Nayanthara:..లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈ విషయం ఆమె అభిమానులకు షాక్ కలిగించే అంశం అని చెప్పవచ్చు. అదేంటంటే నయనతార కూడా సర్జరీ చేయించుకోబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లేడీ సూపర్ స్టార్ గా సౌత్ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అక్కడ పఠాన్, జవాన్ వంటి చిత్రాలలో నటించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నయనతార. దీనిని తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.
సర్జరీకి సిద్ధమైన నయనతార..
నయనతార అందం, టాలెంట్, ఆమె కండిషన్స్ ఇలా మొత్తం ఆమె గురించి అందరికీ తెలిసిందే..అయితే నయనతార ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ఆఫర్లను అందుకోలేకపోతోంది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ (Vighnesh shivan) ను పెళ్లి చేసుకున్న తర్వాత నిత్యం ఏదో ఒక కాంట్రివర్షియల్ మేటర్ లో ఇరుకుతున్న ఈమె.. దీనికి తోడు ఇటీవల ధనుష్ తో ఏర్పడిన వివాదం కారణంగా కూడా అవకాశాలు కోల్పోతోంది అనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలకు చేరువ అవుతున్నా.. అదే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ మధ్యకాలంలో ఆ స్టార్ స్టేటస్ కి తగ్గ అవకాశాలు రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే నయనతార సర్జరీ చేయించుకోబోతోంది అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది.
గత కొన్ని రోజులుగా ఆ నొప్పిని భరిస్తూ..
అసలు విషయంలోకి వెళ్తే.. నయనతార తన భుజానికి సర్జరీ చేయించుకోబోతోందని సమాచారం. ఈమె ‘కర్తవ్యం’ సినిమా చేసే సమయం లో షోల్డర్ కి చిన్న గాయమైందట. అప్పటినుంచి ఆ గాయాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా.. సాధ్యం కాలేదని, అందుకే ఇప్పుడు చిన్నపాటి మైనర్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుందట.వాస్తవానికి ఈ విషయాన్ని గతంలోనే డాక్టర్ సూచించినా.. ఆమె మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు నొప్పి తీవ్రతరం కావడంతో సర్జరీకి సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నయనతార మాత్రం సర్జరీకి సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే నయనతార దగ్గర నుంచి లేదా ఆమె టీం నుంచి ఏదైనా ఆఫీషియల్ గా ప్రకటన వస్తే తప్ప ఇది నిజం కాదని చెప్పవచ్చు. ఇక నయనతార విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అదే అందం మైంటైన్ చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. మొన్నటి వరకు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈమె ఇప్పుడు ఈ మధ్యకాలంలో.. కథల ఎంపికలో వెనకడుగు వేయడంతోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికైనా నయనతార కథల ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.