Train Schedule Shatabdi Express Change | రైలు ప్రయాణికులకు శుభవార్త. భారత రైల్వే శాఖ రెండు ప్రీమియం ట్రైన్ల ప్రయాణ సమయాల్లో కీలక మార్పులు చేసింది. ఈ రెండు కూడా శతాబ్ది ఎక్సెప్రెస్ ట్రైన్లు కావడం గమనార్హం. ఈ రెండు ప్రత్యేక రైళ్లు దేశంలో వేగంగా ప్రయాణిస్తూ.. ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తాయి.
మారిన వేళలు.. ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ తాజాతా రెండు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ట్రైన్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేసింది. ఆ రెండు శతాబ్ద ఎక్స్ ప్రెస్ ట్రైన్ల పేర్లు ఇలా ఉన్నాయి.
1. న్యూ ఢిల్లీ నుంచి కాన్పూర్ సెంట్రల్ మధ్య ప్రయాణించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్
2. న్యూ ఢిల్లీ నుంచి అజ్మేర్ వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్
న్యూ ఢిల్లీ నుంచి కాన్పూర్ సెంట్రల్ వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్ 12034. ఈ ట్రైన్ మారిన సమయాల ప్రకారం.. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరుతుంది. ఇంతకుముందు ఈ ట్రైన్ 3.50 గంటలకు అంటే పది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరేది. అయితే రాత్రి 8.50 నిమిషాలకు ఈ ట్రైన్ తన చివరి గమ్యస్థానమైన కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. మార్గమధ్యలో ఇప్పుడు ఈ ట్రైన్ మూడు స్టేషన్లలో ఆగుతుంది. ఇంతకుముందు రెండు స్టేషన్ల వద్ద మాత్రమే స్టాపింగ్ ఉండేది. న్యూ ఢిల్లీ స్టేషన్ నుంచి బయలు దేరి గాజియాబాద్ జంక్షన్, అలీగడ్ జంక్షన్, ఇటావా జంక్షన్.. ఈ మూడు రైల్వే స్టేషన్లలో హాల్ట్ అవుతుంది.
Also Read: అలర్ట్.. సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఆ రైళ్లు రద్దు, వెంటనే చెక్ చేసుకోండి
న్యూ ఢిల్లీ – కాన్పూర్ సెంట్రల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్.. న్యూ ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రయాణం ప్రారంభించి.. గాజియాబాద్ కు సాయంత్రం 4.12 గంటలకు చేరుకుని.. పది నిమిషాల తరువాత అంటే 4.22 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ తరువాత అలీగడ్ స్టేషన్ వద్దకు 5.18 గంటలకు, ఇటావ స్టేషన్ వద్దకు సాయంత్రం 7.05 గంటలకు చేరుకుంటుంది. జూలై 1988లో ప్రారంభైన ఈ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో ఆధునీకరణ తరువాత ప్రస్తుతం రెండు రకాల సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. ఒక ఏసీ చైర్ కార్, రెండోది ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్.
న్యూ ఢిల్లీ నుంచి అజ్మేర్ వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్
దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక క్షేతం, దైవ స్థానం ఉన్న అజ్మేర్ నగరం వరకు వెళ్లే.. ఈ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నెంబర్లు 12015, 12016. ఈ ట్రైన్ అజ్మేర్ లోని దౌరై రైల్వే స్టేషన్ వరకు వెళ్లి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తుంది. ట్రైన్ నెంబర్ 12015 న్యూ ఢిల్లీ – దౌరై శతాబ్ది ఎక్స్‌ప్రెస్.. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6.10 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానమైన దౌరై స్టేషన్ కు మధ్యాహ్నం 01.35 చేరుకుంటుంది. తిరిగి బయలుదేరేటప్పుడు ట్రైన్ నెంబర్ 12016 దౌరై నుంచి మధ్యాహ్నం 03.15 గంటలకు బయలుదేరి దేశా రాజధాని ఢిల్లీకి రాత్రి 10.30 నిమిషాకలు చేరుకుంటుంది. ఈ శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో కూడా ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి.