E-Paper
Advertisement

Flight Tickets: భలే ఆఫర్, జస్ట్ రూ.3 వేలకే ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్, బుకింగ్స్ మొదలు!

Flight Tickets: భలే ఆఫర్, జస్ట్ రూ.3 వేలకే ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్, బుకింగ్స్ మొదలు!
Advertisement

Malaysia Airlines Tickets: విమానయాన సంస్థలు ప్రయాణీకులకు తరచుగా చౌక టికెట్లను అందిస్తుంటాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రయాణీకులను టార్గెట్ చేసుకుని ఈ ఆఫర్లు అందిస్తుంటాయి. అందులో భాగంగానే తాజాగా మలేషియా ఎయిర్‌ లైన్స్ అదిరిపోయే తగ్గింపును అందిస్తోంది. తక్కువ ధరలో జాతీయ, అంతర్జాతీయ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  వెకేషన్ కోసం, బిజినెస్ మీటింగ్స్ కోసం వెళ్లే వారికి ఈ ఆఫర్ చక్కగా ఉపయోగపడనుంది.

టైమ్ ఫర్ న్యూ చాప్టర్స్ పేరుతో ఆఫర్!

టైమ్ ఫర్ న్యూ చాప్టర్స్ అనే పేరుతో జనవరి 7 నుంచి 20 వరకు జాతీయ, అంతర్జాతీయ టికెట్లపై తగ్గింపు అందిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 30, 2026 వరకు ప్రయాణాల కోసం ఈ బుకింగ్స్ ఓపెన్ ఉంటాయని తెలిపింది. రిటర్న్ ఛార్జీలు కేవలం 159 రింగిట్ అంటే, భారత్ కరెన్సీలో సుమారు రూ.3,500 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎయిర్‌ లైన్స్ ఎన్‌రిచ్ లాయల్టీ ప్రోగ్రామ్ మెంబర్స్ జనవరి 6, 2026 నుంచి ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. అదనంగా 5 శాతం వరకు డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. మెంబర్ షిప్ లేని వాళ్లు జనవరి 7 నుంచి 20 వరకు టికెట్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Advertisement

ఈ ప్రమోషన్ మలేషియా ఎయిర్‌ లైన్స్ అంతర్జాతీయ, ప్రాంతీయ నెట్‌వర్క్‌ లోని డెస్టినేషన్స్ ను కవర్ చేస్తుంది. సుదూర మార్గాల్లో లండన్, సియోల్, షాంఘై లాంటి నగరాలు ఉన్నాయి. ప్రాంతీయ గమ్యస్థానాలలో సెబు, సీమ్ రీప్, క్రాబీ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతీయ సర్వీసులు కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ వన్ నుంచి సిస్టర్   విమానయాన సంస్థ ఫైర్‌ ఫ్లై ద్వారా నిర్వహించనుంది.

అదనంగా బోనస్ సైడ్ ట్రిప్ ప్రోగ్రామ్‌

అటు ప్రయాణికులు ఎయిర్‌ లైన్  బోనస్ సైడ్ ట్రిప్ ప్రోగ్రామ్‌ను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది కౌలాలంపూర్ మీదుగా ప్రయాణించేటప్పుడు మలేషియాలో ఉచిత స్టాప్‌ ఓవర్‌ను పొందే అవకాశం కల్పిస్తుంది. విజిట్ మలేషియా 2026 కోసం సన్నాహాల్లో భాగంగా పలు డెస్టినేషన్స్ కు విమానాలు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మలేషియన్ ఎయిర్ లైన్స్.

Advertisement

Read Also:  లోకల్ ప్రయాణికులకు షాక్.. UTS యాప్ బంద్, ఇక ఆ కొత్త యాప్‌లోనే అన్నీ!

మలేషియా ఎయిర్‌ లైన్స్ తన ఎయిర్‌బస్ A330neo విమానాలను టోక్యో, బాలి, మెల్‌బోర్న్, సిడ్నీ, ఆక్లాండ్‌తో సహా పలు ప్రాంతాలకు పరిచయం చేస్తుంది. ఈ విమానాల్లో కొత్త క్యాబిన్ ఇంటీరియర్స్, కొత్త సీటింగ్, పెద్ద ఇన్ ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు ఉన్నాయి. MHconnect సర్వీస్ ద్వారా ఎంపిక చేసిన విమానాలలోని అన్ని క్యాబిన్ క్లాస్ లలో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విమానయాన సంస్థ అధికారులు ప్రకటించారు.

Read Also:  ఇండిగో వివాదం.. ఇంతకీ దాని యజమాని ఎవరు? ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×