BigTV English

Must Visit: మనిషి చనిపోయేలోపు ఒక్కసారైనా ఈ 5 ఆలయాలకు వెళ్లాలి.. ఎందుకో తెలుసా?

Must Visit: మనిషి చనిపోయేలోపు ఒక్కసారైనా ఈ 5 ఆలయాలకు వెళ్లాలి.. ఎందుకో తెలుసా?

Big Tv Live Originals: జీవితం మొత్తంలో ఏం చేసినా లభించని ముక్తి, పుణ్యం కొన్ని ఆలయాలను సందర్శిస్తే వస్తుంది. ఆలయం అంటే చరిత్ర లేదా వాస్తుశిల్పం గురించి మాత్రమే కాదు, కొన్ని వైవ స్థానాలకు చాలా పవర్ ఉంటుంది. ఈ దేవాలయాలు మొక్కుకోవడానికే కేవలం సందర్శించడానికే కాదు. కొన్ని సార్లు ఈ ఆలయాలతో ఉండే దేవుళ్లపై ఉంచే విశ్వాసం పెద్ద పెద్ద అద్భుతాలను చేస్తుంది. అటువంటి ఆలయాల లిస్ట్‌ ఇక్కడ ఉంది. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ ఆలయాలకు వెళ్లి రావాలని హిందూ మత పెద్దలు చెబుతున్నారు. మరి ఇందులో మీరు ఎన్ని ఆలయాలను సందర్శించారో చెక్ చేసుకోండి..


శ్రీ జగన్నాథ్ టెంపుల్
భారతదేశంలోని అతి ప్రాచీనమైన, పవిత్రమైన హిందూ ఆలయాల్లో కటైన శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం పురీలో ఉంది. ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందిన ఆలయం. ఇందులో శ్రీ జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్ర అమ్మవారిని పూజిస్తారు. శ్రీ జగన్నాథ స్వామిని కృష్ణుడి అవతారంగా కూడా చూస్తారు.

ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. దేవాలయం ఆర్కిటెక్చర్ కళలో కళాత్మకంగా నిర్మించబడింది. ఇది కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా ఇండియాలో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా కూడా నిలిచింది.


ALSO READ: ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఫలకంతో కట్టిన ఆలయం

ఆ ఆలయానికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఆలయంపైన ఉన్న కలశం ఎప్పుడూ దర్శనమిస్తుంది, కానీ దాని నీడ మాత్రం అస్సలు కనిపించదట. అంతేకాకుండా ఎంత వాన వచ్చినా, గాలి వచ్చినా సరే, అలయ ప్రధాన గోపురం మీద ఉన్న ధ్వజాన్ని ప్రతి రోజూ పూజారి మారుస్తారట.

శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం
ఇండియాలో ఉన్న అద్భుతమైన దేవాలయాల్లో ఒకటైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. శేషనాగం మీద ఉన్న విష్ణువును ఇందులో పూజిస్తారు. ఈ ఆలయం కేవలం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా, అనేక రహస్య ఖజానాలు, చరిత్ర, ప్రాచీన శిల్పకళతో కూడిన ప్రదేశంగా పేరుపొందింది.

ఈ ఆలయంలోని ఖజానా గదుల తలుపులను తొలిసారిగా 2011లో తెరిచారు. ఈ గదుల్లో పురాతన బంగారు ఆభరణాలు, వజ్రాలు, రత్నాలు, వెండి వస్తువులు కనిపించాయి. వీటి విలువ లక్షల కోట్లోలోనే ఉంటుందట. అయితే, ఆలయంలోని వాల్ట్-B అనే గదిని తెరవడానికి మాత్రం ఇప్పటికీ ఎవరూ ధైర్యం చేయలేదు. దీన్ని తెరిస్తే ఏదైన చెడు జరిగే అవకాశం ఉందని భక్తులు నమ్ముతారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం
ఇండియాలో ఎక్కువ మంది భక్తులు సందర్శించే ఆలయాల్లో ఏపీలో ఉన్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఏటా కోట్లాదిమంది భక్తులు స్వామి దర్శనార్థం తిరుమల కొండలపైకి వెళ్తారు. కలియుగంలో భక్తులను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు కొండపై అవతరించాడని భక్తులు నమ్ముతారు. తిరుమల కొండలపైకి ఒక్కసారైనా వెళ్లాలని ప్రతి హిందువు మనసులో కోరిక ఉంటుంది.

శ్రీ రంగనాథస్వామి ఆలయం
తమిళనాడులోని శ్రీరంగంలో శ్రీ రంగనాథస్వామి ఆలయం ఉంది. ప్రాచీన వైష్ణవ ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.లక్షలాది మంది భక్తులు పరమపద ద్వారం ద్వారా స్వామి దర్శనం పొందడానికి తరలివస్తారు. ఈ ఆలయం ప్రతి హిందువుకూ జీవితంలో ఒక్కసారి తప్పకుండా సందర్శించాల్సిన దివ్యక్షేత్రం.

టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం
పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్‌లో టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం ఉంది. ఈ ప్లానిటోరియంలో సంయోజన ఫిల్మ్స్, డిజిటల్ అనిమేషన్లు, మల్టీమీడియా డిస్‌ప్లేలు ఉంటాయి. వేద, ఖగోళ, జ్యోతిష్య అంశాలను వివరించేందుకు ఇవి సహాయపడతాయి. ఇంటర్నేషనల్ ఖగోళ శాస్త్రవేత్తలు, వేద అధ్యయనాలపై నిపుణులు ఇక్కడికి తరచుగా వస్తూ ఉంటారు.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Tags

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×