భద్రతా తనిఖీలు తర్వాత లోపలికి పంపుతారు. జన సమూహాన్ని నియంత్రించడానికి, రాకపోకలను సులభతరం చేయడానికి, తాగునీరు, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లను ఏర్పాటు చేయడానికి వాలంటీర్లను నియమించారు. ఇదిలా ఉండగా వరుస నిరసనల దృష్ట్యా నవంబర్ నెల ప్రారంభంలో 270 CAPF కంపెనీల బలగాలను మోహరించారు. వారిని నవంబర్ 16 వరకు ఢిల్లీలో ఉండనున్నారు.

Related News

కర్ణాటక రాజకీయాల్లో స్పై ఆపరేషన్ల కలకలం.. సిద్ధరామయ్య కేసులో సంచలన ట్విస్ట్!

నడిరోడ్డుపై మహిళ హల్‌చల్.. బీఎండబ్ల్యూ కారుతో బీభత్సం.. పోలీసునే ఢీకొట్టేందుకు యత్నం!

క్లాస్‌రూమ్‌లో దారుణం.. 6 ఏళ్ల చిన్నారిపై 8 ఏళ్ల బాలుడి రాక్షస దాడి.. షాకింగ్ CCTV విజువల్స్!

క్రూర చక్రవర్తిని కంటతడి పెట్టించిన ఆ ఒక్క సంఘటన.. కళింగ యుద్ధంలో అసలు ఏం జరిగింది?

ఖైదీల పరారీ ఘటన.. సీఎం విజయ్ సీరియస్.. జైలు అధికారిపై వేటు!

రన్నింగ్ బస్సులో పురిటి నొప్పులు.. మహిళా ప్రయాణికుల సాయం.. బిడ్డకు జన్మనిచ్చిన యువతి!

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీలో 350 ఉద్యోగాలు, నెలకు రూ.1.40 లక్షల జీతం

Big Stories

Advertisement
×