E-Paper
Advertisement

దేశంలోనే అత్యంత అందమైన రోడ్ ట్రిప్.. బీచ్‌లు, జలపాతాలు, పురాతన కోటల మధ్య అద్భుత ప్రయాణం!

దేశంలోనే అత్యంత అందమైన రోడ్ ట్రిప్.. బీచ్‌లు, జలపాతాలు, పురాతన కోటల మధ్య అద్భుత ప్రయాణం!
Advertisement

India’s Most Beautiful Road Trip: రోడ్ ట్రిప్ అంటే చాలామందికి గుర్తొచ్చేవి కొండలు, అడవులు, అందమైన రహదారులు. కానీ, సముద్ర తీరాలు, జలపాతాలు, పచ్చని ప్రకృతి, పురాతన ఆలయాలు, చారిత్రక కోటలు ఒకే ప్రయాణంలో చూడాలంటే మహారాష్ట్రలోని కొంకణ్ తీరం మంచి ఆప్షన్. ముంబై నుంచి గోవా వైపుగా సాగే ఈ ప్రయాణంలో గణపతిపులే, సింధుదుర్గ్ లాంటి అందమైన ప్రాంతాలను సందర్శించవచ్చు.

ముంబై నుంచి మొదలయ్యే అందమైన ప్రయాణం

ముంబై నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రయాణం ప్రారంభించి, అటల్ సేతు మీదుగా NH 66కు చేరుకోవచ్చు. సముద్రం మధ్య నుంచి సాగే అటల్ సేతుపై ప్రయాణం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. దాదాపు ఏడు గంటల ప్రయాణంలో నాగోథానేలోని కామత్ వద్ద ఆగి పోహా, సగ్గుబియ్యం వడ, మిసల్ పావ్ లాంటి మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలను రుచి చూడవచ్చు.

ఫస్ట్ స్టెప్.. గణపతిపులే..

Advertisement

రత్నగిరి జిల్లాలో ఉన్న గణపతిపులే అందమైన బీచ్‌లు, ప్రసిద్ధ గణపతి ఆలయానికి గుర్తింపు పొందింది. అయితే, ఇక్కడ చూడాల్సిన మరో ప్రత్యేక ఆకర్షణ చరిత్రపూర్వపు శిలా చిత్రాలు. లాటరైట్ రాళ్లపై చెక్కిన ఈ చిత్రాల్లో పురాతన జంతువులు, మనుషుల రూపాలు, వివిధ ఆకృతులు కనిపిస్తాయి.

ఇక ఆరే-వారే తీర రహదారి ప్రయాణాన్ని అస్సలు మిస్ కావద్దు. ఒకవైపు సముద్రం, మరోవైపు పచ్చని ప్రకృతి మధ్య సాగే ఈ రహదారిపై సూర్యాస్తమయాన్ని చూడటం మధురమైన అనుభూతిని ఇస్తుంది. మాల్‌గుండ్ సమీపంలోని సహజ నీటి కొలనులు, ఫాన్సవ్లే గ్రామంలోని పచ్చని వరి పొలాలు, పురాతన ఆలయాలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

రెండో స్టెప్.. సింధుదుర్గ్..

Advertisement

గణపతిపులే నుంచి సింధుదుర్గ్ చేరుకోవడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. ఇక్కడ సముద్రానికి ఎదురుగా ఉండే విల్లాలు, కొబ్బరి చెట్లతో నిండిన పరిసరాలు పర్యాటకులకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.

సింధుదుర్గ్‌ లో గణేష్ విగ్రహాల తయారీ విధానాన్ని దగ్గరగా చూసే అవకాశం కూడా ఉంటుంది. కొండల మధ్య నుంచి జాలువారే జలపాతాలు మరో ప్రత్యేక ఆకర్షణ. ట్రెక్కింగ్ ఇష్టపడేవారు నివాతి కోటకు వెళ్లొచ్చు. అలాగే 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన సింధుదుర్గ్ సముద్ర కోట ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

నోరూరించే మాల్వానీ వంటకాలు

కొంకణ్ ప్రయాణంలో స్థానిక వంటకాలను రుచి చూడటం అస్సలు మర్చిపోవద్దు. మాల్వానీ చేపల కూర, వేయించిన బొంబాయి బాతు చేప, ఘవానే, సోల్కధి లాంటి స్పెషల్ డిషెస్ ఫుడ్ లవర్స్ ను ఎంతో ఆకట్టుకుంటాయి.

రోడ్ ట్రిప్‌కు వెళ్లేవారు ఏం చేయాలంటే?

ప్రయాణానికి అవసరమైన క్యాష్ దగ్గర ఉంచుకోవాలి. పెట్రోల్ బంకులు, మొబైల్ నెట్‌వర్క్ సాధారణంగా అందుబాటులో ఉన్నప్పటికీ, ముందుగానే మార్గాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. రాత్రిపూట డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ముంబై నుంచి గణపతిపులే మీదుగా సింధుదుర్గ్ వరకు సాగే ఈ కొంకణ్ రోడ్ ట్రిప్ నేచర్, హిస్టరీ, ఫుడ్, అడ్వెంచర్స్ ను ఒకేసారి ఆస్వాదించాలనుకునే వారికి చక్కని ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

Read Also: జటాయువు ఎక్కడ ప్రాణాలు విడిచాడు? రామాయణంలోని 6 అసలైన ప్రదేశాలు ఎక్కడున్నాయంటే!

Tags

Related News

దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ కింద సమాధి.. దీపావళి అక్కడే ఎందుకు జరుపుకున్నారో తెలుసా?

వందే భారత్ స్లీపర్ రైళ్లలో తత్కాల్ టికెట్లు బంద్.. రైల్వే షాకింగ్ డెసిషన్!

ప్లాట్‌ఫామ్ టికెట్‌తో రైలులో ప్రయాణించవచ్చా? ఫైన్ లేకుండా రైల్వే రూల్స్ ఇవే

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1,286 కిలోల మాంసం.. రైల్వే స్టేషన్‌లో ఏం జరిగింది?

జటాయువు ఎక్కడ ప్రాణాలు విడిచాడు? రామాయణంలోని 6 అసలైన ప్రదేశాలు ఎక్కడున్నాయంటే!

చలికాలంలో పక్షుల పండుగ.. దేశంలోని ఈ 10 ప్రదేశాలు మిస్ కావద్దు!

అమెరికా ప్రయాణం ఇక మరింత ఫాస్ట్.. భారత్ నుంచి మళ్లీ డైరెక్ట్ ఫ్లైట్స్!

Big Stories

Advertisement
×