PM Kisan Instalment: మోదీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులకు రైతులు ఆర్థికంగా కుంగిపోకుండా అందించే పెట్టుబడి సాయం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఈ పథకం కింద అర్హత కలిగిన అన్నదాతలకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల అకౌంట్లలోకి జమ చేస్తూ వస్తోంది కేంద్రం ప్రభుత్వం. తాజాగా 19వ విడత నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది మోదీ సర్కార్. ఇందులో భాగంగా అర్హులైన రైతుల ఖాతాల్లో రూ. 2000 జమ కానున్నాయి.
ఫిబ్రవరి 24వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ బీహార్‌లోని భాగల్పూర్‌కు వెళ్లున్నారు. అక్కడి రైతులతో ముచ్చటించనున్నారు. ఆ తర్వాత కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను జమ చేయనున్నారు. సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది మోదీ సర్కార్.
ఇప్పటి వరకు 18 విడతలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. 9 కోట్లకు పైగానున్న రైతుల ఖాతాల్లో దాదాపు రూ. 20,000 కోట్లు బదిలీ చేసింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నిధులు పొందాలంటే రైతులు కొన్ని రూల్స్ ఫాలో కావాల్సిందే. రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందే. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
ALSO READ: ఒకే ఇంట్లో వందల పిల్లుల పెంపకం
ఇందుకోసం http://pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. సైట్ ఓపెన్ తర్వాత ఫార్మర్ కార్నర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దాని కింద e-KYC ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తొలుత ఆధార్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ e-KYC ప్రక్రియ పూర్తికానుంది.
ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా ఆన్‌లైన్‌లో ఉంటుంది. దీని సహాయంతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడతను నిధులు పొందారో లేదో చెక్ చేసుకునే సదుపాయం ఉంది. జాబితాలో మీ పేరు ఉందో లేదో తొలుత చెక్ చేసుకోండి.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/లోకి వెళ్లాలి.
ఫార్మర్ కార్నర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
లబ్ధిదారుల జాబితా ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది
రాష్ట్రం, జిల్లా, మండలం లేదా బ్లాక్, గ్రామం పేరును సెలక్ట్ చేసుకోవాలి
అవసరమైన వివరాలన్నీ పూర్తి చేయాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయండి
పైన చెప్పిన విధంగా చేస్తే మీ గ్రామానికి చెందిన ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది
ఈ జాబితాలో మీ పేరు ఉంటేనే పీఎం కిసాన్ పథకం డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి