E-Paper
Advertisement

వాట్సప్‌లో ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. లేదంటే మొత్తం ఊడ్చేస్తారు!

వాట్సప్‌లో ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే ఆ పని చేయండి.. లేదంటే మొత్తం ఊడ్చేస్తారు!
Advertisement

WhatsApp Safety Tips: మనం నిత్యం వాడే వాట్సప్‌లో కొత్త రకం మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎవరైనా సరే.. బ్యాంకు అధికారులమనో, మనకు బాగా తెలిసిన వాళ్లమనో నమ్మించి వ్యక్తిగత వివరాలు లాగేస్తుంటారు. తొందరపాటులో ఉండి ఒక్క ఓటీపీ చెబితే చాలు.. మన అకౌంట్‌లో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుంది. ఇలాంటి సైబర్ మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వాట్సప్ కొన్ని అద్భుతమైన కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

తెలియని నంబర్ల నుంచి కాల్స్ రాకుండా:

మన ఫోన్‌లో సేవ్ కాని నెంబర్ల నుంచి ఏవైనా కాల్స్ వస్తే అవి నేరుగా రింగ్ కాకుండా ఆటోమేటిక్‌గా సైలెంట్ అయిపోతాయి. దీనివల్ల ఎవరు పడితే వాళ్లు మనకు కాల్ చేసి డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. ఆ కాల్స్ ఏ నెంబర్ నుంచి వచ్చాయో మిస్డ్ కాల్స్ లిస్టులో చూసుకోవచ్చు.

చాట్ చేసే ముందే పూర్తి వివరాలు:

Advertisement

మనకు పరిచయం లేని నంబర్ల నుంచి మెసేజ్‌లు వచ్చినప్పుడు లేదా కొత్త గ్రూపుల్లో యాడ్ చేసినప్పుడు వాట్సప్ మనకు కొన్ని ముందస్తు హెచ్చరికలు ఇస్తుంది. ఆ అకౌంట్ కొత్తదా, వేరే దేశం నుంచి రిజిస్టర్ అయిందా లేదా మనకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అనే వివరాలు చూపిస్తుంది. దీన్ని బట్టి అవతలి వ్యక్తితో మాట్లాడాలా వద్దా అనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు.

Also Read: రూ.15 వేల బడ్జెట్‌లో ఇంత మంచి ఫోన్స్ దొరుకుతాయా? ఈ ఐదు మోడల్స్‌లో ఏది బెస్ట్ అంటే?

స్క్రీన్ షేర్ చేసేటప్పుడు జాగ్రత్త:

Advertisement

వీడియో కాల్ మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మోసగాళ్లు ఏదో ఒక రీజన్ చెప్పి స్క్రీన్ షేర్ చేయమని అడుగుతుంటారు. అలా స్క్రీన్ షేర్ చేస్తే మన ఫోన్ స్క్రీన్ మీద జరిగే ప్రతిదీ వాళ్లకు కనిపిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని బ్యాంక్ పాస్‌వర్డ్‌లు తస్కరిస్తారు. అందుకే వాట్సప్ ఇప్పుడు కొత్తగా స్క్రీన్ షేర్ వార్నింగ్ ఇస్తోంది.

డివైస్ లింకింగ్ అలర్ట్స్:

మనకు తెలియకుండా మన వాట్సప్ అకౌంట్‌ను వేరే వాళ్ల ఫోన్ లేదా కంప్యూటర్‌కు లింక్ చేయడానికి ప్రయత్నిస్తే వాట్సప్ వెంటనే అలర్ట్ ఇస్తుంది. ఎవరైనా అనుమానాస్పదంగా లాగిన్ అవుతుంటే ఆ రిక్వెస్ట్‌ను వెంటనే బ్లాక్ చేసే వీలుంటుంది. అకౌంట్ వేరే వాళ్ల చేతికి వెళ్లకుండా ఇది బాగా కాపాడుతుంది.

టూ-స్టెప్ వెరిఫికేషన్ సెట్టింగ్:

మనం వాట్సప్ నెంబర్‌ను కొత్త ఫోన్‌లో యాక్టివేట్ చేసేటప్పుడు లేదా పిన్ మార్చేటప్పుడు మనకు మాత్రమే తెలిసిన 6 అంకెల సీక్రెట్ నెంబర్‌ను సెట్ చేసుకోవాలి. ఈ టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే.. ఎలాంటి హ్యాకర్లు అయినా సరే మన పర్మిషన్ లేకుండా వాట్సాప్‌ను హ్యాక్ చేయలేరు.

మనీ రిక్వెస్ట్ లింకులను నమ్మొద్దు:

ఎవరో మన ఫ్రెండ్ లేదా రిలేటివ్ అర్జెంట్ అని చెప్పి, రూ.50,000 లేదా రూ.10,000 అత్యవసరంగా గూగుల్ పే లేదా ఫోన్ పే చేయమని అడిగితే వెంటనే నమ్మకండి. అలాంటి మెసేజ్‌లు రాగానే ముందుగా ఆ వ్యక్తికి వేరే నెంబర్‌కు ఫోన్ చేసి నిజంగానే ఆపదలో ఉన్నారా లేదా అని స్వయంగా కనుక్కోవడం చాలా ముఖ్యం.

Also Read: రూ.5 వేల బడ్జెట్‌లో ఇంతకంటే ఏం కావాలి? మార్కెట్‌ను షేక్ చేయనున్న శాంసంగ్ కొత్త వాచ్!

Tags

Related News

విండోస్ 11లో స్క్రీన్‌షాట్ తీయడం ఎలా? ఈ 7 ట్రిక్స్ మీకు తెలుసా?

ఐఫోన్ డ్యూయో స్క్రీన్ క్రాక్ సమస్య.. సర్వీస్ సెంటర్లకు యాపిల్ చేసిన ఆదేశాలివే!

మీ వంటను ఈజీ చేసే..బెస్ట్ 5 స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్‌లు!

ఇల్లు తళతళా మెరవాలంటే..ఈ వాక్యూమ్ క్లీనర్లు ఉండాల్సిందే!

రూ.5 వేల బడ్జెట్‌లో ఇంతకంటే ఏం కావాలి? మార్కెట్‌ను షేక్ చేయనున్న శాంసంగ్ కొత్త వాచ్!

ఆపిల్ టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇండియాలో విడుదల..ధర,ఫీచర్ల పూర్తి వివరాలు!

ఫోన్ నెట్‌వర్క్ పదేపదే మారుతోందా?ఈ సమస్యకు పక్కా పరిష్కారం ఇదిగో!

Big Stories

Advertisement
×