E-Paper
Advertisement

వందే భారత్ స్లీపర్‌ లో ఫస్ట్ ఏసీ కోచ్.. దీని ముందు ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ కూడా దిగదుడుపే!

వందే భారత్ స్లీపర్‌ లో ఫస్ట్ ఏసీ కోచ్.. దీని ముందు ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ కూడా దిగదుడుపే!
Advertisement

India’s Most Premium Train Coach: భారతీయ రైల్వే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే తీసుకొచ్చిన వందే భారత్ స్లీపర్ రైలు ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక కొత్తగా ఈ రైలులోని ఫస్ట్ ఏసీ కోచ్‌ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని ఇంటీరియర్స్ చూసిన నెటిజన్లు ఇది రైలు కోచా? లేక ఫైవ్ స్టార్ హోటలా? అని కామెంట్స్ చేస్తున్నారు.

స్పెషల్ క్యాబిన్స్, అద్భుతమైన సౌకర్యాలు

ఇప్పటి వరకు సుదూర రైలు ప్రయాణం అంటే ఇరుకైన బెర్త్‌ లు, సాధారణ సదుపాయాలు,  అపరిశుభ్రత లాంటి సమస్యలు గుర్తుకు వచ్చేవి. కానీ, కొత్త వందే భారత్ స్లీపర్‌లో మాత్రం పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందించేందుకు భారతీయ రైల్వేలు ప్రత్యేకంగా రూపొందించింది. ఈ కోచ్‌ లో ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్రైవేట్ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. లోపలి భాగాన్ని ఆధునిక డిజైన్‌ తో తీర్చిదిద్దారు. మెరుగైన లైటింగ్, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్, ప్రీమియం ఫినిషింగ్, విశాలమైన స్థలం ప్రయాణికులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రయాణంలో ఎక్కువ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని రూపొందించారు. భారతీయ జనతా పార్టీ యూట్యూబ్ ఛానెల్‌ లో ఈ కోచ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ప్రయాణికులు ఈ కోచ్‌ను చూసి భారతీయ రైల్వే కొత్త యుగానికి నాంది పలికిందంటూ అభిప్రాయపడుతున్నారు.

సుదూర ప్రయాణాలకు అనుగుణంగా స్లీపర్ రైళ్లు

Advertisement

ప్రస్తుతం దేశంలో నడుస్తున్న వందే భారత్ రైళ్లు ఎక్కువగా చైర్ కార్ సర్వీసులు అందిస్తున్నాయి. అవి చిన్న దూర ప్రయాణాల కోసం రూపొందించబడ్డాయి. అయితే, కొత్త స్లీపర్ వెర్షన్‌ను సుదూర ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులకు ఇది మరింత సౌకర్యాన్ని అందించనుంది.

త్వరలో అందుబాటులోకి ముంబై-బెంగళూరు వందేభారత్ స్లీపర్

Advertisement

ఇక త్వరలో ముంబై-బెంగళూరు మార్గంలో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి ట్రావెల్ టైమ్ గణనీయంగా తగ్గనుంది. వ్యాపార అవసరాలు, ఉద్యోగాలు, పర్యాటక ప్రయాణాల కారణంగా ఈ మార్గంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వారికి వేగవంతమైన, సౌకర్యవంతమైన సర్వీసు అందించడమే లక్ష్యంగా ఈ రైలును తీసుకొస్తున్నారు. కొత్త వందే భారత్ స్లీపర్‌ లో ఫస్ట్ ఏసీ కోచ్‌ తో పాటు మరిన్ని ఆధునిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. మెరుగైన టాయిలెట్లు, డిజిటల్ సమాచార వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు, భద్రతా ఫీచర్లు వంటి అనేక సౌకర్యాలను ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైలు సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.

Read Also: వారెవ్వా వందే భారత్.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయాణం అంటూ విదేశీ యువతుల ప్రశంసలు!

 

Related News

ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులు.. పైకప్పులో పగుళ్లు, పలువురికి గాయాలు, అసలేం జరిగింది?

హోటల్లో ప్రేమికులు ఉండొచ్చా? పోలీసులకు అడ్డుకునే హక్కు లేదా? చట్టం ఏం చెబుతోంది!

ఆ రాష్ట్రానికి నో హై స్పీడ్ రైల్.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

ఐఆర్‌సిటీసీ క్యాటరింగ్‌ కు షాక్.. ఏకంగా రూ.5.13 కోట్ల ఫైన్!

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

Big Stories

Advertisement
×