BigTV English

Kohli-Pietersen: పీటర్సన్ కొడుక్కి విరాట్ కోహ్లీ అదిరిపోయే గిఫ్ట్ !

Kohli-Pietersen: పీటర్సన్ కొడుక్కి విరాట్ కోహ్లీ అదిరిపోయే గిఫ్ట్ !

Kohli-Pietersen: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో అత్యంత స్టైలిష్ బ్యాట్స్మెన్ లలో కెవిన్ పీటర్సన్ ఒకరు. దక్షిణాఫ్రికాలో జన్మించిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్ తరపున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టి-20 ఆడాడు. టెస్టుల్లో 8,181 పరుగులు, వన్డేలో 4,440 పరుగులు, టి-20 లో 1,176 పరుగులు చేశాడు. అలాగే ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. కెవిన్ పీటర్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.


Also Read: WPL 2025: నేటి నుంచి మెగా టోర్నీ ప్రారంభం..టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?

అతను చివరిసారిగా 2014 జనవరిలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ఈ ఇంగ్లాండ్ మాజీ స్టార్ పీటర్సన్ కి మంచి అనుబంధం ఉంది. ఇతడు చాలాసార్లు విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించడం మీరు వినే ఉంటారు. చాలాసార్లు విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు పీటర్సన్.


ఇతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సంవత్సరాలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 2009 – 10 సంవత్సరాలలో ఆడినప్పుడు విరాట్ కోహ్లీ – పీటర్సన్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఐపీఎల్ లో పీటర్సన్ 13 మ్యాచ్ లలో 32.90 సగటుతో, 135.95 స్ట్రైక్ రేట్ తో 329 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ సిరీస్ లోని మొదటి వన్డేకి మోకాలి గాయం కారణంగా దూరంగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఆ మొదటి వన్డే జరుగుతున్న సమయంలో కెవిన్ పీటర్సన్ తో కలిసి కాసేపు ముచ్చటించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పీటర్సన్ ని కాసేపు ఆట పట్టిస్తూ నవ్వులు పూజించాడు విరాట్ కోహ్లీ. అయితే తాజాగా మరోసారి విరాట్ కోహ్లీతో తనకి ఉన్న స్నేహ బంధాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు పీటర్సన్.

విరాట్ కోహ్లీ పీటర్సన్ కుమారుడు డిలాన్ స్టార్ కి తన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఉన్నాయి ఇండియన్ జెర్సీని అందుకున్నాడు పీటర్సన్ కుమారుడు డిలాన్. అనంతరం తన కొడుకు విరాట్ కోహ్లీ జెర్సీని ధరించిన ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీనిపై విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ తో పాటు.. ” టు డిలాన్, విత్ బెస్ట్ విషెస్” అని రాసి ఉంది. ఈ పోస్ట్ కి ధన్యవాదాలు మిత్రమా..! అని క్యాప్షన్ ఇచ్చాడు పీటర్సన్.

Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది..ఈ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్..హైదరాబాద్ లోనే ?

ఇక కెవిన్ పీటర్సన్ షేర్ చేసిన ఈ ఫోటోని చూసిన నెటిజెన్లు.. మీ ఇద్దరి మధ్య స్నేహబంధం ఇలాగే కొనసాగాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు.. ఇంగ్లాండ్ తో జరిగిన 3 వన్డేల సిరీస్ లో భాగంగా మూడవ వన్డేలో విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత తిరిగి ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగుల వరద పారించాలని కోరుకుంటున్నారు క్రీడాభిమానులు.

Related News

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

Big Stories

×