E-Paper
Advertisement

Water Metro: ముంబైలో వాటర్ మెట్రో.. వామ్మో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?

Water Metro: ముంబైలో వాటర్ మెట్రో.. వామ్మో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?
Advertisement

Mumbai Water Metro: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొత్త రవాణా వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. నిత్యం ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ముంబై వాసులకు వాటర్ మెట్రో ఉపశమనం కలిగించబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి దశలవారీగా బ్యాటరీతో నడిచే వాటర్ మెట్రోను ముంబైలో ప్రారంభించనున్నట్లు ఓడరేవుల మంత్రి నితేష్ రాణే వెల్లడించారు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతానికి సంబంధించిన డీపీఆర్ ఫిబ్రవరి 28 నాటికి సమర్పించబడుతుందన్నారు. రూ. 1,200 కోట్ల ప్రాజెక్టు ఆరు నుంచి ఎనిమిది మార్గాలను ప్లాన్ చేస్తుంది మహా సర్కారు. సాధ్యాసాధ్యాల చర్చల తర్వాత మొదట రెండు మార్గాలను అమలు చేయాలని ఆలోచిస్తుంది. ముంబై, దాని పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి బ్యాటరీతో నడిచే ఫెర్రీలను ఈ వాటర్ మెట్రోలకి తీసుకురానున్నారు.

ముంబై వాటర్ మెట్రో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే?    

డిసెంబర్ నుంచి దశలవారీగా వాటర్ మెట్రో ప్రారంభమవుతుందని ఓడరేవుల మంత్రి నితేష్ రాణే వెల్లడించారు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఆరు నుంచి ఎనిమిది మార్గాలను విద్యుత్తుతో నడిచే ఫెర్రీల నెట్‌ వర్క్ ద్వారా అనుసంధానించడానికి  మహా ప్రబుత్వం ప్రణాళిలకు వేసింది. ఈ ప్రాజెక్టు ఖర్చు రూ. 1,200 కోట్లు ఉంటుందని మంత్రి రాణే తెలిపారు. డీపీఆర్ సమర్పించిన తర్వాత, మార్గాల సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తో చర్చలు జరుగుతాయన్నారు. “ముంబై నగరంలో ముందుగా వాటర్ మెట్రో సేవలను ప్రారంభించి.. ఆ తర్వాత ముంబై పరిసర ప్రాంతాలకు విస్తరించబోతున్నాం” అని రాణే ప్రకటించారు.

ముంబై ట్రాఫిక్ కష్టాలకు చెక్!   

Advertisement

ముంబై నగరంలోని వాటర్ మెట్రో సేవలు నారిమన్ పాయింట్-వర్లి-బాంద్రా-జుహు-వెర్సోవా మార్గాల్లో అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో రెండు మార్గాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ ముంబైలోని గేట్‌ వే ఆఫ్ ఇండియా సమీపంలోని రేడియో క్లబ్ జెట్టీ రెడీ తర్వాత, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజలను తీసుకెళ్లడానికి వాటర్ మెట్రో కేవలం 40 నిమిషాలు పడుతుంది” మంత్రి రాణే వెల్లడించారు.

Read Also:  ఈ దేశాల్లో విదేశీయులకు ఫ్రీగా ప్లాట్లు, భూములే కాదు, డబ్బులు కూడా ఇస్తారు!

ఇప్పటికే కేరళలో వాటర్ మెట్రో ప్రారంభం

Advertisement

ఇప్పటికే కేరళలోని కొచ్చిలోవాటర్ మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. పలు మార్గాల్లో ప్రజలకు చక్కటి సర్వీసులు అందిస్తున్నాయి. ఇదే తరహాలో ముంబైలోనూ మొదలుకానున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మార్చి 6న సమర్పించనున్న మహారాష్ట్ర బడ్జెట్‌లో ఫడ్నవీస్ అధికారిక ప్రకటన చేస్తారని మంత్రి రాణే చెప్పారు. గత సంవత్సరం, ముంబై ప్రతిపాదిత వాటర్ మెట్రో డీపీఆర్ ను సిద్ధం చేసే ఒప్పందాన్ని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ పొందింది. KMRL ఇప్పటికే 11 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలోని 18 నగరాల్లో ఇన్‌ ల్యాండ్ వాటర్‌ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) ఆదేశాల మేరకు జల రవాణా అధ్యయనాలను నిర్వహిస్తోంది.

Read Also:  ఈ దేశాల్లో విదేశీయులకు ఫ్రీగా ప్లాట్లు, భూములే కాదు, డబ్బులు కూడా ఇస్తారు!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×