Metro Rail Ticket Price Increase: టికెట్ ధరలు పెంచాలనుకున్న బెంగళూరు మెట్రో యాజమాన్యం తాత్కాలింకంగా ఆ ఆలోచనకు బ్రేక్ వేసింది. మెట్రో టికెట్ ధర పెంపునకు సంబంధించి నివేదిక ఇవ్వాలని BMRCLను ఆదేశించింది. ఈ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో టికెట్ ధర పెంపు ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోగా ఏడాది సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
మెట్రో రైల్ టికెట్ ధరలు పెంచాలని నిర్ణయం
మెట్రో రైలు టికెట్ ధరల పెంపునకు సంబంధించి BMRCLగత వారం సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం ఉన్న ఛార్జీలను 45 శాతం పెంచాలని నిర్ణయించింది. ధరల పెంపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమచారం ఇచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింఫుల్ గా పెంపునకు సంబంధించి నివేదిక ఇవ్వాలని సూచించింది.
రీసెంట్ గా కర్నాటకలో బస్సు టికెట్ల ధరలు పెంపు
రీసెంట్ గా కర్ణాటకలో బస్సు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిస్థితిలో మెట్రో టికెట్ ధరను కూడా పెంచితే.. ప్రజలపై ఎక్కువ భారం పడే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే, ఛార్జీల పెంపుపై నిర్ణయాన్ని ఖరారు చేసే ముందు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అయితే, ఈ నివేదిక ఇచ్చేందుకు కొంత సమయం కావాలని BMRCL కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఫిబ్రవరి 1 నుంచే ఛార్జీలు పెంచాలని ప్రణాళిక
వాస్తవానికి ఫిబ్రవరి 1 నుండి మెట్రో ఛార్జీలను పెంచాలని BMRCL ప్రణాళిక వేసింది. ఇప్పటికే ప్రయాణీకుల నుంచి అభిప్రయాలను కోరింది. సూచనలను స్వీకరించింది. ప్రయాణీకుల నుంచి ఛార్జీల పెంపుపై వ్యతిరేకత వచ్చినప్పటికీ, BMRCL నిర్వహణ సాకుతో ఛార్జీల పెంపుతో ముందుకు సాగింది. ఇప్పుడు, BMRCL నిర్ణయాన్ని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది.
2017లో మెట్రో టికెట్ ధరల పెంపు
BMRCL 2017లో చివరి సారిగా మెట్రో రైలు టికెట్ ఛార్జీలను పెంచింది. ఆ తర్వాత ఛార్జీలను సవరించడానికి ప్రయత్నించలేదు. అయితే, ఇప్పుడు ఛార్జీలను పెంచాలని యోచిస్తున్న BMRCLకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం, బెంగళూరు మెట్రోలో టికెట్ కనీస ఛార్జీ రూ. 10 ఉండగా, గరిష్ట ఛార్జీ రూ. 60 తీసుకుంటున్నారు. మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో BMRCL ఛార్జీలను పెంచాలని యోచిస్తోంది. అంతేకాదు, మెట్రో స్టేషన్ల పార్కింగ్ ప్రాంతాలలో ప్రయాణీకుల నుంచి పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరులోని 66 మెట్రో స్టేషన్లు ఉండగా, 33 స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యాలు ఉన్నాయి. BMRCL సుమారు 11,000 టూ వీలర్స్, 1,500 కంటే ఎక్కువ కార్లు పార్క్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది.
Read Also: కుంభమేళాకు తాత్కాలికంగా రైళ్లు రద్దు.. రైల్వేశాఖ ఏం చెప్పిందంటే?