Indian Traveller Bicycle Ride: భారతీయ యువత ట్రావెలింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. యూనిక్ గా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకడు కేరళకు చెందిన సనీద్. ఇప్పటి వరకు చాలా మంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రలు, బైక్ యాత్రలు చేసిన వాళ్లు ఉన్నారు. కానీ, ఈయన డిఫరెంట్ గా ముందు చక్రంలేని సైకిల్ మీద కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణం చేస్తున్నాడు. సుమారు 5 వేల కిలో మీటర్లు ప్రయాణించే ప్రపంచ రికార్డు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడు. దాదాపు ఇప్పుడు ఆయన ఒంటి చక్రం సైకిల్ తో కాశ్మీర్ సరిహద్దులకు చేరకున్నారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రపంచంలోనే డేంజరస్ ఘాట్ రోడ్డులో సాహసయాత్ర
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రహదారులలో ఒకటైన జోజిలా పాస్ లో ఒంటి చక్రం సైకిల్ తో తన యాత్ర కొనసాగించాడు. ఈ రహదారిలో వెళ్లాలంటే చాలా మంది భయంతో వణికిపోతారు. అలాంటిది సనీద్ ఏకంగా ఒంటి చక్రం సైకిల్ తో జోజిలా పాస్ గుండా విజయవంతంగా ప్రయాణం చేశాడు. దాదాపు ఆయన లక్ష్యానికి చేరువ అయ్యాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు అద్భుతంగా రియాక్ట్ అవుతున్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పేందుకు సనీద్ ఒక ఉదాహారణ అని కొనియాడుతున్నారు. త్వరలోనే ఆయన ప్రపంచ రికార్డు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
డేంజరస్ జోజిలా పాస్ గురించి..
జోజిలా పాస్ అనేది సముద్ర మట్టానికి 11,649 అడుగుల ఎత్తులో ఉంటుంది. కశ్మీర్ లోయ, లద్ధాఖ్ ను కలుపుతుంది. 434 కిలో మీటర్ల దూరం ఉండే జోజిలా పాస్ మార్గం భారత్ కు చాలా కీలకమైనది. జోజిలా పాస్ హిమాలయాలలోని ఒక ఎత్తైన పర్వత ప్రాంత రహదారి. జమ్మూ కాశ్మీర్ లోని గండర్బల్ జిల్లా, లద్దాఖ్ లోని కార్గిల్ జిల్లాలను లింక్ చేస్తుంది. ఈ పాస్ కాశ్మీర్ లోయను దాని పశ్చిమాన ఉన్న ద్రాస్, సురు లోయలతో, తూర్పున ఇండస్ లోయతో అనుసంధానిస్తుంది. శ్రీనగర్- లేహ్ మధ్య జాతీయ రహదారి 1 ఈ పాస్ మీదుగానే వెళ్తుంది. జోజిలా పాస్ సాధారణంగా శీతాకాలంలో మూసివేయబడుతుంది. ముందే ప్రమాదకరమైన మార్గం కావడం, మంచు విపరీతంగా కురవడంతో ప్రమాద అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఈ మార్గాన్ని శీతాకాలంలో అధికారులు మూసివేస్తుంటారు. ఈ రహదారి మూసివేత కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కోసం జోజిలా సొరంగ(Zoji-la Tunnel) మార్గాన్ని నిర్మిస్తోంది. ఇది మంచు కారణంగా ప్రయాణ ఇబ్బందులను తొలగించే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ సొరంగం పూర్తయితే, శ్రీనగర్- అద్దాఖ్ మధ్య ప్రయాణ సమయం 3.5 గంటల నుంచి కేవలం 15 నిమిషాలకు తగ్గుతుంది.
Read Also: ఆ రూట్ లో వెళ్లే రైళ్లన్నీ రద్దు.. చెక్ చేసుకోండి లేకపోతే బుక్కైపోతారు!