Indian Railways: మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేసినట్లయితే, కొన్ని కోచ్ లలో స్పెషల్ గా రెడ్ కలర్ విండోలు కనిపిస్తాయి. రైల్వే ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులలో ఈ రెడ్ విండోస్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతకీ ఈ రెడ్ విండోస్ ప్రయోజనాలు ఏంటి? వాటిని ఎందుకు ఏర్పాటు చేశారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రయాణీకుల భద్రత కోసం రెడ్ విండో
రైలు ప్రయాణం చేసే సమయంలో దాదాపు అన్ని బోగీలలో రెడ్ కలర్ లో విండో కనిపిస్తుంది. ఈ ఎరుపు రంగు విండో ప్రయాణీకుల భద్రతలో, ముఖ్యంగా అత్యవసర పరిస్థితులలో కీలక పాత్ర పోషిస్తుంది. రైలు బోగీలలో ఈ కిటికీని ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం రూపొందించారు. రైల్లోని ఇతర కిటికీల మాదిరిగా దీనికి అడ్డుగా ఐరన్ రాడ్లు ఉండవు. ఈ విండో ఓపెన్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటి వాళ్లు లోపలికి, లోపలి వాళ్లు బయటకు ఈజీగా వెళ్లే అవకాశం ఉంటుంది.
ప్రమాదాలు సంభవించిన సమయంలో..
రైల్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు, రైలు పట్టాలు తప్పినప్పుడు లేదంటే మరేదైనా ఎమర్జెన్సీ టైమ్ లో రైలులోని ప్రయాణీకులు తమను తాము రక్షించుకోవడానికి ఈ రెడ్ విండోను ఉపయోగిస్తారు. సాధారణంగా బోగీ మెయిన్ డోర్ కు దగ్గరగా ఉన్న వాళ్లు ఆ డోర్ నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకుంటారు. కోచ్ మధ్యలో ఉన్న వారికి ఈజీగా బయటపడే అవకాశం ఉండదు. అందుకే, రెడ్ విండోను కోచ్ మధ్యలో అందుబాటులో ఉంచారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డోర్లు తెరుచుకోని సందర్భాల్లో రెస్క్యూ టీమ్ ఈ రెడ్ విండోస్ నుంచి బోగీలోకి ప్రవేశించి ప్రయాణీకులను కాపాడేందుకు వీలుంటుంది.
Read Also: మహా కుంభమేళాకు ఉచిత రైలు ప్రయాణం, క్లారిటీ ఇచ్చిన రైల్వేశాఖ!
రెడ్ విండోతో లాభాలు
⦿ ఇనుప చువ్వలు ఉండవు: రెడ్ విండోలు సాధారణ కిటికీల మాదిరిగా ఇనుప రాడ్ లతో ఉండవు. ఇవి ప్రమాద సమయంలో ప్రయాణీకులు సులభంగా బయటపడేలా రూపొందించారు.
⦿ ఈజీ యాక్సెస్: క్లిష్ట పరిస్థితితులలో రెడ్ విండో ఈజీగా యాక్సెస్ చేయడానికి తయారు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రయాణీకులు ఈ విండో ద్వారా తప్పించుకోవచ్చు. రెస్క్యూ బృందాలు కోచ్ లోకి వెళ్లి సాయం చేసే అవకాశం ఉంటుంది.
⦿ వస్తువుల తరలింపు కోసం: రెడ్ విండో ఎమర్జెన్సీ సమయంలో ప్రయాణీకుల ప్రాణాలను కాపాడటంతో పాటు అవసరమైతే వస్తువులను త్వరగా ఎక్కించేందుకు, దింపేందుకు ఉపయోగపడుతాయి.
మొత్తానికి ఈ రెడ్ విండో ఫీచర్ అత్యవసర పరిస్థితులలో ప్రయాణీకులను క్షేమంగా బయటపడేలా కాపాడుతుంది. రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు బోగీలోకి అడుగు పెట్టగానే రెడ్ విండో ఎక్కడుందో తెలుసుకోవడం చాలా మంచిది. ప్రయాణ సమయంలో ఏదైనా ఆపద కలిగితే వెంటనే ఈ విండో ద్వారా బయటపడి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
Read Also: టికెట్ కన్ఫర్మ్ కాకపోతే మూడు రెట్లు డబ్బు వాపస్, Ixigo అదిరిపోయే ఆఫర్!