South Central Railway: సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులు కీలక అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆయా రైళ్లను వేర్వేరు రోజుల్లో క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాజీపేట- డోర్నకల్, డోర్నకల్- విజయవాడ, భద్రాచలం రోడ్డు- విజయవాడ ప్యాసింజర్ రైళ్లను 11 రోజుల పాటు క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపింది. అంటే, ఈ రైళ్లు ఈ నెల 10 నుంచి 20 వరకు ఈ మార్గంలోని నడిచే సదరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అటు గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు వారం నుంచి 11 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని ప్రకటించింది. మరో 9 రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. నాలుగు రైళ్లు సుమారు 60 నుంచి 90 నిమిషాల ఆలస్యంగా బయల్దేరనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
క్యాన్సిల్ అయిన రైళ్లు, వాటి వివరాలు
⦿ సికింద్రాబాద్- గుంటూరు (17201/17202) గోల్కొండ ఎక్స్ ప్రెస్: ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు క్యాన్సిల్.
⦿ సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్: ఫిబ్రవరి 10 నుంచి 21 వరకు రద్దు.
⦿ గుంటూరు-సికింద్రాబాద్ (12705/12706) ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్ : 10, 11, 15, 18, 19, 20 తేదీల్లో క్యాన్సిల్.
⦿ విజయవాడ-సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్ ప్రెస్,: 11, 14, 16, 18, 19, 20 లేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఆలస్యంగా నడిచే రైళ్లు
⦿ సికింద్రాబాద్- విశాఖపట్నం (20834) వందేభారత్ ఎక్స్ ప్రెస్: 19, 20 తేదీల్లో 75 నిమిషాలు లేటుగా నడవనుంది.
⦿ ఆదిలాబాద్-తిరుపతి (17406) కృష్ణా ఎక్స్ ప్రెస్: 9, 11, 14, 18, 19 తేదీల్లో 90 నిమిషాల పాటు ఆలస్యంగా నడవనుంది.
విజయవాడ డివిజన్ లో 6 రైళ్లు రద్దు
అటు విజయవాడ డివిజన్ పరిధిలోని నూజివీడు- వట్లూరు- ఏలూరు మధ్య ఆటోమేటిక్ సెక్షన్ ప్రారంభించేందుకు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల కారణంగా ఈ నెల 8న 6 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీటితో పాటు 7, 8 తేదీల్లో 13 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: శీతాకాలంలో ఛల్ చయ్య చయ్య చయ్యా.. ఈ ట్రైన్ జర్నీ చేస్తే ఉంటుందయ్యా!
ఈ నెల 8న క్యానిల్స్ అయిన రైళ్లు ఇవే!
⦿ రాజమహేంద్రవరం – విజయవాడ(67261 నెంబర్)రైలు
⦿ విజయవాడ – రాజమహేంద్రవరం(67262 నెంబర్)రైలు
⦿ విజయవాడ – రాజమహేంద్రవరం(67202 నెంబర్) రైలు
⦿ రాజమహేంద్రవరం – విజయవాడ(67201 నెంబర్) రైలు
⦿ కాకినాడ పోర్టు – విజయవాడ(17258 నెంబర్) రైలు
⦿ విజయవాడ – కాకినాడ పోర్టు(17257 నెంబర్) రైలు
Read Also: కౌంటర్ టికెట్ ఛార్జీతో పోల్చితే, ఆన్ లైన్ లో కాస్ట్ ఎక్కువ? ఇదీ అసలు కథ!
ఈ రైళ్లతో పాటు 7, 8 13 తేదీల్లో ఈ రూట్లో నడిచే పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ప్రయాణీలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ కీలక ప్రకటన విడుదల చేశారు.
Read Also: 200 వందే భారత్ రైళ్లు, 17,500 జనరల్ కోచ్లు.. ఇండియన్ రైల్వే టార్గెట్ మామూలుగా లేదుగా!