Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేంజ్ వేరు సినీ ఇండస్ట్రీలో ఆయన స్టార్ హీరోగా కొనసాగడమే కాదు ప్రస్తుతం రాజకీయాల్లో కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన రాజకీయ కార్యకలాపాల్లో పవన్ కళ్యాణ్ చురుగ్గా పాల్గొంటూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ సినిమాల విషయంలో మాత్రం పవన్ మౌనం వహిస్తున్నాడు. గతంలో అనౌన్స్ చేసిన సినిమాలను పూర్తి చెయ్యడానికి ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది. కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఓజీ మూవీ మాత్రం ఆగిపోయింది. ఈ విషయం పై అనేక సార్లు పవన్ కళ్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అది చూసిన ఫ్యాన్స్ సుజిత్ పరువు తీస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Also Read : ఏంటి.. సంయుక్త మీనన్ కు ఆ పాడు అలవాటు ఉందా..?
డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ గతంలో మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు.. అందులో హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలకు కొంత షూటింగ్ పెండింగ్ ఉంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి నాలుగు రోజులు, అదే విధంగా ‘ఓజీ’ మూవీకి 23 రోజులు. ఇవి పూర్తి చేయడానికి ఆయన నిర్మాతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. 15 రోజుల క్రితం అయితే ఆయన ప్రభుత్వ కార్యకలాపాలలో ఫుల్ బిజీ గా ఉన్నాడు. అందుకే షూటింగ్ కు గ్యాప్ ఇచ్చాడు. అటు పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు దాంతో ఎన్నో కార్యకలాపాల ఫైల్స్ కూడా చూడలేదని తెలుస్తుంది.. అంతేకాదు సీఎం ఏర్పాటు చేసిన మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు అయితే ఈ విషయాన్ని సీఎం అడగ్గా విషయం పై క్లారిటీ ఇచ్చారు నాదెండ్ల మనోహర్. ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని, విశ్రాంతి తీసుకుంటున్నాడని, రెండు మూడు రోజుల్లో మళ్ళీ విధుల్లోకి వస్తాడని చెప్పుకొచ్చాడు.
ఆ విషయం పక్కన పెడితే రెండు రోజుల క్రితమే కోల్కున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆలయాల సందర్శన కోసం నాలుగు రోజుల కేటాయించారు.. నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో పవిత్ర దేవాలయాలను సందర్శించడానికి పయనమయ్యాడు.. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకుండా అటు దేవాలయాలకు మాత్రమే సందర్శిస్తూ పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు దీనిపై జనసేన నాయకులు కూడా టెన్షన్ పడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారో తెలియట్లేదు అని భావిస్తున్నారు. ఈ విషయంపై తాజాగా ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ స్పందించారు. తీవ్రమైన అసహనం తో ఉన్నాడట. తీర్థయాత్రలకు సమయాన్ని కేటాయిస్తాడు కానీ, సినిమాకి మాత్రం డేట్స్ ఇవ్వడు, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ తో సినిమా చేసే అవకాశం వచ్చినా, కళ్యాణ్ గారి కోసం ఇంత కాలం ఎదురు చూస్తున్న విషయాన్ని ఆయన అసలు గుర్తించడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలా వీర మల్లు నిర్మాత పరిస్థితి కూడా అలానే ఉంది. పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో డబ్బులను నీళ్ళలాగా ఖర్చు చేశారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాని పూర్తి చేస్తారా లేదా అని అయోమయంలో ఉన్నాడు. ఏది ఏమైన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తే బాగుండు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి..