E-Paper
Advertisement

విషమిచ్చి చంపబోతే 300 ఏళ్ల ఫ్యూచర్లోకి వచ్చి పడే అమ్మాయి…

విషమిచ్చి చంపబోతే 300 ఏళ్ల ఫ్యూచర్లోకి వచ్చి పడే అమ్మాయి…
Advertisement

Korean Fantasy Drama: రాజుల కాలంలో ఎవరైనా తప్పు చేస్తే వారిని చంపడానికి ఏమాత్రం వెనకాడే వాళ్ళు కాదన్న విషయం మనందరికీ తెలిసిందే. అచ్చం అలాగే ఓ అమ్మాయిని విషం ఇచ్చి చంపబోతే, ఆ అమ్మాయి ఏకంగా 300 ఏళ్ల భవిష్యత్తులోకి వెళ్తే ఎలా ఉంటుంది ? ఆ ఊహే క్రేజీగా ఉంది కదా. దాన్ని విజువల్ గా చూడాలనుకుంటే, కొరియా ఫాంటసీ రొమాంటిక్-కామెడీ కే-డ్రామా ‘My Royal Nemesis’ను చూడాల్సిందే. మరి ఈ కొరియన్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? కథ ఏంటి ? తెలుగులో అందుబాటులో ఉందా ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.

కథలోకి వెళ్తే….

సిరీస్ లో ప్రధాన పాత్ర పేరు కాంగ్ డాన్-సిమ్. జోసెయోన్ కాలంలో రాజును కూడా ముప్పితిప్పలు పెట్టి అపఖ్యాతి పాలవుతుంది రాయల్ కాన్కుబైన్. ఆమె తీక్షణమైన తెలివి, వాక్చాతుర్యం, ధైర్యం వల్ల రాజసభలో ప్రత్యేకమైన పేరు సంపాదించింది. అయితే ద్రోహం చేసిందన్న నెపంతో విషం ఇచ్చి మరణశిక్ష విధిస్తారు. ఆమె కళ్లు తెరిచేసరికి 21వ శతాబ్దపు సియోల్‌ లో ఉంటుంది. ఆమె ఆత్మ షిన్ సియో-రి అనే కష్టాల్లో ఉన్న నటి శరీరంలోకి ప్రవేశిస్తుంది.

Advertisement

ఆధునిక ప్రపంచం గురించి ఏమీ తెలియని డాన్-సిమ్ స్మార్ట్‌ఫోన్, కార్లు, కాఫీ షాపులు చూసి షాక్ అవుతుంది. ఆమె ఇప్పటి కాలంలో ఆడిషన్లు, రిజెక్షన్లు, అపార్ట్‌మెంట్ రెంట్‌ల మధ్య చిక్కుకుపోతుంది. ఈ సమయంలో ఆమె జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి చా సే-గ్యే. అతను ఒక మల్టీ-మిలియనీర్ చేబోల్ వారసుడు, కార్పొరేట్ ప్రపంచంలో పేరు గడించిన కఠినమైన వ్యక్తి. ఆఫీసులో అతని ఒక్క చూపు సరిపోతుంది, ఉద్యోగులు వణికిపోతారు. డాన్-సిమ్ కేమో ఆధునిక మర్యాదలు తెలియకుండా తప్పులు చేయడం, నిర్భయంగా మాట్లాడటం, ఎవరినీ లెక్క చేయకుండా ఉండటం అలవాటు. కానీ ఆమెలో ఉన్న ఆ అలవాట్లే సే-గ్యే దృష్టిని ఆకర్షిస్తాయి.

