E-Paper
Advertisement

Bullet Train: సూరత్‌ బుల్లెట్ రైలు స్టేషన్‌ కు ప్రధాని మోడీ, పనుల పురోగతిపై సమీక్ష!

Bullet Train:  సూరత్‌ బుల్లెట్ రైలు స్టేషన్‌ కు ప్రధాని మోడీ, పనుల పురోగతిపై సమీక్ష!
Advertisement

భారత్ లో ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తుండగా, త్వరలో బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.  ముంబై- అహ్మదాబాద్ నగరాల నడుమ ఈ హైస్పీడ్  రైళ్లు తమ సేవలను కొనసాగించనున్నాయి. ఈ రైలు ప్రారంభం తర్వాత రెండు నగరాల మధ్య ప్రయాణం కేవలం 2 గంటల 7 నిమిషాలకు పరిమితం కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సూరత్ లో జరుగుతున్న బుల్లెట్ రైలు పనులను పరిశీలించారు. ఇవాళ ఉదయం సూరత్ కు వెళ్లిన ఆయన, నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు స్టేషన్ అంట్రోలి ప్రాంతానికి చేరుకున్నారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం అధికారులను అడిగి పనుల పురోగతిపై సమీక్షించారు. వేగంగా పనులు పూర్తి చేయాలని ప్రధాని  ఆదేశించారు.

బుల్లెట్ రైలు ప్రాజెక్టు గురించి..   

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మొత్తం 508 కి.మీ పరిధిలో విస్తరించి ఉంటుంది. ఇది గుజరాత్ లో 352 కి.మీ.. మహారాష్ట్రలో 156 కి.మీ కవర్ చేస్తుంది. ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)ను గుజరాత్‌ లోని వాపి, సూరత్, వడోదర, అహ్మదాబాద్, సబర్మతిని కలుపుతూ హైస్పీడ్ రైలు నడుస్తుంది. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఈ కారిడార్‌ లో మహారాష్ట్ర, గుజరాత్ లో కలిపి మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి.

రూ.1.8 లక్షల కోట్లతో బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం

Advertisement

ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు (MAHSR) ప్రాజెక్ట్ ను సుమారు రూ.1,08,000 కోట్లతో నిర్మిస్తున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ప్రాజెక్ట్ వ్యయంలో 81% అంటే రూ. 88,000 కోట్ల నిధులు సమకూరుస్తోంది. జపాన్ బుల్లెట్ రైలు సాంకేతికతను ఉపయోగించి భారత్ లో తొలి హైస్పీడ్ రైలు ప్రయత్నానికి సపోర్టు చేస్తుంది. 2023లో, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఈ ప్రాజెక్ట్ కోసం రెండు హైస్పీడ్ రైళ్లను రూపొందించడానికి, తయారు చేయడానికి, కమిషన్ చేయడానికి BEML లిమిటెడ్‌కు ఒక ఒప్పందాన్ని ఇచ్చింది. ప్రతి హై-స్పీడ్ కారు ధర రూ.27.86 కోట్లు. మొత్తం కాంట్రాక్ట్ విలువ రూ.866.87 కోట్లు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జపనీస్ షింకన్‌సెన్ సాంకేతికతను ఉపయోగించి రెండు ట్రైన్‌ సెట్‌ లను అభివృద్ధి చేయనుంది.

Read Also:  దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్.. దీని ముందు ఎయిర్ పోర్ట్ దిగదుడుపే!

2027 నాటికి అందుబాటులోకి!

Advertisement

అటు ఈ బుల్లెట్ రైలును 2027 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గత పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో, గుజరాత్‌ లోని వాపి నుంచి సబర్మతి విభాగం డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్ డిసెంబర్, 2029 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అనేది సంక్లిష్టమైన, సాంకేతికతతో కూడిన వ్యవహారంగా ఆయన అభివర్ణించారు.

Read Also:  ప్రపంచంలోనే అద్భుతమైన రైళ్లు, పట్టాలెక్కాయంటే రైల్వే రూపురేఖలు మారాల్సిందే!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×