Indian Railways: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. అత్యాధునిక టెక్నాలజీతో సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. అందులో భాగంగానే పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో వందేభారత్ స్లీపర్ రైలు కూడా అందుబాటులోకి రాబోతోంది. మరోవైపు హైపర్ లూప్ టెక్నాలజీ పైనా కీలక పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అతి పొడవైన హైపర్ లూప్ ను తయారు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇక త్వరలో హైడ్రోజన్ రైలు పట్టాలెక్కబోతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ లోకోమోటివ్ రెడీ అవుతోంది.
చెన్నై ఐసీఎఫ్ లో హైడ్రోజన్ రైలు తయారీ
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు తయారీ శరవేగంగా కొనసాగుతోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా పనులు కంప్లీట్ అయ్యాయి. ప్రపంచంలోనే తొలిసారి భారత్ లో 10 కోచ్ లతో కూడిన హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ఈ రైలు తయారీకి సుమారు రూ. 80 కోట్లు ఖర్చు అవుతోంది. కర్బన ఉద్గారాలు, శబ్దకాలుష్యం లేకుండా ఈ రైళ్లు ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఈ రైలును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలి హైడ్రోజన్ రైలును నార్తన్ రైల్వే పరిధిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ రైలు నిర్మాణం పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ రైళ్లతో దేశంలో 2030 నాటికి కర్బన ఉద్గారాలు జీరోకు తీసుకురావాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: ఇండియన్ రైల్వేకు 500వ ఎలక్ట్రిక్ లోకోమోటివ్, సరుకు రవాణాలో ఇక దూకుడే!
హైడ్రోజన్ రైలు వేగం ఎంత అంటే?
ఇక హైడ్రోజన్ రైలు గంటకు 110 కిలో మీటర్ల వేగంతో నడవనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైలును తొలుత హర్యానాలోని జింద్, సోనిపట్ మధ్య సుమారు 90 కిలో మీటర్ల పరిధిలో నడిపించాలని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ రైలు లేని విధంగా 1200 HP సామర్థ్యంతో ఇంజిన్ రూపొందుతోంది. మొత్తం రూ.2,300 కోట్ల రూపాయల వ్యవయంతో 35 హైడ్రోజన్ రైళ్లను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు గత ఏడాదిలోనే ఐసీఎఫ్‌లో హైడ్రోజన్ రైలు తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ రైలుకు తుది మెరుగులు దిద్దుతున్నారు పెయింటింగ్, హైడ్రోజన్ సిలిండర్ల బిగింపు, ఇతర టెక్నికల్ పనులు కొనసాగుతున్నాయి. నెల రోజుల్లో అన్ని పనులు పూర్తై రైలు రెడీ కానుంది. ఆ తర్వాత ట్రయల్ రన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, లండన్, చైనాలో ఈ రైళ్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాటికంటే పవర్ ఫుల్ రైలు భారత్ లో అందుబాటులోకి రాబోతోంది.
Read Also: విమానం గాల్లో ఉండగా డోర్ తీయబోయిన ప్రయాణీకుడు.. చివరికి, శంషాబాద్‌లో..
Read Also: కశ్మీర్‌ను ఇక రైల్లో చుట్టేయొచ్చు.. ఏయే ప్రాంతాలను చూడొచ్చు అంటే?