Maha Kumbh Mela: యూపీలోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలిస్తున్నారు. ప్రయాగరాజ్ పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే కుంభమేళా ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు యూపీకి క్యూ కట్టారు. రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. యూపీ-మధ్యప్రదేశ్ సరిహద్దులలో చెకింగ్స్ కారణంగా వాహనాలు రోడ్ల మీదే గంటల తరబడి నిలిచిపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో.. చాలా మంది భక్తులు రైళ్లలో బయల్దేరుతున్నారు.
బీహార్ లో కుంభమేళా రైలుపై దాడి
అటు విపరీతమైన భక్తుల రద్దీ కారణంగా రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. బీహార్, మధ్య ప్రదేశ్, యూపీలోని రైళ్లలో ఇసుకేస్తే రాలనంద మంది జనాలు ఉంటున్నారు. రైళ్లలో ప్లేస్ లేకపోవడంతో చాలా మంది ఎక్కలేకపోతున్నారు. కోపంతో రైళ్లపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికే యూపీ, మధ్యప్రదేశ్ లోని పలు చోట్ల రైళ్లపై దాడులు జరిగాయి. తాజాగా బీహార్ లోని సమస్తిపూర్ రైల్వే డివిజన్ పరిధిలోనూ రైలు మీద భక్తులు దాడి చేశారు. స్వతంత్ర సేనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులోని ఏసీ బోగీల అద్దాలు పగుల గొట్టారు. రాళ్లు, కర్రలు, కాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలు అయ్యాయి. స్వతంత్ర సేనానికి సూపర్ ఫాస్ట్ రైలులోని జనరల్ బోగి నుంచి ఏసీ బోగి వరకూ అన్ని నిండిపోయాయి. కనీసం కాలు పెట్టేందుకు కూడా జాగా లేదు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందలు పడ్డారు. బయటి ప్రయాణీకులు లోపలికి రాకుండా డోర్లు క్లోజ్ చేశారు. మధుబని స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులు కోపంతో ఊగిపోయారు. రైలు ఏసీ కోచ్ ల అద్దాలు పగులగొట్టి గిల అద్దాలు పగలుగొట్టి కిటీకిల గుండా రైల్లోకి ఎక్కారు.. ఈ ఘటనతో రైల్లోని ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. చివరకు ఈ రైలు అరగంట ఆలస్యంగా బయల్దేరింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
దేశ నలుమూలల నుంచి కుంభమేళాకు వస్తున్న భక్తులు, సమీపంలోనే ఉన్న వారణాసి, అయోధ్యకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రెండు దేవాలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కాశీలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆకంక్షలు విధించారు. పెద్ద మొత్తంలో రోడ్ల మీద వాహనాలు ఆగిపోతున్న నేపథ్యంలో భక్తులు వీలైనంత వరకు రైలు మార్గం ద్వారా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
కుంభమేళాలో పుణ్య స్నానాలు చేసిన 45 కోట్ల మంది
గత నెల 13న సంక్రాంతి సందర్భంగా మొదలైన కుంభమేళా, ఈ నెల 26న మహా శివరాత్రితో ముగియనుంది. ప్రయాగరాజ్ లో ఇప్పటి వరకు సుమారు 45 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ సర్కారు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 26 నాటికి ఈ సంఖ్య 50 కోట్ల నుంచి 55 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
Read Also: రైల్ ఇంజిన్‌లోనూ కిక్కిరిసిన ప్రయాణీకులు.. మరి ఆ రైలు ఎవరు నడుపుతారు రా బాబు!