Trains cancelled: హైదరాబాద్-సికింద్రాబాద్ డివిజన్లలోని పలు సెక్షన్లలో పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మరి కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. ముఖ్యంగా ఆలేరు-పెంబర్తి స్టేషన్ల మధ్య ట్రాక్ మరమ్మతులు జరుగుతున్నాయి. దీనివల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
పరిస్థితి గమనించిన దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఫిబ్రవరి 17న నడిచే సికింద్రాబాద్-భద్రాచలం (17659), ఫిబ్రవరి 18న భద్రాచలం-సికింద్రాబాద్ (17660) సర్వీసులను రద్దు చేశారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారి సీపీఆర్‌ఓ శ్రీధర్ ఓ ప్రకటన తెలిపారు.
మరోవైపు సోమవారం గోరఖ్‌పూర్ నుంచి సికింద్రాబాద్ మీదుగా యశ్వంత్‌పూర్ వెళ్లాల్సింది ఉంది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. దీన్ని రెండు గంటల రీషెడ్యూల్ చేశారు. నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ రావాల్సిన ఎక్స్‌ప్రెస్‌ను గంటన్నర పాటు రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ డివిజన్ పరిధిలో చేపడుతున్న పనుల కారణంగా ఈనెల 23న సిద్దిపేట్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సిద్దిపేట్ (77656/77653) రైళ్లను సైతం రద్దు చేసింది.
ALSO READ: ప్రయాణికులకు విజ్ఞప్తి.. రైల్వే స్టేషన్ ఎంట్రీపై కఠిన ఆంక్షలు, ఇకపై అది పక్కా!
ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో విస్తరణ, ఆధునీకరణ, పునర్నిర్మించే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్టేషన్లకు వచ్చే రైళ్లు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి. పరిస్థితి గమనించిన రైల్వే విభాగం, వివిధ ప్రాంతాల్లో పలు రైళ్లను రద్దు చేసింది. మాగ్జిమమ్ ప్రయాణికులు ఎక్కువగా రైళు ప్రయాణానికి మొగ్గు చూపుతారు. టిక్కెట్ ఛార్జ్ తక్కువ కారణం ఒకెత్తయితే, ట్రావెల్ చేసినట్టు ఉండదు. దీనికితోడు చాలామందికి బస్సు పడకపోవడం మరో కారణం.