E-Paper
Advertisement

అభిమానిని చులకనగా చూసే స్టార్.. నిబ్బా నిబ్బీలకు కనెక్ట్ అయ్యే కొరియన్ కామెడీ డ్రామా ఇది

అభిమానిని చులకనగా చూసే స్టార్.. నిబ్బా నిబ్బీలకు కనెక్ట్ అయ్యే కొరియన్ కామెడీ డ్రామా ఇది
Advertisement

Romantic Comedy Series: స్టార్స్ ను ఒక్కసారి చూడాలని అభిమానులు ఎంతగా ఉవ్విళ్లూరతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మనకు ప్రాణంతో సమానం అయిన సెలబ్రిటీని కాసేపు దగ్గర నుంచి చూస్తేనే ఉక్కిరిబిక్కిరి అవుతాము. అదే రోజంతా మన పక్కనే ఉంటే, అది చాలదు అన్నట్టు మన పక్క బెంచీలోనే కూర్చుని చదువుకుంటే ఎలా ఉంటుంది ? ఆ ఫీలింగ్ గురించి తెలియాలంటే చైనీస్ టీన్ రొమాంటిక్ కామెడీ డ్రామా బెస్ట్ సిరీస్ అనిపించుకున్న ‘My Deskmate’ సిరీస్ ను చూడాల్సిందే. 2021లో విడుదలైన ఈ సిరీస్ ను ఎక్కడ చూడొచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

కథలోకి వెళ్తే…

ఇందులో కథానాయిక షియాంగ్ షియా. ఆమె హైస్కూల్ చదివే అమ్మాయి. ఎప్పుడూ నవ్వుతూ, ఎవరితోనైనా స్నేహం చేసి, క్లాస్‌ లో ఎంతో ఎనర్జీగా ఉంటుంది. అలాంటి అమ్మాయి జీవితంలో ఓ ఆరాధ్య దైవం ఉంటాడు. పాప్ స్టార్ జిన్ హాన్ అన్నా, అతని పాటలు వినడం, పోస్టర్లు కొనడం, ఫ్యాన్ క్లబ్‌లో చురుకుగా ఉండటం వంటివి చేస్తూ అతనిపై అభిమానాన్ని చాటుకుంటుంది. అతన్ని ఒక్కసారైనా అతన్ని కలవాలి అనుకున్న ఆమె కల ఒకరోజు నిజమవుతుంది.

Advertisement

జిన్ హాన్ తన సెలబ్రిటీ లైఫ్ ఒత్తిడి నుంచి కొంత విరామం తీసుకోవాలి అనుకుంటాడు. అందుకోసం విద్యార్థిగా షియాంగ్ షియా చదువుతున్న క్లాస్‌లోకి వచ్చి జాయిన్ అవుతాడు. విధి విచిత్రం ఏమంటే… జిన్ హాన్ షియాంగ్ షియా పక్కనే డెస్క్‌మేట్‌గా కూర్చుంటాడు. తన ఫేవరెట్ స్టార్‌ను ప్రతి రోజూ దగ్గరగా చూడటం, అతనితో మాట్లాడటం, పుస్తకాలు పంచుకోవడం….షియాంగ్ ఆనందానికి అవధులు ఉండవు. ఆమె అతనికి నోట్స్ ఇవ్వడం, లంచ్ షేర్ చేయడం, చిన్న చిన్న సహాయాలు చేయడం మొదలు పెడుతుంది.

కానీ నిజ జీవితంలో జిన్ హాన్ చాలా సైలెంట్, కాస్త గర్వంగా, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని వ్యక్తి. షియాంగ్ అతి ఉత్సాహం, ఫ్యాన్ గర్ల్ బిహేవియర్ అతనికి మొదట్లో చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా ప్రారంభమైన వారి సంబంధం చిన్న చిన్న గొడవలు, ఫన్నీ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో నిండిపోతుంది. ఒకసారి షియాంగ్ అతని కోసం స్పెషల్ లంచ్ తెచ్చి ఇవ్వగా అతను తప్పుగా అర్థం చేసుకుని కోప్పడటం, మరోసారి క్లాస్‌లో అతని గురించి ఫ్యాన్ గర్ల్ స్టైల్‌లో మాట్లాడటం వల్ల ఇద్దరూ గొడవ పడటం.. లాంటి సీన్స్ సిరీస్‌ ను చాలా సరదాగా చేస్తాయి.

