Yashasvi Jaiswal: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England ) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ లో అదరగొట్టిన ఇంగ్లాండ్ రెండో టెస్ట్ లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ఇప్పటికే రెండో టెస్టులో నాలుగు రోజులు పూర్తయ్యాయి. ఇవాళ చివరి రోజు. మరో 7 వికెట్లు ఇంగ్లాండ్ కోల్పోతే కచ్చితంగా టీమిండియా విజయం సాధిస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో.. టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)… తన మంచి మనసు చాటుకున్నాడు. 12 సంవత్సరాల రవి అనే అంధ కుర్రాడికి… స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఆ కుర్రాడు చాలా సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గొప్ప మనసు చాటుకున్న క్రికెటర్ యశస్వి జైస్వాల్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England ) మధ్య రెండో టెస్ట్ కొనసాగుతోంది. అయితే ఈ రెండో టెస్ట్ నాలుగో రోజు సందర్భంగా యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కళ్ళు కనిపించని 12 సంవత్సరాల రవి అనే కుర్రాడికి అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal Gifts Bat To Fan Ravi). మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా… ఆ 12 సంవత్సరాల రవి అనే కుర్రాడిని.. తాజాగా కలిశాడు యశస్వి జైష్వాల్. ఈ సందర్భంగా ఆ యంగ్ అభిమానితో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన బ్యాట్ ఇవ్వడమే కాకుండా దానిపైన ఆటోగ్రాఫ్ కూడా చేసి బహుకరించాడు యశస్వి జైష్వాల్. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఫోటోలు కూడా దిగారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
యశస్వి జైస్వాల్ అంటే ప్రాణం
టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అంటే తనకు చాలా ఇష్టమని అంతకు ముందు 12 సంవత్సరాల రవి ( Ravi )అనే కుర్రాడు వెల్లడించాడు. క్రికెట్ చూడకపోయినా కూడా ఆ బాలుడికి చాలా ఈ ఆట అంటే ఇష్టం. అందులోనూ యశస్వి జైస్వాల్ అంటే ప్రాణం అంటూ.. మొదటి టెస్ట్ సందర్భంగా వెల్లడించాడు అంధ కుర్రాడు రవి. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…. అతని కోరిక తీర్చాడు. వెంటనే గ్రౌండ్లో రవిని కలిసి సర్ప్రైజ్ చేశాడు యశస్వి జైష్వాల్. ఇక అంతకుముందు… రూట్ కూడా రవికి సైన్ చేసిన టీషర్ట్లు అలాగే గ్లౌజులు… గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది.
అభిమాన క్రికెటర్‌ను కలిసిన అపురూప క్షణం.. అంధ బాలుడి ఆనందం
ఆ బాలుడు క్రికెట్‌ను కళ్లారా చూడలేడు. కానీ ఆ ఆటపై అతడికి అమితమైన మక్కువ. అందులోనూ టీమ్ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ అంటే ఎంతో అభిమానం. 12 ఏళ్ల రవి అనే అంధ బాలుడు.. తన అభిమాన క్రికెటర్‌ను కలిశాడు. ఎంతో సంతోషం వ్యక్తం… pic.twitter.com/Z0mPiusVof
— ChotaNews App (@ChotaNewsApp) July 6, 2025