అతను ఆమెకు ఒక వింత షరతు పెడతాడు: తన బిజినెస్ డీల్‌లో “ఫేక్ ఫియాన్స్”గా నటించమని అడుగుతాడు. మొదట్లో ఇద్దరూ ఒకరినొకరు చూస్తేనే కొట్టుకునేలా ఉంటాడు. గొడవలు, తీవ్రమైన వాదనలు, ఒకరినొకరు ఎదిరించడం…. ఈ లవ్-హేట్ రిలేషన్‌షిప్ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నెమ్మదిగా డాన్-సిమ్ తన గత జీవితం రహస్యాలు సే-గ్యేకు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తాను తిరిగి జోసెయోన్ కాలానికి వెళ్లాలా లేదా ? ఇక్కడే కొత్త జీవితం మొదలుపెట్టాలా ? అనే సందేహంలో పడుతుంది. ఈ ప్రయాణంలో సే-గ్యే కఠినమైన హృదయం నెమ్మదిగా కరుగుతుంది. ఆమె నిజాయితీ, ధైర్యం, స్వేచ్ఛ నుంచి నేర్చుకుంటాడు. ఎనిమిది ఎపిసోడ్‌ల తర్వాత వచ్చే రొమాంటిక్ మూమెంట్స్, ఆఫీస్ కామెడీ, ఫ్యాషన్, లగ్జరీ లైఫ్‌స్టైల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కానీ కథలో కీలక మలుపులు తెస్తాడు విలన్ చోయ్ మున్-డో.

Advertisement

అతను సే-గ్యేను నాశనం చేయడానికి కుట్రలు పన్నుతాడు. అంతలోనే డాన్-సిమ్ ఆత్మ మళ్లీ జోసెయోన్ కాలానికి తిరిగి వెళ్లిపోతుంది. ఆధునిక ప్రపంచంలో ఒంటరైన సే-గ్యే ఆమె కోసం ఏం చేస్తాడు ? కాలాలను దాటి విధి వీరిద్దరిని మళ్లీ కలిపిందా ? అనేది తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.

తెలుగులో చూడొచ్చా ?

‘మై రాయల్ నెమిసెస్’ ప్రతి అంశం కట్టి పడేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో 2026లో భారీ విజయం సాధించిన ఈ సిరీస్ ఇప్పుడు గ్లోబల్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మే 8 నుంచి జూన్ 20 వరకు 14 ఎపిసోడ్‌లతో స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ లేకపోయినా, ఒరిజినల్ కొరియన్ ఆడియోతో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్, ఇంగ్లీష్ ఆడియోలో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో గ్లోబల్ టాప్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

Read Also: ఇండియన్ మైథాలాజి మిక్సయ్యి ఉన్న హాలీవుడ్ హర్రర్ మూవీ… లాస్ట్ ట్విస్ట్ డోంట్ మిస్

Tags

Related News

అభిమానిని చులకనగా చూసే స్టార్.. నిబ్బా నిబ్బీలకు కనెక్ట్ అయ్యే కొరియన్ కామెడీ డ్రామా ఇది

వరుస మర్డర్స్ తో పోలీసులను పరుగులు పెట్టించే సైకో… రియల్ సీరియల్ కిల్లర్ కథ

పెళ్లి కాకుండానే చచ్చి దెయ్యంగా… అబ్బాయిలు కన్పిస్తే వదలని ఆడ పిశాచి

హైవే యాక్సిడెంట్లలో హెల్ప్ చేసేవాళ్ల ప్రాణాలు తీసే పిశాచి… ఇలాంటి హర్రర్ మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా

అడవిని డెడ్లీ డెత్ గేమ్ లా మార్చే సైకో… టూరిస్టులను టార్చర్ చేసి చంపే కిల్లర్

మనుషుల బ్రెయిన్ ను మటన్ లా తినేసే మాన్స్టర్స్… ఈ కొరియన్ సై-ఫై సిరీస్ లో ఒక్కొక్క ట్విస్ట్ ఉంటది భయ్యా

ఘోస్ట్ షిప్లో వెంటాడి వెంటాడి చంపే మాస్క్ కిల్లర్… టెర్రీఫయింగ్ టైమ్ లూప్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×