Advertisement

కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారు ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకోవడం మొదలవుతుంది. జిన్ హాన్ సెలబ్రిటీగా ఎదుర్కొనే ఏకాంతం, ఒత్తిళ్లు, గోప్యంగా ఉండాల్సిన ఇబ్బందులు షియాంగ్‌ కు తెలిసి వస్తాయి. ఆమె అతనికి నిజమైన స్నేహితురాలిగా, అండగా నిలుస్తుంది. పరీక్షల సమయంలో కలిసి చదువుకోవడం, స్కూల్ ఈవెంట్స్, గ్రూప్ స్టడీలు, వర్షంలో కలిసి నడవడం…. ఈ చిన్న చిన్న క్షణాలు వారి బంధాన్ని మరింత బలపరుస్తాయి. జిన్ హాన్ కూడా షియాంగ్ అమాయకత్వం, సానుభూతి, ఎప్పటికప్పుడు సపోర్ట్ చేసే స్వభావాన్ని ప్రేమించడం మొదలుపెడతాడు.

నెమ్మదిగా ఇద్దరి మధ్య మొదలైన స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. మరి ఆ ప్రేమను ఇద్దరూ ఎలా వ్యక్తపరిచారు ? హైస్కూల్ లో జరిగిన సంఘటనలు ఏంటి ? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

చక్కటి కామెడీ, స్వీట్ రొమాన్స్, ఎమోషనల్ మూమెంట్స్‌తో నిండిన ఈ సిరీస్ ను యూత్‌తో పాటు ఎవరైనా ఆనందంగా చూడొచ్చు. ఒక్క ఎపిసోడ్ చూడడం మొదలు పెడితే 30 ఎపిసోడ్‌లు ఆపకుండా చూస్తారు. క్లీన్, ఫ్రెష్, హార్ట్‌వార్మింగ్ లవ్ స్టోరీ కావాలనుకుంటే ఈ సిరీస్ ను మిస్ అవ్వొద్దు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌తో ఉచితంగా Amazon MX Playerలో, Prime Videoలో అందుబాటులో ఉంది.

Read Also : నరకంలో ఉన్న పేరెంట్స్ కోసం దేవుడితో ఒప్పందం… మెంటలెక్కించే సూపర్ నేచురల్ థ్రిల్లర్

Related News

విషమిచ్చి చంపబోతే 300 ఏళ్ల ఫ్యూచర్లోకి వచ్చి పడే అమ్మాయి…

వరుస మర్డర్స్ తో పోలీసులను పరుగులు పెట్టించే సైకో… రియల్ సీరియల్ కిల్లర్ కథ

పెళ్లి కాకుండానే చచ్చి దెయ్యంగా… అబ్బాయిలు కన్పిస్తే వదలని ఆడ పిశాచి

హైవే యాక్సిడెంట్లలో హెల్ప్ చేసేవాళ్ల ప్రాణాలు తీసే పిశాచి… ఇలాంటి హర్రర్ మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా

అడవిని డెడ్లీ డెత్ గేమ్ లా మార్చే సైకో… టూరిస్టులను టార్చర్ చేసి చంపే కిల్లర్

మనుషుల బ్రెయిన్ ను మటన్ లా తినేసే మాన్స్టర్స్… ఈ కొరియన్ సై-ఫై సిరీస్ లో ఒక్కొక్క ట్విస్ట్ ఉంటది భయ్యా

ఘోస్ట్ షిప్లో వెంటాడి వెంటాడి చంపే మాస్క్ కిల్లర్… టెర్రీఫయింగ్ టైమ్ లూప్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×