E-Paper
Advertisement

గ్రామస్థులు నడిపే లాడ్జ్‌.. యాత్రికులు ఎందుకు ఫిదా అవుతున్నారంటే?

గ్రామస్థులు నడిపే లాడ్జ్‌.. యాత్రికులు ఎందుకు ఫిదా అవుతున్నారంటే?
Advertisement

Unique Eco Friendly Wildlife Experience: బిజీ బిజీ లైఫ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి.. కాంక్రీట్ జంగల్ కాస్త దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరాలని చాలా మంది భావిస్తారు. అలాంటి వాళ్లు రిసార్టులలో ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ, విలాసవంతమైన రిసార్టులను కాదని, అడవుల మధ్యలో ఉన్న అందమైన లాడ్జ్ కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఇంతకీ ఆ లాడ్జ్ ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నకన్హా ఎర్త్ లాడ్జ్

మధ్యప్రదేశ్‌లోని కన్హా అడవుల మధ్య ఉన్న కన్హా ఎర్త్ లాడ్జ్ ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణి అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది. భారీ రిసార్ట్‌ లు, విలాసవంతమైన సదుపాయాల కంటే భిన్నంగా, ఈ లాడ్జ్ ప్రకృతితో కలిసి జీవించే అనుభూతిని అందిస్తోంది. అందుకే, చాలా మంది పర్యాటకులు ఈ గ్రామస్థులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ లాడ్జ్‌ ను ఎంచుకుంటున్నారు.

కన్హా ఎర్త్ లాడ్జ్‌ గురించి..

Advertisement

కన్హా ఎర్త్ లాడ్జ్‌ లోకి అడుగుపెట్టగానే ఇది సాధారణ రిసార్ట్ కాదని అర్థమవుతుంది. ఇక్కడ ఆకర్షణీయమైన గేట్లు, భారీ నిర్మాణాలు కనిపించవు. ప్రకృతికి ఎలాంటి నష్టం కలగకుండా, చుట్టూ ఉన్న వాతావరణంతో కలిసిపోయేలా ఈ లాడ్జ్‌ ను నిర్మించారు. గోడల కోసం స్థానిక మట్టి, రాళ్లు ఉపయోగించగా, ఫర్నిచర్ కోసం పాత కలప, రైల్వే స్లీపర్లను ఉపయోగించారు.  ఈ లాడ్జ్ ప్రత్యేకత ఏమిటంటే.. నిర్మాణం నుంచి నిర్వహణ వరకు స్థానిక గ్రామస్థులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సిబ్బందిలో ఎక్కువ మంది సమీప గ్రామాలకు చెందినవారే. కొందరు ఈ లాడ్జ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడే పని చేస్తున్నారు. దీంతో గ్రామ ప్రజలకు ఉపాధి లభించడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి.

వచ్చిన డబ్బుతో సామాజిక సేవలు

లాడ్జ్ మెయింటెనెన్స్ స్థానిక సమాజ అభివృద్ధిపైనా దృష్టి పెట్టింది. సమీప గ్రామాల్లోని పాఠశాలలకు సహాయం చేయడం, యువత కోసం క్రీడా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. దీనివల్ల ఈ లాడ్జ్ కేవలం పర్యాటక కేంద్రంగా కాకుండా గ్రామాభివృద్ధికి కూడా తోడ్పడుతోంది.

ప్రకృతి పరిరక్షణలోనూ కీలక పాత్ర

Advertisement

పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా కన్హా ఎర్త్ లాడ్జ్ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ వ్యర్థాలను ప్రత్యేకంగా వేరు చేసి కంపోస్ట్ తయారు చేస్తారు. ఆ కంపోస్ట్‌ ను కిచెన్ గార్డెన్‌ లో ఉపయోగిస్తారు. అలాగే, మురుగునీటిని శుద్ధి చేసి తోటలకు వినియోగిస్తున్నారు. విద్యుత్ అవసరాల కోసం సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తున్నారు.

అతిథులకు సంప్రదాయ ఆహారం

అటు లాడ్జ్‌ లోని కిచెన్ గార్డెన్ కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, మూలికలు, ఇతర మొక్కలను పెంచుతారు. వంటల్లో ఉపయోగించే అనేక పదార్థాలు నేరుగా ఈ తోట నుంచే వస్తాయి. మిగిలిన అవసరాలను సమీప గ్రామ రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. దీంతో స్థానిక రైతులకు కూడా ఆదాయం లభిస్తోంది. ఇక్కడి ఆహారం కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. స్థానిక గోండ్ తెగ సంప్రదాయ వంటకాలను అతిథులకు అందిస్తారు. దీంతో సందర్శకులు కేవలం ప్రకృతినే కాకుండా ఆ ప్రాంత సంస్కృతిని కూడా అనుభవించే అవకాశం పొందుతున్నారు.

లాడ్జ్‌ లో కనిపించే అలంకరణ వస్తువుల వెనుక కూడా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. పాత వ్యవసాయ పరికరాలు, ఉపయోగం ముగిసిన కలప, గ్రామాల్లో వాడే వస్తువులను కొత్త రూపంలో అలంకరణగా మార్చారు. స్థానిక కళాకారుల చేత రూపొందించిన కళాఖండాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కన్హా ఎర్త్ లాడ్జ్ కేవలం స్టే ఏరియా కాదు. ప్రకృతి, స్థానిక సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ధి అన్నీ కలిసిన ఓ ప్రత్యేక అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. అందుకే విలాసవంతమైన రిసార్ట్‌ ల కంటే భిన్నమైన అనుభూతి కోరుకునే ప్రయాణికులు ఇప్పుడు ఈ లాడ్జ్ వైపు ఆకర్షితులవుతున్నారు.

Read Also: హైదరాబాద్‌కు దగ్గరలోనే అద్భుత జలపాతం.. ప్రకృతి ప్రేమికులకు బెస్ట్ స్పాట్!

Related News

ఒకే స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. భారత్‌ లోని అత్యంత విచిత్రమైన రైల్వే స్టేషన్ ఇదే!

వెయ్యేళ్లుగా శివలింగంపై చెదరని ఛాయ.. ఆశ్చర్యపరుస్తున్న పానగల్లు ఆలయం మిస్టరీ!

భారత్ లో ఎడమ వైపు, అమెరికాలో కుడివైపు.. వాహనాలు నడిపే విధానంలో ఎందుకీ తేడా?

ఆకుపచ్చ నగరంగా మారిన కాంక్రీట్ జంగిల్‌.. ఇది కదా నిజమైన గ్రీన్ రివల్యూషన్ అంటే!

నల్లగొండ జిల్లాలో వజ్రాలు, బంగారు గనులు, వామ్మో.. అన్ని చోట్ల ఉన్నాయా?

విదేశాల్లో యుపిఐ హవా.. ఈ 10 దేశాల్లో భారతీయులు యుపిఐతో పేమెంట్స్ చేయవచ్చు

సిద్దిపేట పేరు వెనుక మూడు ఆసక్తికరమైన కథలు!

శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సంచలనం.. శిలాశాసనం బయటపెట్టిన 500 ఏళ్ల రహస్యం!

Big Stories

Advertisement
×