E-Paper
Advertisement

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1,286 కిలోల మాంసం.. రైల్వే స్టేషన్‌లో ఏం జరిగింది?

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1,286 కిలోల మాంసం.. రైల్వే స్టేషన్‌లో ఏం జరిగింది?
Advertisement

Hyderabad to Delhi Meat Transport: ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో భారీ మొత్తంలో మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి రైలులో వచ్చిన 1,286 కిలోల మాంసాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మొత్తం 20 కార్టన్లలో ఉన్న ఈ సరుకులో గోమాంసం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అది ఏ రకమైన మాంసమో ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. దీంతో పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైలులో తరలింపు

ఈ మాంసాన్ని హైదరాబాద్ నుంచి దక్షిణ్ ఎక్స్‌ ప్రెస్ (12721) రైలులో ఢిల్లీకి తరలించారు. రైల్వే పార్శిల్ సర్వీస్ ద్వారా 20 థర్మోకోల్ కార్టన్లలో బుక్ చేశారు. బుకింగ్ సమయంలో వాటిని ‘మటన్’, ‘మాంస పదార్థాలు’గా పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. బరోడా హౌస్‌ లోని రైల్వే విజిలెన్స్ విభాగానికి ఈ సరుకుపై అనుమానం వచ్చింది. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసు టీమ్స్ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే యార్డులోని న్యూ వాషింగ్ లైన్ దగ్గరికి చేరుకుని కార్టన్లను పరిశీలించాయి.

గోమాంసం ఉందా? పరీక్షల తర్వాతే స్పష్టత!

Advertisement

స్వాధీనం చేసుకున్న మాంసంలో గోమాంసం ఉండవచ్చనే అనుమానంతో అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. ఈ మాంసం ఏంటనేది తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) బృందాన్ని, పశువైద్యుడిని అక్కడికి పిలిపించారు. మాంసం నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. రిపోర్టు వచ్చిన తర్వాతే అందులో ఏ రకమైన మాంసం ఉందనే విషయం తెలియనుంది. అప్పటి వరకు గోమాంసం ఉందని నిర్ధారించలేమని పోలీసులు తెలిపారు.

లాజిస్టిక్స్ సంస్థపైనా ఆరా

ఈ మాంసాన్ని ఓ లాజిస్టిక్స్ సంస్థ ద్వారా రవాణా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఆ సంస్థకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. సరుకును ఎవరు బుక్ చేశారు? ఎక్కడి నుంచి ఎవరికి పంపించారు? రవాణాకు సంబంధించిన డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా? అనే అంశం పైనా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణలో రైల్వే పోలీసులు, ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), రైల్వే రక్షణ దళం (RPF) అధికారులు పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న మాంసానికి సంబంధించిన వివరాలను ఈ-సాక్ష్య ప్లాట్‌ ఫామ్‌లో నమోదు చేయడంతో పాటు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నారు.

గోమాంసమని తేలితే చట్టపరమైన చర్యలు

Advertisement

ఒకవేళ ఫోరెన్సిక్ పరీక్షల్లో అది గోమాంసమని నిర్ధారణ అయితే భారతీయ న్యాయ సంహిత (BNS), సంబంధిత ప్రత్యేక చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు, మాంసం త్వరగా పాడయ్యే అవకాశం ఉండటంతో నమూనాల సేకరణ, ఇతర చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం దానిని పారవేయనున్నారు.

Read Also: చలికాలంలో పక్షుల పండుగ.. దేశంలోని ఈ 10 ప్రదేశాలు మిస్ కావద్దు!

Tags

Related News

ప్లాట్‌ఫామ్ టికెట్‌తో రైలులో ప్రయాణించవచ్చా? ఫైన్ లేకుండా రైల్వే రూల్స్ ఇవే

జటాయువు ఎక్కడ ప్రాణాలు విడిచాడు? రామాయణంలోని 6 అసలైన ప్రదేశాలు ఎక్కడున్నాయంటే!

చలికాలంలో పక్షుల పండుగ.. దేశంలోని ఈ 10 ప్రదేశాలు మిస్ కావద్దు!

అమెరికా ప్రయాణం ఇక మరింత ఫాస్ట్.. భారత్ నుంచి మళ్లీ డైరెక్ట్ ఫ్లైట్స్!

విమానం అవసరం లేదు.. గంటలోనే అబుదాబికి చేరుకోవచ్చు!

60 రోజులు కాదు.. ఇక 365 రోజుల ముందే.. ఎన్నారైలకు రైల్వే బంపర్ ఆఫర్!

గాల్లోనే దీపావళి సంబరాలు.. పైలట్ చేసిన పనికి ప్రయాణికులు ఫిదా!

Big Stories

Advertisement
×