E-Paper

శ్రీశాంత్ కూతురు న‌న్ను ప‌చ్చిబూతులు తిట్టింది..హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌నం !

శ్రీశాంత్ కూతురు న‌న్ను ప‌చ్చిబూతులు తిట్టింది..హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌నం !
Advertisement

Harbhajan Singh : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008 (Indian Premier League 2008) సంవత్సరంలో హర్భజన్ సింగ్ (Harbhajan Singh), శ్రీశాంత్ ( S Sreesanth) మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య 2008 ఏప్రిల్ 25వ తారీఖున మ్యాచ్ జరగగా.. శ్రీశాంత్ చెంపపైన హర్భజన్ సింగ్ కొడతాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగి దాదాపు 18 సంవత్సరాలు కావస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ ఇదే సంఘటనపై నిన్న శ్రీశాంత్ స్పందించగా.. హర్భజన్ సింగ్ కూడా ఆ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

కావాలంటే రిగ్గులోకి రా.. కొట్టుకుందాం – శ్రీశాంత్

Advertisement

2008 ఐపీఎల్ (Indian Premier League 2008)  సందర్భంగా హర్భజన్ సింగ్ (Harbhajan Singh) తనను కొట్టాడని.. ఇప్పుడు తనను కొట్టేంత శక్తి హర్భజన్ దగ్గర లేదంటూ శ్రీశాంత్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. కొట్టుకుందామంటే ఇప్పుడు రింగులోకి రావాలని, ఛాలెంజ్ విసిరారు. అయితే శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా హర్భజన్ సింగ్ (Harbhajan Singh) భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. S శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టిన తర్వాత.. తానే ఎక్కువ బాధపడ్డానని వెల్లడించారు. వెంటనే శ్రీశాంత్ ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి క్షమాపణలు అడిగానని వివరించారు. అనంతరం శ్రీశాంత్ ను హగ్ చేసుకుని ఓదార్చానని వెల్లడించారు. నీ తప్పేం లేదు… నేనే కంగారులో చెంప దెబ్బ కొట్టానని శ్రీశాంత్ కు వివరించినట్లు షాపింగ్ నిజాలను పంచుకున్నారు హర్భజన్ సింగ్. దీంతో వివాదం అక్కడితో సద్దు మణిగిందని అనుకున్నాను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ మీడియా మాత్రం ఈ వివాదాన్ని హైలెట్ చేసిందని మండిపడ్డారు. ఇద్దరు మధ్య పెద్ద గొడవ జరిగినట్లు వార్తలు క్రియేట్ చేసి రచ్చ రచ్చ చేసినట్లు మండిపడ్డారు.

శ్రీశాంత్ కూతురు న‌న్ను ప‌చ్చిబూతులు తిట్టింది..హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌నం !

కొన్ని రోజుల తర్వాత S శ్రీశాంత్, ఆయన కుటుంబ సభ్యులను తాను కలిశానని హర్భజన్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీశాంత్ కూతురు తనను గట్టిగా నిలదీసిందని వెల్లడించారు. నేను నీతో అసలు మాట్లాడబోను… మా నాన్నను నువ్వు కొట్టావు.. నిన్ను క్షమించేది లేదు అంటూ ఆ చిన్నారి తనపై విరుచుకు పడిందని హర్భజన్ (Harbhajan Singh) వెల్లడించారు. ఈ దెబ్బకు తనకు కన్నీళ్లు వచ్చినట్లు షాకింగ్ నిజాలను పంచుకున్నారు హర్భజన్ సింగ్. ఆ క్షణంలో శ్రీశాంత్ కూతురుకు తాను క్షమాపణలు చెప్పానని వివరించారు. దీంతో హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

 

Related News

రేపే ట్రై సిరీస్ ఫైన‌ల్స్‌..వైభ‌వ్ దెబ్బ‌కు లంక ప్లేయ‌ర్ల ప్యాంట్లు త‌డ‌వ‌డం గ్యారెంటీ

బాబ‌ర్ ఆజంకు CA కంపెనీ కోట్ల‌ల్లో ఆఫ‌ర్..ఆసియాలోనే తొలి ప్లేయ‌ర్ గా రికార్డ్ !

Aqib Javed: మంత్ర దండం వేసి, పాకిస్తాన్ క్రికెట్ ను రాత్రి రాత్రే బాగు చేయ‌లేం

Kris Srikkanth: పాక్ ప్లేయ‌ర్లు క్రికెట్ మానేసి, ఇంట్లో మూల‌కు కూర్చోవ‌డం బెస్ట్

అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

గిల్లితే గిల్లించుకోవాలి కానీ, అరవకూడదు…వైభ‌వ్ కు వసీం జాఫర్ వార్నింగ్

ఇషాన్‌ కిషన్‌కు వీసా వ‌చ్చేసింది…వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత‌డు త‌ప్పుకోవాల్సిందే !

Big Stories

×