India’s Winter Bird Paradise: శీతాకాలం వచ్చిందంటే భారత్ లోని సరస్సులు, చిత్తడి నేలలు కొత్త అందాలను సంతరించుకుంటాయి. వేల కిలోమీటర్ల దూరంలోని సైబీరియా, ఆర్కిటిక్, మంగోలియా లాంటి ప్రాంతాల నుంచి లక్షలాది వలస పక్షులు మన దేశానికి చేరుకుంటాయి. చలి తీవ్రత నుంచి తప్పించుకోవడంతో పాటు ఆహారం, అనుకూలమైన వాతావరణం కోసం భారత్ ను ఎంచుకుంటాయి. ముఖ్యంగా నవంబర్ చివరి నుంచి డిసెంబర్ వరకు ఈ పక్షులను పెద్ద సంఖ్యలో చూడవచ్చు. ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లు, బర్డ్ లవర్స్ ఈ శీతాకాలంలో వలస పక్షులను చూడటానికి వెళ్లాల్సిన 10 అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఉన్న కియోలాడియో నేషనల్ పార్క్ వలస పక్షులకు ప్రసిద్ధి. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి శీతాకాలంలో వేలాది పక్షులు వస్తాయి. బార్‌హెడెడ్ గీస్, గ్రేలాగ్ గీస్, నార్తర్న్ పిన్‌టెయిల్స్ లాంటి పక్షులను ఇక్కడ చూడవచ్చు.
చిలికా సరస్సు ఉత్తర భాగంలో ఉన్న మంగళజోడి పక్షుల సందడితో కళకళలాడుతుంది. రష్యా, బైకాల్ సరస్సు ప్రాంతాల నుంచి అనేక పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి. బ్లాక్‌టెయిల్డ్ గాడ్‌విట్‌లు, గార్గానీలు, నార్తర్న్ పిన్‌టెయిల్స్ అలరిస్తాయి.
ముంబైలోని థానే క్రీక్ ఫ్లెమింగోలకు ప్రసిద్ధి. నవంబర్ చివరి నుంచి ఇక్కడ గులాబీ రంగు ఫ్లెమింగోల గుంపులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇతర వలస తీరపక్షులను కూడా చూడవచ్చు.
ధౌలాధర్ పర్వతాల అందాల మధ్య ఉన్న పోంగ్ డ్యామ్ సరస్సు వలస పక్షులకు ముఖ్యమైన విడిది. ముఖ్యంగా బార్‌హెడెడ్ గీస్ వేల సంఖ్యలో ఇక్కడికి వస్తాయి. డిసెంబర్‌లో ఈ ప్రాంతం పక్షుల సందడితో నిండిపోతుంది.
డెమోయిసెల్ క్రేన్‌లను చూడాలనుకునేవారికి ఇది బెస్ట్ ప్లేస్. మంగోలియా, కజకిస్తాన్ ప్రాంతాల నుంచి వచ్చే ఈ పక్షులతో పాటు ఫ్లెమింగోలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
బియాస్, సట్లెజ్ నదులు కలిసే ప్రాంతంలో ఉన్న హరికే చిత్తడి నేల శీతాకాలంలో వేలాది పక్షులకు ఆశ్రయం కల్పిస్తుంది. వివిధ రకాల బాతులు, నీటి పక్షులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.
దేశంలోని ప్రముఖ ఉప్పునీటి సరస్సుల్లో పులికాట్ ఒకటి. శీతాకాలంలో వేలాది గ్రేటర్ ఫ్లెమింగోలు ఇక్కడికి చేరుకుంటాయి. పెలికాన్లు, పెయింటెడ్ స్టోర్క్ లు కూడా సందర్శకులను ఆకట్టుకుంటాయి.
ఢిల్లీకి సమీపంలో ఉన్న సుల్తాన్‌పూర్ పక్షుల పరిశీలనకు అనువైన ప్రదేశం. సైబీరియా, యూరప్ నుంచి వచ్చే పక్షులు ఇక్కడ శీతాకాలం గడుపుతాయి. నార్తర్న్ పిన్‌టెయిల్స్, కామన్ టీల్స్ లాంటి పక్షులను చూడవచ్చు.
తమిళనాడులోని పాయింట్ కాలిమెర్ తీర ప్రాంతం వలస తీరపక్షులకు ప్రసిద్ధి. రెడ్ నాట్స్, కర్ల్యూ సాండ్‌పైపర్స్, కాస్పియన్ టెర్న్స్ లాంటి పక్షులు ఇక్కడ కనిపిస్తాయి.
జామ్‌నగర్‌లోని ఖిజాడియా పక్షి సంరక్షణ కేంద్రం ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థకు ప్రసిద్ధి. మంచినీటి చిత్తడి నేలలు, సముద్రపు బురద మైదానాలు ఇక్కడ ఉన్నాయి. డిసెంబర్‌లో పెలికాన్లు, గ్రీబ్స్, కొంగలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి.
Read Also:రాముడి ఊరి నుంచి సీతమ్మ ఊరికి రైలు.. ప్రయాణికులకు త్వరలోనే కొత్త సౌకర్యం!