E-Paper
Advertisement

Nilgiri Mountain Train Ride: ఊటీ-మెట్టుపాళయం సమ్మర్ స్పెషల్ షురూ, నీలగిరి అందాలు చూసేయండి!

Nilgiri Mountain Train Ride: ఊటీ-మెట్టుపాళయం సమ్మర్ స్పెషల్ షురూ, నీలగిరి అందాలు చూసేయండి!
Advertisement

Summer Special Mountain Train: సమ్మర్ లో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే రైలు ప్రయాణాల్లో ఒకటి నీలగిరి మౌంటైన్ రైల్వే ప్రయాణం. నీలగిరి పర్వతాల అందాలను ఆస్వాదించాలనుకునే వారికోసం ఊటీ-మెట్టుపాళయం సమ్మర్ రైలు సర్వీసులు ప్రారంభం అయ్యింది. ఈ రైలు, కోయంబత్తూర్ జిల్లాలోని మెట్టుపళయం నుంచి నీలగిరి జిల్లాలోని  పాపులర్ హిల్ స్టేషన్ ఊటీ వరకు నడుస్తుంది. పచ్చటి పర్వతాల నడుమ, వంకర మార్గాలు, కొండల దృశ్యాలు,  ప్రకృతి అందాల నడుమ ఈ ప్రయాణం మరింత ఆహ్లాదాన్ని అందిస్తుంది.

పర్వత రైలు ప్రయాణాల్లో ప్రత్యేకం 

నీలగిరి పర్వత రైల్వే.. పర్వత రైలు మార్గాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నారో గేజ్ ట్రాక్, ఇంజనీరింగ్ అద్భుతాలు, చారిత్రాత్మక విలువ, 2005లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడటంతో ఈ రైల్వే మార్గానికి మరింత గుర్తింపు వచ్చింది. రైలులో ప్రయాణం మాత్రమే కాక, నీలగిరి కొండల మధ్య హృదయాన్ని ఆకట్టుకునేలా ముందుకుసాగుతుంది. పర్యాటకులు ఈ రైలు ప్రయాణాన్ని జీవితాంతం మర్చిపోలేరు.

రైల్వే సర్వీసు గురించి..

Advertisement

నీలగిరి పర్వత రైల్వే సర్వీసు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణ రైలు మెట్టుపాళయం నుంచి ఉదయం 7:10కి బయలుదేరి మధ్యాహ్నం 12:00 గంటలకు ఊటీ చేరుతుంది. వేసవిలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, సేలం రైల్వే డివిజన్ ప్రత్యేక రైలు సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక రైలు షెడ్యూల్ ప్రకారం, మెట్టుపాళయం నుంచి ఊటీకి రైలు మార్చి 27 నుంచి జూలై 5 వరకు శుక్రవారాలు, ఆదివారాల్లో నడుస్తుంది. ప్రారంభ రైలు ఉదయం 9:10 గంటలకు బయలుదేరి, పర్యాటకులకు మార్గంలోని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించే అవకాశం ఇస్తుంది. ఊటీ నుంచి మెట్టుపాళయం తిరిగి వచ్చే రైలు మార్చి 28 నుండి జూలై 6 వరకు శనివారాలు, సోమవారాల్లో నడుస్తుంది.

Read Also: గంటకు 180 కిలోమీటర్ల వేగం.. భారతీయ రైల్వేలో సరికొత్త శకం ప్రారంభం!

ఆహ్లాదకరమైన పర్వత రైలు ప్రయాణం

Advertisement

ఈ రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పర్వత ప్రాంతాల అందాలను ఆస్వాదించడానికి పూర్తిగా అనువుగా ఉంటుంది. నీలగిరి పర్వతాల మధ్యకు తీసుకెళ్లే ఈ ప్రత్యేక సర్వీసు, ఫోటోగ్రాఫర్లు, విహారయాత్రికులను ఆకట్టుకుంటుంది. అందమైన ప్రకృతి, పచ్చదనం, కొండల దృశ్యాలు, నారో గేజ్ మార్గం లాంటి ప్రత్యేకతలు, ఈ ప్రయాణాన్ని మరింత అనుకూలంగా మార్చుతుంది. సాధారణంగా, ఊటీ-మెట్టుపాళయం ప్రత్యేక వేసవి రైల్లో ప్రయాణించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది నీలగిరి పర్వతాల అందాలను, పూర్వీకాలపు చారిత్రాత్మక విలువను, సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని కలిపి అందిస్తుంది.

Read Also: అందులోబాటులోకి ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ పోర్ట్, అమ్మో.. ఎన్ని సౌకర్యాలో!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×